Tuesday, September 01, 2009

సెక్రేటరి ~~ 1973



సంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


చాటు మాటు సరసంలో..ఘాటువున్నదీ
ఘాటైన ప్రేమకూ..ఆటుపోటులున్నవీ
ఆట్లుపోట్లకవి జడవనన్నదీ..
అందుకే..మనమిలా..కలుసుకొన్నదీ..
కలుసుకొన్నదీ...
చాటుమాటు సరసంలో..ఘాటువున్నదీ..

పరువూ గిరువు..పగ్గాలన్నీ తెగ తెంచేసీ..
పైలా పచ్చీ పదహారేళ్ళను..కలబోసేసీ..2
పగలూ..రేయీ..గీసే..పరుగులు..నిలవేసేసీ..2
పరవానంత జుర్రుకొంద్దాం..పగబట్టేసీ..
అ..హా..అ..హా..అ..హా..అ..హా

చాటు మాటు సరసంలో..ఘాటువున్నదీ
ఘాటైన ప్రేమకూ..ఆటుపోటులున్నవీ
ఆట్లుపోట్లకవి జడవనన్నదీ..
అందుకే..మనమిలా..కలుసుకొన్నదీ..
కలుసుకొన్నదీ...ఆ..హాహా..
చాటుమాటు సరసంలో..ఘాటువున్నదీ..

చాకులాంటి యవ్వనాన్ని వాడిపోనీకూ..
సాకులెన్ని చెప్పుకొన్నా..వాడిరాబోదూ..2
ఆకుచాటు పూవల్లే..అణిగి ఉండకూ..2
నీకు నేనూ..నాకు నివ్వని..నిలబడి చూడూ..
ఆ అ హా..ఆ అ హా.. ఆ అ హా..ఆ అ హా..

చాటు మాటు సరసంలో..ఘాటువున్నదీ
ఘాటైన ప్రేమకూ..ఆటుపోటులున్నవీ
ఆట్లుపోట్లకవి జడవనన్నదీ..
అందుకే..మనమిలా..కలుసుకొన్నదీ..
కలుసుకొన్నదీ......
లాల్ల..లాల..లలలలా..లాలలాలలా...

No comments: