సంగీతం::పెండ్యాల గారు
రచన::శ్రీ శ్రీ
గానం::P.సుశీల,ఘటసాల
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక (2)
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం (2)
నేడే నవోదయం నీదే ఆనందం
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి..
సాగవోయి ప్రగతిదారుల (2)
ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు (2)
అవినీతి బంధుప్రీతి చీకటిబజారు
అలముకొన్న ఈదేశం ఎటుదిగజారు
కాంచవోయి నేటి దుస్థితి...
ఎదిరించవోయి ఈ పరిస్థితీ (2)
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక
పదవీవ్యామోహాలు కులమతభేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు (2)
ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే (2)
తనసౌఖ్యం తనభాగ్యం చూసుకొనే వాడే
స్వార్ధమే అనర్ధ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం (2)
సమసమాజ నిర్మాణమే
నీ ధ్యేయం నీధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె
నీ లక్ష్యం నీ లక్ష్యం (2)
ఏకదీక్షతో గమ్యంచేరిననాడే
లోకానికి మనభారతదేశం
అందించునదే శుభసందేశం
2 comments:
EE Chitraaniki Sangeetham Ghantasala GAaru kaadhu
Pendyala Gaaru
EE Chitraaniki Sangeetham Ghantasala GAaru kaadhu
Pendyala Gaaru
Post a Comment