Showing posts with label మంచిమనిషి-1964. Show all posts
Showing posts with label మంచిమనిషి-1964. Show all posts

Friday, November 23, 2007

మంచి మనిషి--1964




















సంగీతం::S.రాజేశ్వర రావ్,చలపతి రావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల


రాననుకున్నావేమో..ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో..ఏమో
ఏమనుకున్నారేమో..తమరేమనుకున్నారేమో
మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో..ఏమో

చక్కని కన్యవు ముక్కున కోపం నీకేలా..నీకేలా
చల్లగాలిలో ఆటలాడగా రావేలా..రావేలా
పిలిచినవెంటనె పరుగున చెంతకు చేరాలా..చేరాలా
వలచివచ్చి నే చులకనైతిగా ఈవేళా..ఈవేళా
ఏమనుకున్నారేమో..తమరేమనుకున్నారేమో
మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో..ఏమో

దొరగారేదో తొందరపనిలో మునిగారా..మునిగారా
అందుచేతనే అయినవారినే మరిచారా..మరిచారా
నిజమే తెలియక నిందలు వేయకు నామీదా..నామీదా
మాటవిసురులు మూతివిరుపులు మరియాదా..మరియాదా
రాననుకున్నావేమో..ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో..ఏమో

క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే..నిలిచానే
నిన్ను చూడగా యుగమె క్షణముగా గడచేనే..గడచేనే
ఎడబాటన్నది ఇకపై లేదని అందామా..అందామా
ఈడుజోడుగా తోడునీడగా ఉందామా..ఉందామా
ఆ . . . ఓ . . .

మంచి మనిషి--1964



















రచన::కోసరాజు
సంగీతం::S.రాజేశ్వర రావు,చలపతి రావ్
గానం::ఘంటసాల


ఏవండీ..ఏవండోయ్
ఏమండీ..ఇటు చూడండీ..
ఒక్కసారి ఇటు చూశారంటే మీసొమ్మేది పోదండీ
ఏమండీ ఇటు చూడండీ..ఏమండోయ్..

సిగలోన దాగిన మల్లెమొగ్గకు బిగువెందుకొ చెప్పాలండీ
వరసైన వన్నెల రామచిల్కకు పొగరు కాస్త తగ్గాలండీ
మన స్నేహము మోమాటము పొడిమాటలతోనే పోదండీ
ఏమండీ..ఇటు చూడండీ..
ఒక్కసారి ఇటు చూశారంటే మీసొమ్మేదీ పోదండీ,ఏమండోయ్

మనసంత మాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం
మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం
మనసంత మాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం
మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం
వగలెందుకు..సెగలెందుకు ఈసారికి ఏదో పోనీండి
ఏమండీ..ఇటు చూడండీ..ఏమండోయ్

మిము నమ్ముకొన్న నేస్తగాడు మీవెంటనె ఉన్నాడండీ
ఏనాటికీ ముమ్మాటికీ తన మనసే మీదన్నాడండీ
కవ్వించక కథ పెంచక ఔనంటే అంతే చాలండీ
ఏమండీ..ఇటు చూడండీ..ఒక్కసారి ఇటు చూశారంటే
మీసొమ్మేదీ పోదండీ...ఏమండోయ్

మంచిమనిషి--1964






















రచన::Dr.C.నారాయణరెడ్డి
సంగీతం::S.రాజేశ్వరరావు,T.చలపతిరావు
గానం::P.B.శ్రీనివా
స్


ఓ గులాబీ..ఓ గులాబీ
వలపు తోటలో విరిసిన దానా..
లేత నవ్వులా..వెన్నెల సోనా..

ఓహో గులాబి బాలా..అందాల ప్రేమ మాలా..
సొగసైన కనులదానా..సొంపైన మనసుదానా..
నీ వాడెవఋఒ తెలుసుకో..తెలుసుకో..తెలుసుకో..
ఓహో గులాబి బాలా..అందాల ప్రేమ మాలా..

కొంటె తుమ్మెదలవలెచెవూ..తుంటితేనెలందించెవూ..
కొంటె తుమ్మెదలవలెచెవూ..తుంటితేనెలందించెవూ..
మోసం చేసీ మీసం దువ్వే మోసకారులకు లోంగేవూ..లోంగేవూ..
ఓహో గులాబి బాలా..అందాల ప్రేమ మాలా..

రూపం చూసీ వస్తారు..చూపులగాలం వేస్తారు
రూపం చూసీ వస్తారు..చూపులగాలం వేస్తారు
రేకులుచిదిమీ..సొగసులు నునిమీ..
చివరకు ద్రోహం చేస్తారు..చివరకు ద్రోహం చేస్తారు

ఓహో గులాబి బాలా..అందాల ప్రేమ మాలా..
సొగసైన కనులదానా..సొంపైన మనసుదానా..
నీ వాడెవఋఒ తెలుసుకో..తెలుసుకో..తెలుసుకో..
ఓహో గులాబి బాలా..అందాల ప్రేమ మాలా..

మంచిమనిషి--1964


రచన::Dr.C.నారాయణరెడ్డి
సంగీతం::S.రాజేశ్వరరావు,T.చలపతిరావు
గానం::ఘంటసాల,P.సుశీల


అంతగా నను చూడకు …ష్…మాటాడకు
అంతగా నను చూడకు..వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు

చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను
చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను
తలుపులే కవ్వించెను వలవుల వీణలు తేలించెను
అంతగా నను చూడకు …ష్…మాటాడకు
అంతగా నను చూడకు వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు

జిలిబిలి ఊహలు రేగెను నా చేతులు నీకై సాగెను
జిలిబిలి ఊహలు రేగెను నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను …పదునౌ చూపులు బాధించెను
హోయ్ అంతగా నను చూడకు వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు

వాలుగ నిన్నే చూడనీ కలకాలము నీలో దాగనీ
వాలుగ నిన్నే చూడనీ కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ పువ్వుల సంకెల బిగించనీ
హోయ్ అంతగా నను చూడకు..ష్..మాటాడకు
అంతగా నను చూడకు వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు