రచన::ఆత్రేయ
సంగీతం::M.S.విశ్వనాథన్
గానం::L.R.ఈశ్వరీ
అరె ఎమిటి లోకం..పలు కాకుల లోకం
మమతన్నది ఒఠ్ఠీ పిచ్చి..మనసన్నది మరో పిచ్చి
మన గిన తోసిపుచ్చి..అనుభవించు తెగ్గించు
గానుకెక్కి తిరిగితే కాశి దాక పోవునా
పరుల కొరకు పాటుపడితే పడుచు కోరిక తీరునా
చీమలను చూసైనా నేర్చుకోవే స్వార్ధం
వయసు కాస్త పోయినాక మనసు ఉన్నా వ్యర్ధము
ఫటా ఫట్
గీత గీసి ఆగమంటే సీత ఆగలేదుగా
సీత అక్కడ ఆగి ఉంటే రామ కధే లేదుగా
గీతలు నీతులు దేవుడివి కావులే
చెతగాని వాళ్ళు తాము వెసుకున్న కాపులే
ఫటా ఫట్
మరులు రేపు వగలు సెగలు మన్మధుని లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులు
సొగసులన్ని స్రుష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినప్పుడే పరువానికి గెలుపులు
ఫటా ఫట్
No comments:
Post a Comment