సంగీతం::రాజ్‌కోటి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రాధ,కైకాలసత్యనారాయణ,కోటాశ్రీనివాస్‌రావు,అల్లురామలింగయ్య.
పల్లవి::
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ..అందాలనేది..అందగనే..సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
చరణం::1
చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన ఉక్కిరిగుంటలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే..రుచితెలిపే..తొలివలపే..హా
ఓడివలపై మొగమెరుపై జతకలిపే..హా
తీయనిది..తెర తీయనిది
తీరా అది చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం..అ..ఆహ
అధరం తాంబూలం..అ..ఆహ
అసలే చలికాలం త..త్తర
తగిలే సుమ బాణం త..త్తర
కువవకువవా..కువవకువవా
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
చరణం::2
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై..హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హై
ఇచ్చినదీ..కడు నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే..హే
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ..ఆహ
అధరం తాంబూలం..అ..ఆహ
అసలే చలికాలం..ఎ..ఎహే
తగిలే సుమ బాణం..అ..ఆహా
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ..అందాలనేది..అందగనే..సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే
No comments:
Post a Comment