Monday, June 08, 2009

అగ్ని పర్వతం--1985



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి


వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

ఆ హా..వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

అందాలమ్మా..ఆటపాట..ఆణిముత్యాలా
బింకాలన్నీ ఎండల్లోన..మంచుముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
ఆ హా వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

తకిట తనం తానం తనంతానం
తకిట తనం తానం తనంతానం

నీరెండల్లో నీ అందాలు..నారింజల్లో రత్నాలూ
పూదండల్లో దారంలాగా..నాగుండెల్లో రాగాలూ
కంటిముద్దు పెట్టేలోగా..గాలిచీర కట్టేలోగా
నల్లనిజళ్ళో నీలాలన్నీ..ఎవ్వరికిస్తావో

వేకువమ్మ చూసేలోగా..పాపిటంతతీసేలోగా
నున్నని మెళ్ళో వెన్నెలహారం..ఎప్పుడు వేస్తావూ
మందారమొగ్గకన్న బుగ్గెర్రనా..మాణిక్యరవ్వకన్న తానెర్రనా
మరుమల్లెపూవుకన్న..తను తెల్లనా
ఎన్నెల్లో పాలకన్న ఎద తెల్లనా

ఆ హా వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

నా కళ్ళల్లో నీ రూపాలు..వాకిళ్ళలో దీపాలూ
దీపాలన్నీ చెరిపె నిన్ను చేసారేమో దైవాలూ
లేతపూలు కోసేలోగా..లేతగాలి వీసేలోగా
చల్లని నీడల చాటున సందడి..ఎప్పుడు చేస్తావో

ఎర్రబొట్టు పెట్టేలోగా..కుర్రపొద్దు పుట్టేలోగా
చీకటిసందున చిక్కిన కౌగిలి ఎప్పుడువస్తావో
చామంతి చెంపపైన చెయ్యేసుకో..పారాణి ఆశలన్ని పండించుకో
సిగ్గింటి గోడదాటి..నన్నందుకో..ముగ్గింటిదారితోక్కి నన్నేలుకో

ఆ హా..వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

అందాలమ్మా..ఆటపాట..ఆణిముత్యాలా
బింకాలన్నీ ఎండల్లోన..మంచుముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
ఆ హా వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హూ మ్మ్ మ్మ్ మ్మ్
తననం తనన తననం తనన..తననం తనన
తననం తనన తననం తనన..తననం తనన

No comments: