భారత స్వాతంత్ర్యదినోత్సవ సంధర్భముగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు
భారత మాతకు...జై..జై......భారత మాతకు...జై..జై......భారత మాతకు...జై..జై.......
వెలుగు నీడలు
సంగీతం::ఘటసాల
రచన::శ్రీ శ్రీ
గానం::సుశీల,ఘటసాల
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక (2)
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం (2)
నేడే నవోదయం నీదే ఆనందం
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి..
సాగవోయి ప్రగతిదారుల (2)
ఆకాశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు (2)
అవినీతి బంధుప్రీతి చీకటిబజారు
అలముకొన్న ఈదేశం ఎటుదిగజారు
కాంచవోయి నేటి దుస్థితి...
ఎదిరించవోయి ఈ పరిస్థితీ (2)
పాడవోయి భారతీయుడా..ఆడిపాడవోయి విజయగీతిక
పదవీవ్యామోహాలు కులమతభేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు (2)
ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే (2)
తనసౌఖ్యం తనభాగ్యం చూసుకొనే వాడే
స్వార్ధమే అనర్ధ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం (2)
సమసమాజ నిర్మాణమే
నీ ధ్యేయం నీధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె
నీ లక్ష్యం నీ లక్ష్యం (2)
ఏకదీక్షతో గమ్యంచేరిననాడే
లోకానికి
మనభారతదేశం
మనభారతదేశం
అందించునదే శుభసందేశం
రాముడు--భీముడు
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::శ్రీ శ్రీ
గానం::P.సుశీల,ఘటసాల
ఉందిలే మంచి కాలం ముందు ముందూన
అందరూ సుఖపడాలి నందనందాన..2
ఉందిలే మంచి కాలం ముందు ముందూన
ఎందుకో సందేహమెందుకో..రానున్న విందులో..నీవంతు అందుకో (2)
ఆరోజు అదిగో కలదూ నీ యెదుటా..
నీవే రాజువట ఆ ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూన
ఏమిటేమిటేమిటే..మంచి కాలం అంటున్నావ్..
ఎలాగుంటుందో నిశితంగా చెప్పూ
దేశ సంపద పెరిగే రోజు..మనిషి
మనిషిగా బ్రతికే రోజు (2)
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో
అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో (2)
భలే భలే..బాగా చెప్పావ్..కాని
అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు
అందరికోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరూ కలిసి
సహకారమే మన వైఖరియైతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేదాగొప్పా భేదం పోయి అందరూ
నీదినాదని వాదం మాని ఉందురూ
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో
అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో (2)
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖశాంతులూరగా
ఆకాశవీధుల ఎదురేలేకుండా
ఎగురును మన జెండా ఆ ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూన
అందరూ సుఖపడాలి నందనందాన..2
ఉందిలే మంచి కాలం ముందు ముందూన
1 comment:
Ee CHitraniki Pendyaala Garu sangeetham Darsakathvam
Post a Comment