Monday, June 13, 2011

మంచి మనసుకు మంచి రోజులు--1958


సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల జూనియర్
గానం::రావుబాలసరస్వతీదేవి


ధరణికి గిరి భారమా
గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా
కనిపెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారవూ
గిరికి తరువు భారవూ
తరువుకు కాయ భారమా
కని పెంచే తల్లికి పిల్ల భారమా

మును నే నోచిన నా నోముపండగా
నా ఒడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక
పూయని తీవెననే అపవాదు రానీక
తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా
కని పెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారమా..గిరికి తరువు భారవూ
తరువుకు కాయ భారమా..కని పెంచే తల్లికి పిల్ల భారమా

ఆపద వేళల అమ్మమనసు చెదరునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా
తరువుకు కాయ భారమా..కని పెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారమా..గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా..కని పెంచే తల్లికి పిల్ల భారమా

No comments: