సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల
హ హ హా.. ఆ ఆ హా హా హ
హు హు హూ..హూ హు హు
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు
ఆమని చీరలు చుట్టుకుని కౌగిలి ఇల్లుగ కట్టుకొని
శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకొని
చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకచిలుకల్లాగా
చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకచిలుకల్లాగా
ఉయ్యాలలూగే వయ్యారంలో సయ్యాటాడే శౄంగారంలో
ఏ వసంతమిది....ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు
వేసవి గాల్పులు తట్టుకుని..ప్రేమని పేరుగ పెట్టుకుని
శ్రావణ సంధ్యల తొలకరి మెరుపులు పువ్వులుగా నను చుట్టుకుని
జిలిబిలి సిగ్గుల ముగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా
జిలిబిలి సిగ్గుల ముగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా
ౠతువేదైనా అనురాగంలో..ఎన్నడు వీడని అనుబంధంలో
ఏ వసంతమిది...ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు...
హా హా అహహా..మ్మ్ హు హూ మ్మ్హు హు మ్మ్ హుహు
No comments:
Post a Comment