సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::వాణీజయరాం
తారాగణం::N.T.రామారావు,జయచిత్ర,నాగభూషణం,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,పండరీబాయి
పల్లవి::
మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు
పాల్గుణమాసం..శుక్రవారం
పాల్గుణమాసం శుక్రవారం బాగుందన్నాడు
ముహూర్తం..బాగుందన్నాడు
చరణం::1
ఏటికి అవతల తోటకు ఇవతల కలవాలన్నాడు
మరి ఏడీ లేడని ఇటు ఆటు చూస్తే ఎదురుగ వున్నాడు
నా ఒళ్ళంతా కళ్ళతోనే మెల్లగ కొలిచాడు
చలచల్లగ అల్లరిచేతులు సాచి అల్లుకుపోయాడు
అమ్మమ్మో..ఓ..అల్లుకుపోయాడు
పెదవులతో చూశాడు..అదోలా నవ్వేశాడు
ఆ..మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు
పాల్గుణమాసం శుక్రవారం బాగుందన్నాడు
ముహూర్తం..బాగుందన్నాడు..ఊఊఊ
చరణం::2
సిగ్గుకు రూపం వచ్చిందంటూ బుగ్గలు నిమిరాడు..ఊ
పైటకు ప్రాణం వచ్చిందంటూ పట్టుకులాగాడు
ఎందుకు మావా తొందర అంటే ఇదిగా చూశాడు
ఏమనుకోకు ఒకటే ఒక ముద్దిమ్మని అడిగాడు
అమ్మమ్మో..ఓ..అడిగాడు ఇచ్చింది ఒకటే గాని
ఎన్నో రుచులు నేర్పాడు
మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు
పాల్గుణమాసం శుక్రవారం బాగుందన్నాడు
ముహూర్తం..బాగుందన్నాడు..ఓఓఓఓఓఓఓఓఓఓఓ
No comments:
Post a Comment