Showing posts with label భలే దొంగలు--1976. Show all posts
Showing posts with label భలే దొంగలు--1976. Show all posts

Monday, June 21, 2010

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు,P.సుశీల


చూశానే ఒ లమ్మీ చూశానే
వేశానే కన్ను వెసానే
ఇన్నాల్లు నాకొసం దాచిన అందం నీలో చూశానె
చూశావా ఒ రబ్బి చూశావా
వెశావా కన్ను వెశావా
ఇన్నాల్లు నీ కొసం దాచిన అందం నాలో చూశావా
ఒ రబ్బి చూశావా
చూశానే ఒ లమ్మీ చూశానే...


:::1


కసిగొలిపె నీ చూపుల తీరు..
ఆహహా...
ఉసిగొలిపె నీ ఊపుల జోరు
అహ హ హా ..
నీ కొంగైన..ఆ..తగలక ముందే
నీ కొంగైన తగలక ముందే
తేనెల వానలు కురిపించే..
నిను చూశానే ఒ లమ్మీ చూశానే
వేశానే కన్ను వేశానే


:::2


పెదవులు నీకై తడబడుతుంటే..ఎ ఎ ..
హాయ్ హాయ్ ..
కన్నులు నీకై కలగంటుంటే
అరె రె రె..
నీ కౌగిలిలో..ఆ..చేరక ముందే
నీ కౌగిలిలో చేరక ముందే..
కరిగి కరిగి నే నీరవుతుంటే
చూశావా ఒ రబ్బీ చూశావా
వేశావా కన్ను వేశావా


:::3


కొంటె కోరికలు కొరికేస్తుంటే
అహా హా ..
జంటకోసమై తరిమేస్తుంటే
దూరాలన్నీ..ఈ..తొలిగే సమయం
దూరాలన్నీ తొలిగే సమయం తొందరలోనే రాబోతుందని
చూశావా..ఒ రబ్బీ చూశావా
వేశావా కన్ను వేశావా
ఇన్నాళ్ళు నాకోసం దాచిన అందం నీలో
చూశావా..చూశానే
వేశావా..కన్ను వేశానే

Sunday, June 20, 2010

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల

తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని

:::

అందమైనా చిన్నవాడు అలిగినా అందమే
అందమైన చిన్నవాడు..అలిగినా అందమే
పిలిచిన కొలది బిగుసుకుపోయే బింకాలింక చాలు
నంగనాచి ఆడపిల్లా..బొంకినా చెల్లులే
కాటుక కన్నుల కవ్విస్తావు..నాటకమింకా చాలు
నంగనాచి ఆడపిల్లా...బొంకినా చెల్లు ...లే..ఏ

ఆహా..ఏహే..
హే..ప్రేమ వలలోన..ప్రియుడు పడగానె..అలుసు చేస్తారు అమ్మాయిలూ..ఊ..
ఆ..ఏదొ సరదాకు..మాట అంటేను..బెట్టు చేస్తారు అబ్బాయిలూ
మారాము గారాము చాలించు
నీ మారాము గారాము చాలించూ..ఊ

నంగనాచి..ఆహా..ఆడపిల్ల..ఓహో..బొంకినా చెల్లులే

హా..ఏమి కావాలో..నీకు ఇస్తాను..మనసు నీ సొమ్ము చేసానులే
ఆ..నువ్వు కావాలి..నవ్వు కావాలి..ఇపుడె నాలోన కలవాలిలే..
నా ముద్దు ఈ పొద్దు తీరాలే
ఊ..నా ముద్దు ఈ పొద్దు తీరాలీ


అందమైన ఊ..చిన్నవాడు..ఆ..అలిగినా అందమే
కాటుక కన్నుల కవ్విస్తావు..నాటకమింకా చాలు

నంగనాచి..ఆహా..ఆడపిల్ల..ఆహా..బొంకినా చెల్లులే
ఆ..ఆహహాహా..లా ల లాలా లలలలాలలా
లాలా ఆ..లలల లలలా
లాల లాలా..లల లాలా...

Saturday, May 29, 2010

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::గోపి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని

పల్లవి::

రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా
కండలు పిండి మన కండలు పిండి 
పనిచేస్తే కొండలు పిండై పోవునురా
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా 
కండలు పిండి మన కండలు పిండి 
పనిచేస్తే కొండలు పిండై పోవునురా

చరణం::1

దోచుకునేందుకు దాచుకునేందుకు 
నిన్నటి వరకే చెల్లింది
దోచుకునేందుకు దాచుకునేందుకు 
నిన్నటి వరకే చెల్లింది
కష్ట మెవడిదో సుఖం వాడికే 
దక్కేరోజు వచ్చింది దక్కేరోజు వచ్చింది
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా
కండలు పిండి మన కండలు పిండి 
పనిచేస్తే కొండలు పిండై పోవునురా

చరణం::2

పేద ఎవడురా పెద్ద ఎవడురా 
అందరి రక్తం ఒకటేరా
పేద ఎవడురా పెద్ద ఎవడురా 
అందరి రక్తం ఒకటేరా
చావు పుట్టుకకు లేని తేడాలు 
బ్రతికేటప్పుడు..ఎందుకురా 
బ్రతికేటప్పుడు..ఎందుకురా
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా 
కండలు పిండి మన కండలు 
పిండి పనిచేస్తే కొండలు పిండై పోవునురా

చరణం::3

కన్న తల్లిని జన్మభూమిని 
ఏమిచ్చారని అడగొద్దు
కన్న తల్లిని జన్మభూమిని 
ఏమిచ్చారని అడగొద్దు
వారి కన్నీరు తుడిచే భారం 
మనపై వుందని మరవద్దు
మనపై వుందని మరవద్దు
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా 
కండలు పిండి మన కండలు పిండి 
పనిచేస్తే కొండలు పిండై పోవునురా
కండలు పిండి పనిచేస్తే కొండలు పిండై పోవునురా

Sunday, May 23, 2010

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::S.P.బాలు 
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని

పల్లవి::

అదీ..పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా..హేయ్ 

చరణం::1

ఆ..తియ్యని బందరు..తొక్కుడు లడ్డురా..ఆఆఆ 
మాంచి బంగినపల్లి..మామిడి పండురా..ఆఆఆ 
బంగారు బొమ్మల్లె..మెరిసిందిరా..ఆఆఆ
ఆ అందచందాలు..ఏమందురా..ఆఆఆ 
అందాల వలవేసి..లాగేస్తుంది..ఈ
మోజుల్లో ముంచేసి..మసిబూస్తుంది
అందాల వలవేసి లాగేస్తుంది..ఈ
మోజుల్లో ముంచేసి మసిబూస్తుంది
ఇంతా మంది శిశువులమూ ఇక్కడలేమా
కడివెడు నీళ్ళూ మోసుకవచ్చి కడిగెయ్యమా
అరె..పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా..రేయ్ 
నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా చిన్నా అబ్బా

చరణం::2

ఆ..సరసాల మురిపించు సిరిసిరిమువ్వ
పింగ్ పాంగ్ పింగ్ పాంగ్ 
చిరునవ్వులెగజిమ్ము చెకుముకి 
రవ్వ రవ్వ అబ్భబ్భా రవ్వ 
ముద్దులు గురిపించు మోహినిరా..ఆ
కనుసైగతో నన్ను కవ్వించెరా..ఆఆ
కనుసైగతో కాటు..వేస్తుందిరా
చిరునవ్వుతో..గొంతు కోస్తుందిరా
కనుసైగతో కాటు..వేస్తుందిరా
చిరునవ్వుతో..గొంతు కోస్తుందిరా
అరె..చస్తేనేమి స్వర్గంలోనా రంభ వున్నదీ
మన గురువుగారికి అక్కడకూడా ఛాన్సు ఉన్నది
పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా..రే.. 
నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా..రేయ్

Saturday, May 22, 2010

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని

పల్లవి::

వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
ప్రేమించినాడు పెళ్ళాడుతాడు
దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు

చరణం::1

ఇన్నాళ్ళవలె కాదు పెళ్ళంటే
మనువాడ వచ్చును మనసుంటే
మనువాడ వచ్చును మనసుంటే
అమ్మాయికి అబ్బాయి నచ్చాలి
అయినోళ్ళు వాళ్ళని మెచ్చాలి
అయినోళ్ళు వాళ్ళని మెచ్చాలి
బాజాలు వద్దు బాకాలు వద్దు
కట్నాలు కానుకలు అసలే వద్దు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
ప్రేమించినాడు పెళ్ళాడుతాడు
దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు

చరణం::2

దానాల్లో గొప్పది కన్యదానం అది
చేసినోళ్ళకొస్తుంది ఎంతో పుణ్యం
చేసినోళ్ళకొస్తుంది ఎంతో పుణ్యం
ప్రేమించుకున్నోళ్ళ పెళ్ళాపితే
అంతకన్న ఉండదులే మహా పాపం
అంతకన్న ఉండదులే మహా పాపం 
అవునంటే అందరికి ఆనందం
కాదన్నా ఆగదులే కల్యాణం
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
ప్రేమించినాడు పెళ్ళాడుతాడు
దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు