Sunday, May 23, 2010

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::S.P.బాలు 
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని

పల్లవి::

అదీ..పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా..హేయ్ 

చరణం::1

ఆ..తియ్యని బందరు..తొక్కుడు లడ్డురా..ఆఆఆ 
మాంచి బంగినపల్లి..మామిడి పండురా..ఆఆఆ 
బంగారు బొమ్మల్లె..మెరిసిందిరా..ఆఆఆ
ఆ అందచందాలు..ఏమందురా..ఆఆఆ 
అందాల వలవేసి..లాగేస్తుంది..ఈ
మోజుల్లో ముంచేసి..మసిబూస్తుంది
అందాల వలవేసి లాగేస్తుంది..ఈ
మోజుల్లో ముంచేసి మసిబూస్తుంది
ఇంతా మంది శిశువులమూ ఇక్కడలేమా
కడివెడు నీళ్ళూ మోసుకవచ్చి కడిగెయ్యమా
అరె..పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా..రేయ్ 
నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా చిన్నా అబ్బా

చరణం::2

ఆ..సరసాల మురిపించు సిరిసిరిమువ్వ
పింగ్ పాంగ్ పింగ్ పాంగ్ 
చిరునవ్వులెగజిమ్ము చెకుముకి 
రవ్వ రవ్వ అబ్భబ్భా రవ్వ 
ముద్దులు గురిపించు మోహినిరా..ఆ
కనుసైగతో నన్ను కవ్వించెరా..ఆఆ
కనుసైగతో కాటు..వేస్తుందిరా
చిరునవ్వుతో..గొంతు కోస్తుందిరా
కనుసైగతో కాటు..వేస్తుందిరా
చిరునవ్వుతో..గొంతు కోస్తుందిరా
అరె..చస్తేనేమి స్వర్గంలోనా రంభ వున్నదీ
మన గురువుగారికి అక్కడకూడా ఛాన్సు ఉన్నది
పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా..రే.. 
నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా..రేయ్

No comments: