Tuesday, September 01, 2009

సెక్రేటరి ~~ 1973



సంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలపెళ్ళి..చేత్తం రారండీ
తీయనిలడ్డు..పాయసాలు..తింద్దాం రారండీ..2

చిట్టిపొట్టి బొమ్మలేనని బ్రమలో పడకండీ
చేసేద్దాము వాళ్ళకు పెళ్ళని తొందరపడకండీ
ఏం..బొమ్మలేగా.....?
మట్టిబొమ్మలని అనుకొన్నామా..
మనసులున్నవీ..ఇద్దరికీ..
గాజుబొమ్మలని అనుకోలేమూ..
కనపడవూ..ఆ..మనసులు పైకీ

ఒకరికి..పొగరూ..ఒకరికి..బిగువూ..
ఒద్దిక కుదిరే..దెన్నటికీ..

ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలపెళ్ళి..చేత్తం రారండీ
తీయనిలడ్డు..పాయసాలు..తింద్దాం రారండీ

చిట్టి..చిట్టి..మా అబ్బాయి కృష్ణుడోయమ్మా..
పొట్టి..పొట్టి..మీ అమ్మాయి రుక్మిణేనమ్మా..
చిట్టి..చిట్టి..మా అబ్బాయి కృష్ణుడోయమ్మా..
పొట్టి..పొట్టి..మీ అమ్మాయి రుక్మిణేనమ్మా..

కాదమ్మా..కానేకాదు..
రుక్మిణి ఎంతో..గడుసరిది..
తన వలపులు అతనికి తెలిపినదీ
ఆ..వలచిన వానిని..పొందినదీ..

చిన్నతనాన బొమ్మలపెళ్ళీ..చేస్తారూ..
పెరిగి తామే..పెళ్ళి బొమ్మలై..పోతారూ..
ఆటకాదు..పెళ్ళంటే..బొమ్మాకాదు..మనిషంటే..

ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలేనని బ్రమలో పడకండీ
చేసేద్దాము వాళ్ళకు పెళ్ళని తొందరపడకండీ

చిట్టిపొట్టి కథలే నువ్వు..చెప్పెస్తున్నావూ
చెప్పవమ్మ..ఎక్కడనువ్వు..చదివా ఈ కథనూ
మనిషి మనిషికీ..కథ వుంటుందమ్మా..
బ్రతును మించిన కథ ఏమున్నది
చదువులు ఎందుకు దానికీ..
మనసును చదివే..మనసుంటే..
కథ మలుపు తిరగదా..ఎన్నటికీ..

తీరిన కథనూ..తిరిగి వ్రాసితే..
తీయగ ఉండదూ..ఎవ్వరికీ...

ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలపెళ్ళి..చేత్తం రారండీ
తీయనిలడ్డు..పాయసాలు..తింద్దాం రారండీ

No comments: