Tuesday, September 01, 2009

అంతులేని కథ--1976





సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు.

తారాగణం::కమల్ హసన్,జయప్రద, సరిత, రజనీకాంత్ (పరిచయం) 

తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల

ఒహొహూ అహహా ఊహూహు..యే హే హే..
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా..

వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను..
కాకులు దూరని కారడవి..
అందులో. కాలం యెరుగని మానోకటి..
ఆ అందాల మానులో!!ఆ అద్బుత వనంలో!!
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా..
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా....
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు..మిన్నంటి మోగెనమ్మా..
థుంథుంథుంథుం..థుథుంథుథుం..థుంథుంథుంథుం..థుథుంథుథుం
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు..మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా..
శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మ్రోగెనమ్మా..
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా..

గోమాత లేగతొ కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా..
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా..
Wish you both a happy life... happy happy married life
హి హహ హీ హ హ...హి హి హ హ...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా....
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...

చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాలా...

No comments: