పసివాడి ప్రాణం 1987
సంగీతం::చక్రవర్తి
రచన::?
గానం::SP.బాలు,S.జానకి
ఇదేదో గోలగావుందీ..ఎదంతా వేడిగావుందీ
అదేం గుబులు..ఇదేం తెగులు..ఇదేనా ఈడంటే....హోయ్
ఇదేదో గోలగావుందీ..నీమీదే..గాలిమళ్ళింది
ఒకే చొరవా..ఒకే గోడవా..అదేలే ఈడంటే....హ్హ
ఒంటిగా పండుకో మీరు..కంటికే మత్తురానీరూ
అదేధ్యాసా..అదే ఆశ..నే నాగేదెట్టాగా..
పువ్వులే పెట్టుకోనీరూ..బువ్వనే ముట్టుకోనీరూ
అదేం పాడో..ఇదేం గోడో..నే నేగేదెట్టాగా..
కోరికే తహతహ మంటాది..ఊపిరే చలి చలి గుంటాది
అదేం సెగలో..ఇదేం పొగలో..అదేలే ఈడంటే....హాయ్
ఇదేదో గోలగావుందీ..ఎదంతా వేడిగావుందీ
ఒకే చొరవా..హోయ్..ఒకే గోడవా..ఆ..అదేలే ఈడంటే..హ్హ
గుడ్డకే సిగ్గురాదాయే..మనసుకే బుద్ధిలేదాయే
అదే రాత్రి..అదే పగలు..నే చచ్చేదెట్టాగా..
చెప్పినా ఊరుకోదాయే..వాయిదా వేయనీదాయే
అదేం చిలకో..అదేం పులకో..నే బతికేదెట్టాగా..
రెప్పలో రెపరెపగుంటాది..రేతిరే కాల్చుకో తింటాది
అవేం కలలో..అదేం కథలో..అదేలే ప్రేమంటే..హాయ్
ఇదేదో గోలగావుందీ..నీమీదే..గాలిమళ్ళింది
ఒకే చొరవా..ఒకే గోడవా..అదేలే ఈడంటే....హ్హ
ఇదేదో గోలగావుందీ..ఎదంతా వేడిగావుందీ
అదేం గుబులు..ఇదేం తెగులు..ఇదేనా ఈడంటే....హోయ్..హోయ్..హహహ
No comments:
Post a Comment