చిమ్మటలోని ఈ పాట మనందరి కోసం
సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
రాగం:::జోంపూరి:::
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
అడుగు అడుగున అపజయముతో అలసిసొలసిన నా హృదయానికి
సుధవై...సుధవై జీవనసుధవై ఉపశాంతివ్వగా ఓర్వనివారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటె
అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటె
ఆనందంతో మురిసానే, ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం అపనిందేనా
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం,ఇది మారని లోకం
మానవుడే దానవుడై మసలే చీకటి నరకం
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
2 comments:
పాట లిరిక్స్ రాసినందుకు చాలా సంతోషం. రాగం పేరు కూడా రాసారు కానీ ఇంత చక్కని సాహిత్యం రాసిన రచయిత పేరు రాయడం మరిచారా...??
రచైత పేరు గుర్తుకు రాక అలా వదిలేసాను సుధ
ఇప్పుడు రచైత పేరు తెలిసి వేసాను చూడు మరి
Post a Comment