Monday, December 24, 2007

కన్నవారి కలలు --1974

సంగీతం::V.కుమార్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల

తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు

తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

ఎన్నడు నీకన్నులు నాకన్నులతో మాటాడు కొన్నాయో 

ఎన్నడు నీకన్నులు నాకన్నులతో మాటాడు కొన్నాయో
ఎన్నడు నీ చేతులు నా చేతులతో ఆటాడు కొన్నాయో 

ఎన్నడు నీ చేతులు నా చేతులతో ఆటాడు కొన్నాయో
పొదలో ప్రతిపూవూ పొంచి పొంచి చూసినదీ
భువిలో ప్రతిగువ్వా గుసగుసలాడినవి
కలసిన కౌగిలిలో కాలమే ఆగినదీ

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా 

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా 

మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
ఆ....కొంటెగా నిన్నేదో కోరాలనివుంది
ఆ....తనువే నీదైతే దాచేదేముంది
మనసులవీణియపై బ్రతుకే మ్రోగిందీ

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

No comments: