Showing posts with label నేరం నాది కాదు ఆకలిది--1976. Show all posts
Showing posts with label నేరం నాది కాదు ఆకలిది--1976. Show all posts

Tuesday, May 31, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్,గుమ్మడి,జయమాలిని,ప్రభ,గిరిబాబు.

పల్లవి::

హేయ్‌ పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా
పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  
అహ అసలూ తెలుసు అరె నకిల్లీ తెలుసు
అసలూ తెలుసు నకిల్లీ తెలుసు..అందరి గోత్రం తెలుసూ     
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  

చరణం::1

మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది
మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది 
ఇది రెచ్చిపోతే కోడెతాచులా ప్రాణం తీస్తుంది
నమ్మితె జే కొడుతుంది నచ్చితె జో కొడుతుంది
జే కొడుతుంది జో కొడుతుంది..మనసు విరిగితే మసిచేస్తుంది       
పబ్లిక్‌ రా.పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా 

చరణం::2

కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
సందేశాలూ దిగుమతిచేసే సమయం దాటిందీ
అరె మాటలకన్న చేతలు మిన్న
మాటలకన్న చేతులు మిన్న..కాదంటే మీ బ్రతుకులు సున్న    
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  

చరణం::3

అహ దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
దాచేస్తారా తిండిగింజలను ఎక్కడిదీ న్యాయం
మా ఆకలిముందు మా అలజడి ముందు
ఆకలి ముందు అలజడి ముందు..దోపిడి దొరల ఆటల బందు        
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా  
అహ అసలూ తెలుసు అరె నకిలి తెలుసు
అసలూ తెలుసు నకిలి తెలుసు..అందరి గోత్రం తెలుసూ     
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా

Wednesday, May 25, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్,గుమ్మడి,జయమాలిని,ప్రభ,గిరిబాబు.

పల్లవి::

ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట         
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట          

చరణం::1

అహ పైసా చిమ్మాలన్నా..ఐసా పైసా తేల్చాలన్నా
అ ప్రాణం ఇవ్వాలన్నా..ఇచ్చిన ప్రాణం తీయాలన్న
అరె హా అన్నిటికీ తయారు..మన యెదుట వున్న హుజూరు 
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట          

చరణం::2

జానెడు పొట్టకు ఆటలేవో ఆడాలి
పట్టెడు బువ్వకు పాటలేవో పాడాలి
జానెడు పొట్టకు ఆటలేవో ఆడాలి
పట్టెడు బువ్వకు పాటలేవో పాడాలి
అరెహా ఇంత మంచి రసికుడు
ఇక ఈ జన్మకు దొరకడు 
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌
హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట          

చరణం::3

అరెరె మైకంలో ఉన్నాడూ..ఏదో లోకంలో ఉన్నాడూ
తాపంలో ఉన్నాడూ..అందం తాగాలంటున్నాడూ
అరె హా పట్టించు మందు..ఆపైన ఉంది విందు      
ఓ హైదరాబాదు బుల్‌ బుల్‌..హేయ్‌ చార్మినార్‌ చంచల్‌
నువ్వు ఆడిందే ఆట..నే పాడిందే పాట
ఆడిందే ఆట..నే పాడిందే పాట     

Sunday, May 08, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976



సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్, గుమ్మడి

పల్లవి::

చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
ఎపుడమ్మా...ఎపుడమ్మా  

చరణం::1

నేడుగాకున్న రేపైనా వసంతం రానే వస్తుంది
ఆహా ఓహో...అహా ఓహో
మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది
ఆహా ఓహో...అహా ఓహో
నేడుగాకున్న రేపైనా వసంతం రానే వస్తుంది
మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది
గాలిలా సాగిపోతేనే గమ్యము ఎదురౌతుందమ్మా
ఏరులా పొంగిపోతేనే సాగరం చేరువౌనమ్మా
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా  

చరణం::2

అహా ఓహో
మెత్తగా ఉంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది
ఆహా ఓహో...అహా ఓహో
ఆ కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
మెత్తగా వుంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది
కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది
విత్తనం నేలలో ఉంటే దానికి విలువే లేదమ్మా
మొక్కలా చీల్చుకొస్తేనే దానికీ ఫలితం ఉందమ్మా 
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా  

చరణం::3

పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది
వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది
కుమిలిపోతున్న గుండెల్లో తేనెలు కురిపించాలమ్మా
చీకటి కమ్మిన కళ్ళల్లో వెన్నెల చిలికించాలమ్మా
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా  

Monday, May 02, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976


సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.జానకి
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్,గుమ్మడి,జయమాలిని,ప్రభ,గిరిబాబు.

పల్లవి::

డైమన్‌ రాణీ గులాబీ బుగ్గ..నీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా...రా రా రా రా 
డైమన్‌ రాణీ గులాబీ..బుగ్గ నీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా...రా రా రా రా 

చరణం::1

నీ పెగ్గులో అసలు లేదోయి రాదోయి కిక్కు
నా బుగ్గలో ఉంది ఉందోయి ఏదో చమక్కు
ఈ మత్తులో గమ్మత్తుగా..మైమరచి ఊగాలిరా       
డైమన్‌ రాణీ గులాబీ బుగ్గనీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలాముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా...రా రా రా రా 

చరణం::2

ఈ సొంపులే మంచి ముత్యాల వజ్రాల సాటి
నా ఒంపులా నింపు పదివేల వరహాలకోటి
ఈ సొంపులే మంచి ముత్యాల వజ్రాల సాటి
నా ఒంపులా నింపు పదివేల వరహాలకోటి
అందాలతో బంధించుతా..సరదాలో ముంచుతా        
డైమన్‌ రాణీ గులాబీ బుగ్గ..నీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా..రా రా రా రా
డైమన్‌ రాణీ గులాబీ బుగ్గ..నీదే

Thursday, March 24, 2011

నేరం నాది కాదు ఆకలిది--1976

























సంగీతం::సత్యం
రచన::సినారె
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత, మురళీమోహన్, గుమ్మడి

పల్లవి::

మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పని యేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

చరణం::1

కత్తితో చేధించనిది కరుణతో..చేధించాలి
కక్షతో కానిది క్షమాభిక్షతో..సాధించాలి

తెలిసీ తెలీయక కాలు జారితే..ఏ..ఏ..ఏ..ఏ
తెలిసీ తెలియక కాలు జారితే..చేయూతనిచ్చి నిలపాలీ  

మనలో కాలు జారని వారు..ఎవరో చెప్పండి
లోపాలు లేని వారు..ఎవరో చూపండి
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి


చరణం::2

గుడులలో లింగాలను మింగే..బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే..మహా వ్యక్తులు కొందరు

ఆకలి తీరక నేరం చేసే..ఏ..ఏ..ఏ..ఏ
ఆకలి తీరక నేరం చేసే..అభాగ్యజీవులు కొందరూ 

మనలో నేరం చేయని వాడూ..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

చరణం::3

తప్పు చేసిన ఈ దోషిని..ఇప్పుడే శిక్షించాలి
మరపురాని గుణపాఠం..పదిమందిలో నేర్పించాలి

హ..హ..హ..ఐతే

ఎన్నడు పాపం చేయని వాడు..ఊ..ఊ..ఊ
ఎన్నడు పాపం చేయని వాడు..ముందుగ రాయి విసరాలి

మీలో పాపం చేయని వాడే..ఆ రాయి విసరాలి
ఏ లోపం లేని వాడే..ఆ శిక్ష విధించాలి

మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి

Neram Naadi Kaadu Akalidi--1976
Music::Satyam
Lyrics::sinaare
Singer's::S.P.Baalu
cast::N.T.RaamaaRao, Manjula,Latha,MuraliMohan,Gummad

:::

manchini samaadhi..chestaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham leni vaaDu..evaDO choopanDi

manchini samaadhi..chestaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham leni vaaDu..evaDO choopanDi

:::1

kattitO chedhinchanidi karunatO..chedhinchaali
kakshatO kaanidi kshamaabhikshatO..saadhinchaali

telisee teleeyaka kaalu jaarite..E..E..E..E
telisee teliyaka kaalu jaaritae..chaeyootanichchi nilapaalee  

manalO kaalu jaarani vaaru..evarO cheppaMDi
lOpaalu laeni vaaru..evarO choopaMDi
manchini samaadhi chEstaaraa..
idi manushulu chaesae paniyaenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham lEni vaaDu..evaDO choopanDi


:::2

guDulalO lingaalanu minge..baDaa bhaktulu kondaru
musugulO mOsaalu chese..mahaa vyaktulu kondaru

aakali teeraka nEram chese..E..E..E..E
aakali teeraka nEram chese..abhaagyajeevulu kondaroo 

manalO nEram cheyani vaaDoo..evaDO cheppanDi
ee dOsham lEni vaaDu..evaDO choopanDi

manchini samaadhi..chEstaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham lEni vaaDu..evaDO choopanDi

:::3

tappu chesina ee dOshini..ippuDE Sikshinchaali
marapuraani gunapaaTham..padimandilO nerpinchaali

ha..ha..ha..aitE

ennaDu paapam cheyani vaaDu..O..O..O
ennaDu paapam cheyani vaaDu..munduga raayi visaraali

meelO paapam cheyani vaaDe..aa raayi visaraali
ee lOpam leni vaaDe..aa Siksha vidhinchaali

manchini samaadhi..chestaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham leni vaaDu..evaDO choopanDi