Friday, April 30, 2010

చల్లని నీడ--1968




సంగీతం::T. చలపతిరావు
నిర్మాతలు::K.V.సుబ్బయ్య, చలపతిరావు
గానం::S.జానకి
దర్శకత్వం::తాతినేని రామారావు
సంస్థ::జనరంజని ఫిలింస్
తారాగణం: హరనాథ్, జమున, గుమ్మడి, అంజలీదేవి, గీతాంజలి

పల్లవి:::

మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో

చరణం::1

ముద్దుల మూటలు కట్టుకుని
ముచ్చటలెన్నో మోసుకొని
రవ్వలు కురిసే చిరునవ్వులతో
ఎవ్వరికోసం వచ్చారో
మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో

చరణం::2

చుక్కల పల్లకిలో సాగి
మబ్బుల దారుల ఊరేగి
ఏ చెలి కోసం తెచ్చారో
మీరెవరో ఏ వూరో ఏ పేరో
ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా
మీరెవరో

చరణం::3

వచ్చిన ప్రియునికి ఎదురేగి
వెచ్చని కౌగిలినే కోరి
సిగ్గుల తెరలో దాగిన చెలికి
కోరినవన్ని ఇచ్చారో

No comments: