Sunday, May 23, 2010

ప్రేమ బంధం--1976




సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు.P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,వాణిశ్రీ,సత్యనారాయణ,రావికొండలరావు,జయమాలిని,జానకి 

పల్లవి::

పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే 
గువ్వలా ఒదిగితే రవ్వలా పొదిగితే 
నిన్ను నేను నవ్విస్తే నన్ను నువ్వు కవ్విస్తే 
అదే ప్రేమంటే..అదే..అదే..అదే..అదే          

చరణం::1

అంతలోనే మాట ఆగిపోతుంటే 
తనకు తానే పైట జారిపోతుంటే 
అంతలోనే మాట ఆగిపోతుంటే 
తనకు తానే పైట జారిపోతుంటే 
గుండెలో చల్లని ఆవిరి గుస గుస 
పెడుతుంటే గుండెలో చల్లని ఆవిరి 
గుస..గుస..పెడుతుంటే 
తడవ తడవకూ పెదవుల తడియారి పోతుంటే
ఎండలో చలివేస్తే వెన్నెల్లో చెమరిస్తే 
అదే అదే అదే అదే..ప్రేమంటే..అదే అదే అదే అదే 

చరణం::2

కందిన చెక్కిలి కధలేవో చెబుతుంటే 
అందని కౌగిలి ఆరాటపెడుతుంటే 
కందిన చెక్కిలి కధలేవో చెబుతుంటే 
అందని కౌగిలి ఆరాటపెడుతుంటే
కాటేసిన వయసేమో కంటి కునుకునే 
కాజేస్తుంటే కాటేసిన వయసేమో 
కంటి కునుకునే కాజేస్తుంటే
మాటేసిన కోరికలే వేటాడుతూ వుంటే 
ఇద్దరూ ఒకరైతే ఆ ఒక్కరూ మనమైతే 
అదే ప్రేమంటే..అదే అదే అదే 
అదే అదే అదే లల లల లల 

No comments: