Sunday, August 15, 2010

వెలుగు నీడలు--1961







సంగీతం::పెండ్యాల గారు
రచన::శ్రీ శ్రీ
గానం::P.సుశీల,ఘటసాల


పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక (2)

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం (2)
నేడే నవోదయం నీదే ఆనందం
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి..
సాగవోయి ప్రగతిదారుల (2)

ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు (2)
అవినీతి బంధుప్రీతి చీకటిబజారు
అలముకొన్న ఈదేశం ఎటుదిగజారు
కాంచవోయి నేటి దుస్థితి...
ఎదిరించవోయి ఈ పరిస్థితీ (2)
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక

పదవీవ్యామోహాలు కులమతభేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు (2)
ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే (2)
తనసౌఖ్యం తనభాగ్యం చూసుకొనే వాడే
స్వార్ధమే అనర్ధ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం (2)

సమసమాజ నిర్మాణమే
నీ ధ్యేయం నీధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె
నీ లక్ష్యం నీ లక్ష్యం (2)
ఏకదీక్షతో గమ్యంచేరిననాడే
లోకానికి మనభారతదేశం
అందించునదే శుభసందేశం


భారత స్వాతంత్ర్యదినోత్సవము


భారత స్వాతంత్ర్యదినోత్సవ సంధర్భముగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

భారత మాతకు...జై..జై......భారత మాతకు...జై..జై......భారత మాతకు...జై..జై.......










వెలుగు నీడలు
సంగీతం::ఘటసాల
రచన::శ్రీ శ్రీ
గానం::సుశీల,ఘటసాల

పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక (2)

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం (2)
నేడే నవోదయం నీదే ఆనందం
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి..
సాగవోయి ప్రగతిదారుల (2)

ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు (2)
అవినీతి బంధుప్రీతి చీకటిబజారు
అలముకొన్న ఈదేశం ఎటుదిగజారు
కాంచవోయి నేటి దుస్థితి...
ఎదిరించవోయి ఈ పరిస్థితీ (2)
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక

పదవీవ్యామోహాలు కులమతభేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు (2)
ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే (2)
తనసౌఖ్యం తనభాగ్యం చూసుకొనే వాడే
స్వార్ధమే అనర్ధ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం (2)

సమసమాజ నిర్మాణమే
నీ ధ్యేయం నీధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె
నీ లక్ష్యం నీ లక్ష్యం (2)
ఏకదీక్షతో గమ్యంచేరిననాడే
లోకానికి
మనభారతదేశం

అందించునదే శుభసందేశం










రాముడు--భీముడు
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::శ్రీ శ్రీ
గానం::P.సుశీల,ఘటసాల


ఉందిలే మంచి కాలం ముందు ముందూన
అందరూ సుఖపడాలి నందనందాన..2
ఉందిలే మంచి కాలం ముందు ముందూన

ఎందుకో సందేహమెందుకో..రానున్న విందులో..నీవంతు అందుకో (2)
ఆరోజు అదిగో కలదూ నీ యెదుటా..
నీవే రాజువట ఆ ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూన

ఏమిటేమిటేమిటే..మంచి కాలం అంటున్నావ్..
ఎలాగుంటుందో నిశితంగా చెప్పూ

దేశ సంపద పెరిగే రోజు..మనిషి
మనిషిగా బ్రతికే రోజు (2)
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో
అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో (2)

భలే భలే..బాగా చెప్పావ్..కాని
అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు

అందరికోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరూ కలిసి
సహకారమే మన వైఖరియైతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేదాగొప్పా భేదం పోయి అందరూ
నీదినాదని వాదం మాని ఉందురూ
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో
అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో (2)

తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖశాంతులూరగా
ఆకాశవీధుల ఎదురేలేకుండా
ఎగురును మన జెండా ఆ ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూన
అందరూ సుఖపడాలి నందనందాన..2
ఉందిలే మంచి కాలం ముందు ముందూన

అత్తా ఒకింటి కోడలే--1958




సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::జగ్గయ్య, రమణమూర్తి, రమణారెడ్డి, దేవిక, హేమలత,గిరిజ, సీత

పల్లవి::

హా…హహహహా..అహహా..హహహహా
ఆ..ఆ..ఆ..ఆ..ఆఆఆఆఆఆఆఆఆఆ
నాలో కలిగినది..అది యేమో యేమో 
మధురభావం నాలో..ఓ..కలిగినది 
అహహహా..హహహహా..అహహా..హహహహా
ఆ..ఆ..ఆ..ఆ..ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

చరణం::1

పెదవి దాటి మాటలు రావు బెదరిపోతాయీ..ఈ..ఈ
పెదవి దాటి మాటలు రావు బెదరిపోతాయి..ఈ..ఈ 
ఆ..ఆ..హృదయములో విరితేనెల తేలిన 
హృదయములో విరితేనెల తేలిన 
ఊహలు రేగాయీ..ఈఈఈఈ..నాలో కలిగినది
నాలో కలిగినది అది యేమో యేమో
మధురభావం నాలో..ఓ..కలిగినది 

చరణం::2

కనుల ముందు కమ్మని ఆశలు కలకలమన్నాయీ..ఈఈఈఈఈ 
కనుల ముందు కమ్మని ఆశలు కలకలమన్నాయి 
ఆఆఆఆఆ..మనసుపడే మన ప్రేమ లతాళి
మనసుపడే మన ప్రేమ లతాళి పూవులు పూసింది..ఈ..ఈ..ఈ..ఈ 
నాలో కలిగినది అది యేమో యేమో
మధురభావం నాలో..ఓ..కలిగినది 

చరణం::3

కలువరించే కలలు పండే శుభదినముదయించే..ఏ..ఏ..ఏ
కలువరించే కలలు పండే శుభదినముదయించే..ఏ..ఏ
ఆఆఆఆఆ..కల నిజమై ఒడి నిండుగ తీయని కోరిక ఫలియించే..ఏ
నాలో కలిగినది అది యేమో యేమో
మధురభావం నాలో..ఓ..కలిగినది 
అహహహా..హహహహా..అహహా..హహహహా
ఆ..ఆ..ఆ..ఆ..ఆఆఆఆఆఆఆఆఆఆఆ
హూ..హూ..హుహుహూ
హూ..హూ..హుహుహూ
హూ..హూ..హుహుహూ

భక్త రఘునాధ్--1960




సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల సీనియర్  
గానం::ఘంటసాల
తారాగణం::కాంతారావు,జమున,నాగయ్య,రేలంగి,C. S. R. ఆంజనేయులు

::::

ఓ..తెరువరీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ
వెనుతిరిగి చూడకురా..ఆ ఆ ఆ ఆ
గతము తలపకురా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

తరలిపోయే తెరువరి వెనుతిరిగి చూడకురా
తరలిపోయే తెరువరి వెనుతిరిగి చూడకురా
సుడిగాలిలో బడుగాపుల సడలేని పయనమురా
ఆ ఆ ఆ ఆ ఆ  

తరలిపోయే తెరువరి వెనుతిరిగి చూడకురా

చరణం::1

మమత గాని మరులు గాని మాసిపోయేవే..ఏఏఏఏ
సంపదైనా సొంపులైనా సమసిపోయేవే..ఏఏఏఏ
విధి మాయలే ఒకనాటికి నిను వీడి పోయేలే..ఏఏఏఏఏ   

తరలిపోయే తెరువరి వెనుతిరిగి చూడకురా

చరణం::2

కనుల ముందు మెరయు జగతి కల్లయేనోయీ..ఈఈఈ
మనసులో వెలుగు జ్యోతి నీకు తోడోయీ..ఈఈ 
నీ ధర్మము విడనాడక మును సాగిపోవోయీ..ఈఈఈఈ      

తరలిపోయే తెరువరి వెనుతిరిగి చూడకురా
వెనుతిరిగి చూడకురా..ఆ..వెనుతిరిగి చూడకురా

Bhakta Raghunaath--1960
Music::Ghantasala
Lyrics::Samudrala Senior
Singer::Ghantasala
Cast::Kanta Rao , Jamuna,Nagayya, Relangi, C.S.R. Anjaneyulu.

O..teruvarii..ii..ii..ii..ii..ii
venutirigi chUDakuraa..aa aa aa aa
gatamu talapakuraa..aa aa aa aa aa aa

taralipOyE teruvari venutirigi chUDakuraa
taralipOyE teruvari venutirigi chUDakuraa
suDigaalilO baDugaapula saDalEni payanamuraa
aa aa aa aa aa

taralipOyE teruvari venutirigi chUDakuraa

:::1

mamata gaani marulu gaani maasipOyEvE..EEEE
saMpadainaa soMpulainaa samasipOyEvE..EEEE
vidhi maayalE okanaaTiki ninu veeDi pOyElE..EEEEE

taralipOyE teruvari venutirigi chUDakuraa

:::2

kanula muMdu merayu jagati kallayEnOyee..iiiiii
manasulO velugu jyOti neeku tODOyee..iiii
nee dharmamu viDanaaDaka munu saagipOvOyee..iiiiiiii    

taralipOyE teruvari venutirigi chUDakuraa
venutirigi chUDakuraa..aa..venutirigi chUDakuraa


భక్త రఘునాధ్--1960


















సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::ఘంటసాల,బృందం
తారాగణం::కాంతారావు, జమున,నాగయ్య,రేలంగి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

సాకీ: :మరచుటలేదు నీ స్మరణ మాకితరేఛ్చ మరేమి లేదు 
కాపురమును నమ్మలేదు, జలబుద్బుద సంపద కోరలేదు 
నీ చరణములాన దరిశన విచారమె మాత్రముగాని 
ఇంక ఏ అరమర లేదు..లేదూ
భవదంఘ్రుల జూపగదే మహప్రభో..మహప్రభో..ఓ..ఓ

పల్లవి::

భవ తాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
భవ తాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా
బృందం: :రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌

చరణం::1

శృతి శిఖరాల మెలిగే పాదము 
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
యతి హృదయాల వెలిగే పాదము 
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
శృతి శిఖరాల మెలిగే పాదము, యతి హృదయాల వెలిగే పాదము 
నీ పాదారవిందము, ఆనంద కందము, జగదేక సుందరమూ..
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌

చరణం::2

విష నాగేంద్రు తలపై ఆడినా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
వ్రజ కాంతాళి వలచీ వేడినా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
విష నాగేంద్రు తలపై ఆడినా 
వ్రజ కాంతాళి వలచీ వేడినా
ఘన దనుజాళి వేచి సురపాళి 
గాచిన చరణాల చూపవయా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌

మహామంత్రి తిమ్మరుసు--1962





సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,P.లీల

::::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ
జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా
ఆఆఆఆఆఆ..రసిక సభా రంజనగా రాజిలు మన వాదనా
జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా
రసిక సభా రంజనగా రాజిలు మన వాదనా
జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా

:::1

భావరాగ గానమునా..ఆఆఆఆఆఆ
భావరాగ గానమునా
భావరాగ గానమునా..ఆఆఆఆఆఆ
భావరాగ గానమునా 
భావరాగ గానమునా సుధా ఝరులు పొంగగా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
నవరసాభి నటనమునా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

నవరసాభి నటనమున జగము పరవశిల్లగ
జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా

:::2

ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ
ఘన నాట్యము సాగే లయ..ప్రియ వీణియ పలికేనా
సరస మధుర స్వర వాహిని రసబిందుల చిందులవలె
జలజలజల అడుగులలో కులుకులెల్ల ఒలికేనా..ఆ
Beautyfull Music

Saturday, August 14, 2010

కృష్ణవేణి--1974





సంగీతం::విజయ భాస్కర్
రచన::దాశరధి
గానం::P.సుశీల


పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని
సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత
పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత


సత్యపరీక్షకు అగ్నిపరీక్షకు సాధ్వి జానకి నిలిచే
అఖిల జగములో సీత పునీతని
అగ్నిదేవుడే పలికే..అగ్నిదేవుడే పలికే
అల్పుని మాటలు ఆలకించెను న్యాయమూర్తి రఘురాముడు
ఆమె కలుషితని అడవికి పంపెను నిర్దయుడా శ్రీరాముడు
రాముని దాచిన సీత మనసులో రగిలెను ఆరని శోకము

పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత


పూర్ణగర్భిణికి పుణ్యరూపిణికి ఆశ్రయమొసగెను వాల్మికి
ముని ఆశ్రమమున లవకుశ జననం..
సీతకు శాంతిని కలిగించె..సీతకు శాంతిని కలిగించె
పతి ధూషణలే తలచి తలచి విలపించెను..
ఆ మాత..పిలిచెను భూమాత
తల్లి గర్భమున కలిసెను భూజాత
జనని జానకి జీవితమంతా తీరని వియోగమాయె

పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత
పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత

కృష్ణవేణి--1974




రచన::C.నారాయణ రెడ్డి
సంగీతం::విజయ భాస్కర్
గానం::P.సుశీల,రామకృష్ణ


ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి..2

మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై..2
వలపులన్ని పూలమాలై కురులోన కులుకె నీకై
ఎన్ని జన్మాలకైనా నీవు నాదానివేలే
ఇందుకు..సాక్షులు..గిరులు..తరులు..గిరులు..తరులు

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి

నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోన..2
ఎల్లవేళల జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా
గౌరిశంకరులకందం మనది విడిపోని బంధం
ఇందుకు..సాక్షులు..సూర్యుడు..చంద్రుడు..సూర్యుడు చంద్రుడు

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి....

కృష్ణవేణి--1974





సంగీతం::విజయ భాస్కర్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల


సంగీతం మధుర సంగీతం
సంగీతం మధుర సంగీతం
తల్లిపిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం

ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం
లలల..లలల లలల..లలల..లలల..లలల
అహహ..అహహ..ఉహుహుహు..
ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం
మదిలో మమతలే మంజుల రవళిగ మ్రోగును మోహనరాగం
సంగీతం మధుర సంగీతం
బాలపాపల ఆటలపాటలే అమ్మకు కమ్మని గీతం
ఆకశవీధుల సాగే గువ్వలు తెచ్చే ప్రేమసందేశం

సంగీతం మధుర సంగీతం
తల్లిపిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం

ఎన్నో నోముల పంటలు పండే ముచ్చటగొలుపు సంతానం
లలల..లలల లలల..లలల..లలల..లలల
అహహ..అహహ..ఉహుహుహుహు..
ఎన్నో నోముల పంటలు పండే ముచ్చటగొలుపు సంతానం
ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగసంతానం

సంగీతం మధుర సంగీతం
శోభల జీవన దీపావళిలో వెలిగెను పావన తేజం
తనివీ తీరా తనయులు చేర తల్లికి తరగని భాగ్యం

సంగీతం మధుర సంగీతం
తల్లిపిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


కృష్ణవేణి--974







సంగీతం::విజయ భాస్కర్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::
 P.B.శ్రీనివాస్ (సాకీ), రామకృష్ణ, P.సుశీల 

సాకీ::
అతడు:::హే..జననీ కృష్ణవేణీ..
భ్రాజిత తరంగవాణీ..
పంచపాతక హారిణీ పరమ మంగళకారిణీ
దక్షిణోర్వి దివ్యవాహినీ
అక్షీణ భాగ్యప్రదాయినీ
శ్రీశైలమల్లికార్జున దివ్యచరణ సంసేవినీ
కనకదుర్గా భవ్యకరుణాకటాక్ష సంవర్ధినీ
కనకదుర్గా భవ్యకరుణాకటాక్ష సంవర్ధినీ
కృష్ణవేణీ..కృష్ణవేణీ..
మమప్రశీద..మమప్రశీద..  

కృష్ణవేణీ..కృష్ణవేణీ..
మమప్రసీదా..మమప్రసీదా..

కృష్ణవేణీ..కృష్ణవేణీ..కృష్ణవేణీ..కృష్ణవేణీ..
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి

శ్రీగిరిలోయల సాగేజాడల..2
విద్యుల్లతలు కోటి వికసింప చేసేవు..
లావణ్యలతవై నను చేరు వేళ..2
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి..ఆ..ఆ..
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి

నాగార్జునగిరి కౌగిట ఆగి..2
బీళ్ళను బంగారు చేలగా మార్చేవు..
ఆంధ్రావనికే అన్నపూర్ణవై..
కరువులు బాపేవు బ్రతుకులు నిలిపేవు..
నాజీవ నదివై యదలోన ఒదిగి..2
పచ్చని వలపులు పండించు కృష్ణవేణి..ఆ.ఆ...
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి

అమరావతి గుడి అడుగుల నడయాడి..2
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు..
ఏ శిల్ప రమణులు ఏ దివ్య లలనలు..2
నోచని అందాలు దాచిన కృష్ణవేణి..ఆ..ఆ..

అభిసారికవై..హంసలదీవిలో..
సాగర హృదయాన..సంగమించేవూ..
నా మేని సగమై..నా ప్రాణసుధవై..
నిఖిలము నీవై..నిలిచిన కృష్ణవేణి..
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివే
ణి


Krishnaveni--1974
Music::Vijaya Bhaskar
Lyricis::C.Narayana Reddy
Singer's::Ramakrishna,P.Susheela

he..janani krishnaveni
raajita taranga vaani
pancha paataka haarini
parama mangala kaarini
dakshinorvi divya vaahini
aksheena bhagya pradaayini
shrishaila mallikhaarjuna divya charana samsevini
kanakadurgaa bhavya karunaa kataaksha samvardhini
krishnaveni..krishnaveni..mama praseeda mama praseeda

krishnavenee..krishnavenee..krishnavenee..krishnavenee
krishnavenee teluginti viriboni
krishnavenee na inti aliveni..(2)

srigiri loyala saage jaadala(2)
vidyullatalu koti vikasimpajesevu
laavanya latavai nanu cheru vela(2)
shatakoti chandrikalu veliginchu krishnaveni
krishnaveni

nagarjuna giri kougita aagi(2)
beellanu bangaaru cheluga marchevu
andhraavanike annapurnavai
karuvunu mapevu bratukunu nilipevu
na jeeva nadivai yedaloni odigi(2)
pachani valapulu pandinchu krishnaveni
krishnaveni

amaraavati gudi adugula nadayaadi(2)
raallanu andaala ramanuluga teerchevu
ye shilpa ramanulu ye divya lalanalu
nochani andaalu daachina krishaveni
abhisarikavai hamsala deevilo
saagara hrudayana sangaminchevu
na meni sagamai na prana sudhavai(2)

nikhilamu neevai nilichina krishnaveni