Tuesday, June 14, 2011

డాక్టర్ ఆనంద్--1966

















సంగీతం::K.V.మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్ర్తి
గానం::P.సుశీల బృందం


నీలమోహనా..రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా..రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా..రారా

జారువలపు జడివాన కురిసెరా
జాజిలత మేను తడిసెరా
జారువలపు జడివాన కురిసెరా
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా
నీలమోహనా..రారా....రారా....రారా..

ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘములగనీ
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘములగనీ
ప్రతిమబ్బు ప్రభువైతే
ప్రతికొమ్మ మురళైతే ఏలాగె
ఆ...ఏలాగె మతిమాలి
ఏడే నీ వనమాలి
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా..రారా....రారా....రారా..

ఆ...సారెకు దాగెదవేమి?
నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ?
సారెకు దాగెదవేమి..?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా
కృషా కృష్ణా కృష్ణా..ఆ..
సారెకు దాగెదవేమి..?

అటు..అటు..ఇటు..ఇటు..
ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా
నీలిమేఘమాకాశము విడిచి
నేల నడుస్తుందా
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా
నీలిమేఘమాకాశము విడిచి
నేల నడుస్తుందా

నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా
నవ్వే పెదవులకు మువ్వల మురళుందా
పెదవి నందితే పేద వెదుళ్ళు
కదిలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు
మువ్వల వేణువులు..మువ్వల వేణువులు

డాక్టర్ చక్రవర్తి--1964::జోంపూరి::రాగం


















చిమ్మటలోని ఈ పాట మనందరి కోసం



సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

రాగం:::జోంపూరి:::

ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

అడుగు అడుగున అపజయముతో అలసిసొలసిన నా హృదయానికి
సుధవై...సుధవై జీవనసుధవై ఉపశాంతివ్వగా ఓర్వనివారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటె
అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటె
ఆనందంతో మురిసానే, ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం అపనిందేనా
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం,ఇది మారని లోకం
మానవుడే దానవుడై మసలే చీకటి నరకం

ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

మంచి మనసుకు మంచి రోజులు--1958



ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి

మంచి మనసుకు మంచి రోజులు (1958)
సంగీతం::ఘంటసాల
రచన::కోసరాజు
గానం::ఘంటసాల

సాకీ::
వేళగాని వేళలో ఊరు విడిచి దూరంగా...
కారెక్కి ఒంటిగా...
గాలిమేయ వచ్చిన బూచి..నంగనాచీ...

పల్లవి::

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట

చరణం::1

చల్లని వెన్నెల కాస్తుంటే
చల్లగా ఇంట్లో నేనుంటే
తలుపుమూసి చెప్పకనే..ఏ..
దౌడేసిన రాకాసి..ఓ రాకాసి

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట

చరణం::2

ఏ బస్తీ కిలాడీ..
నా పేరే పల్లెటూర్ వస్తాదు రౌడీ
నీ తెలివంతాజూసి నను గెలిచావా..ఆ..లేడీ
చిక్కావు చేతిలో కేడీ షోకైన లేడీ అహ్హహ్హహా...

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట

Monday, June 13, 2011

మంచి మనసుకు మంచి రోజులు--1958

మంచి మనసుకు మంచి రోజులు--1958


సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల జూనియర్
గానం::రావుబాలసరస్వతీదేవి


ధరణికి గిరి భారమా
గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా
కనిపెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారవూ
గిరికి తరువు భారవూ
తరువుకు కాయ భారమా
కని పెంచే తల్లికి పిల్ల భారమా

మును నే నోచిన నా నోముపండగా
నా ఒడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక
పూయని తీవెననే అపవాదు రానీక
తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా
కని పెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారమా..గిరికి తరువు భారవూ
తరువుకు కాయ భారమా..కని పెంచే తల్లికి పిల్ల భారమా

ఆపద వేళల అమ్మమనసు చెదరునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా
తరువుకు కాయ భారమా..కని పెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారమా..గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా..కని పెంచే తల్లికి పిల్ల భారమా

గోకులంలో సీత--1997



సంగీతం::కోటి
రచన::వేటూరి
గానం::మాల్గాడి శుభ,K.S.చిత్ర
తారాగణం::పవన్ కళ్యాణ్, రాశి

పల్లవి::

తళక్ తళక్ అని..తళకుల తార
మిణక్ మిణక్ అని..మిల మిల తార
ఛమక్ ఛమక్ అని..చిలిపి సితార
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తళక్ తళక్ అని..తళకుల తార
మిణక్ మిణక్ అని..మిల మిల తార
ఛమక్ ఛమక్ అని..చిలిపి సితార
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
వహు వహు వాహు..వహు వహు వాహు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..లాలలాలలాలలా
మనసున్న కనులుంటే ప్రతిచోట 
మధుమాసం..కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా 
మనకోసం..అనిపించదా
బంగారు భావాల..ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా..ఆ ఆ ఆ ఆ ఆ 

తళక్ తళక్ అని తళకుల తార
మిణక్ మిణక్ అని మిల మిల తార
ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
తళక్ తళక్ అని తళకుల తార
మిణక్ మిణక్ అని మిల మిల తార
ఛమక్ ఛమక్ అని చిలిపి సితార

మనసున్న కనులుంటే ప్రతిచోట 
మధుమాసం..కనిపించదా..ఆ

చరణం::1

ఏ ఏ ఏహే..ఏ ఏ ఏహే..ఏ ఏ ఏహే 
అలలై ఎగసిన ఆశా.. నాట్యం చేసే వేళా..ఆ
ఆలుపే ఎరుగని శ్వాసా..రాగం తీసే వేళా
దిశలన్నీ తలవొంచి..తొలగే క్షణం
ఆకాశం పలికింది..అభినందనం
అదిగదిగో మనకోసం..తారాగణం
తళుకులతో అందించే..నీరాజనం
మనదారికెదురున్నదా..ఆ ఆ ఆ ఆ ఆ
మనసున్న కనులుంటే ప్రతిచోట 
మధుమాసం..కనిపించదా

చరణం::2

వహు వా ఆ ఆ..ఆ
నవ్వే పెదవులపైనా..ప్రతి మాట ఒక పాటే
ఆడే అడుగులలోనా..ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందం..కొలువున్నదా
ఎండైనా వెన్నెల్ల్లా..మురిపించదా
కాలాన్నే కవ్వించే..కళ ఉన్నదా
కష్టాలు కన్నీళ్ళు..మరిపించదా
జీవించడం..నేర్పదా..ఆ ఆ ఆ ఆ ఆ 

మనసున్న కనులుంటే ప్రతిచోట 
మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా 
మనకోసం..అనిపించదా
బంగారు భావాల..ప్రియగీతం
రంగేళి రాగాల..జలపాతం 
మనలోనే..చూపించదా..ఆ ఆ ఆ ఆ
లాలాల..లలలా..లలలా..లలలా..లాలలాల

Friday, June 10, 2011

గోకులంలో సీత--1997



సంగీతం::కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::పవన్ కళ్యాణ్, రాశి

పల్లవి::

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా..పిలుపును వినవమ్మా 
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా..పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా..విషమై పోకమ్మా 
వలపుల వనమా..ఆ..ఆ..ఆ..ఆ 
వెలుగుల వరమా..ఆ..ఆ..ఆ..ఆ 
ఈ ఎదలో కొలువుందువు..రావమ్మా 

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా..పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా..విషమై పోకమ్మా 

చరణం::1

ఎంత మధనమో..జరగకుండ 
ఆ పాల కడలి కదిలిందా..అమృతకలశమందిందా 
ఎన్ని ఉరుములో..విసరకుండ 
ఆ నీలినింగి కరిగిందా..నేలగొంతు తడిపిందా 
ప్రతి క్షణం హృదయం..అడగనిదే చలువనీయవ ప్రేమా 
ప్రకృతిలో ప్రళయం రేగనిదే..చిగురుతొడగవ ప్రేమా 
అణువణువూ సమిధలాయే..ఈయాగం శాంతిచేదెపుడమ్మా 
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా..పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా..విషమై పోకమ్మా 

చరణం::2 

ఆయువంతా..అనురాగ దేవతకి 
హారతీయదలిచాడు..ఆరిపోతు ఉన్నాడు 
మాయమైన..మమకారమేది అని 
గాలినడుగుతున్నాడు..జాలి పడవ ఈనాడు 
నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు 
ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు 
నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా 

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా..పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా..విషమై పోకమ్మా 
వలపుల వనమాఆఆ..ఆ..ఆ..ఆ 
వెలుగుల వరమాఆఆ..ఆ..ఆ..ఆ 
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా

Tuesday, June 07, 2011

మంచి మనసుకు మంచి రోజులు--1958::కల్యాణి::రాగం









సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల పాడినవారు::ఘంటసాల 

రాగం::కల్యాణి

కోమల కవితా తార..ప్రేమ సుధా ధారా
మనోహర తార..నా మధుర సితార ఆ..ఆ..
రావే నా చెలియా రావే నా చెలియా
చెలియా నా జీవన నవ మాధురి నీవే
నా జీవన నవ మాధురి నీవే
రావే నా చెలియా..

నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల
వెలుగున వేయి చంద మామలై
నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల
వెలుగున వేయి చంద మామలై
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే
తోచును అనురాగ గీతాలై తోచును అనురాగ గీతాలై
రావే నా చెలియా రావే నా చెలియా

నీ అందియల సందడిలోన
నా ఈ డెందము చిందులు వేయునే
నీ అందియల సందడిలోన
నా ఈ డెందము చిందులు వేయునే
నీ కను గీటులె వలపు పాటలే ఎ..ఆ..
నీ కను గీటులె వలపు పాటలే
నీ కడ సురలోక భోగాలే నీ కడ సురలోక భోగాలే
రావే నా చెలియా రావే నా చెలియా
చెలియా నా జీవన నవ మాధురి నీవే
రావే..రావే..రావే..రావే. నా చెలియా


Manchi Manasuku Manchi Rojulu--1958
Music::Ghatasaala
Lyrics::Samudraala
Singer's::Ghantasaala 

Komala kavitha thaara prema sudha dhaaraa
manohara thaaraa naa madhura sithaara...aaa....

Raave naa cheliyaa..Raave naa cheliyaa
cheliyaa naa jeevana nava maadhuri neeve
naa jeevana nava maadhuri neeve
Raave naa cheliyaa

Nee yela navvula poochina vennela
veluguna veyi chandamaamalai
Nee yela navvula poochina vennela
veluguna veyi chandamaamalai
Nee chiru gaajula chilipi mrothale
Nee chiru gaajula chilipi mrothale
thothunu anuraaga geethaalai
Raave naa cheliyaa, cheliyaa raave naa cheliya

Nee andhilyala sandhadi lona 
naa eedendhamu chindhulu veyune
Nee andhilyala sandhadi lona 
naa eedendhamu chindhulu veyune
Nee kanugeetule valapu paatale..aaa..aaa..aa...
Nee kanugeetule valapu paatale
nee kada suraloka bhogale
nee kada suraloka bhogale
Raave naa cheliyaa..
cheliyaa naa jeevana nava maadhuri neeve
Raave..Raave...Raave naa cheliyaa

Wednesday, June 01, 2011

గోకులంలో సీత--1997



సంగీతం::కోటి
రచన::వేటూరి
గానం::మను,K.S.చిత్ర
తారాగణం::పవన్ కళ్యాణ్, రాశి

పల్లవి::

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 
వరించి నన్ను చేరుమా..సుఖాన ముంచి తేల్చుమా
ప్రియాతి ప్రియతమా..ఇదేమి సరిగమా 
శృంగార వీణ మీటి..గోల చేస్తే న్యాయమా 

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 

చరణం::1 

రా రమ్మంది..లేత చెక్కిలి 
రేపెట్టింది కొత్త..ఆకలి 
సిగ్గు మొగ్గ..మేలుకుంది తియ్యగా 
తేనె ముద్దలారగించు..హాయిగా 
అంత భాగ్యమా..పంచ ప్రాణమా 
ఒడిలో చేరనీయుమా..హో 

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 

చరణం::2 

లాగించేస్తే..ప్రేమ జిలేబి 
ఏమౌతుందో..కన్నే గులాబి 
పాలపొంగులాంటిదమ్మ..కోరిక 
పైటచాటు..దాచుకోకే ప్రేమికా 
కొంగుజారితే..కొంపమునగదా 
వాటే రిస్కు..మన్మథా 

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 
వరించి నన్ను చేరుమా..సుఖాన ముంచి తేల్చుమా 
ప్రియాతి ప్రియతమా..ఇదేమి సరిగమా 
శృంగార వీణ మీటి..గోల చేస్తే న్యాయమా 
మ్మ్..మ్మ్..మ్మ్

Tuesday, May 31, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్,గుమ్మడి,జయమాలిని,ప్రభ,గిరిబాబు.

పల్లవి::

హేయ్‌ పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా
పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  
అహ అసలూ తెలుసు అరె నకిల్లీ తెలుసు
అసలూ తెలుసు నకిల్లీ తెలుసు..అందరి గోత్రం తెలుసూ     
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  

చరణం::1

మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది
మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది 
ఇది రెచ్చిపోతే కోడెతాచులా ప్రాణం తీస్తుంది
నమ్మితె జే కొడుతుంది నచ్చితె జో కొడుతుంది
జే కొడుతుంది జో కొడుతుంది..మనసు విరిగితే మసిచేస్తుంది       
పబ్లిక్‌ రా.పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా 

చరణం::2

కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
సందేశాలూ దిగుమతిచేసే సమయం దాటిందీ
అరె మాటలకన్న చేతలు మిన్న
మాటలకన్న చేతులు మిన్న..కాదంటే మీ బ్రతుకులు సున్న    
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  

చరణం::3

అహ దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
దాచేస్తారా తిండిగింజలను ఎక్కడిదీ న్యాయం
మా ఆకలిముందు మా అలజడి ముందు
ఆకలి ముందు అలజడి ముందు..దోపిడి దొరల ఆటల బందు        
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా  
అహ అసలూ తెలుసు అరె నకిలి తెలుసు
అసలూ తెలుసు నకిలి తెలుసు..అందరి గోత్రం తెలుసూ     
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా