Saturday, August 14, 2010

కృష్ణవేణి--1974





సంగీతం::విజయ భాస్కర్
రచన::దాశరధి
గానం::P.సుశీల


పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని
సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత
పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత


సత్యపరీక్షకు అగ్నిపరీక్షకు సాధ్వి జానకి నిలిచే
అఖిల జగములో సీత పునీతని
అగ్నిదేవుడే పలికే..అగ్నిదేవుడే పలికే
అల్పుని మాటలు ఆలకించెను న్యాయమూర్తి రఘురాముడు
ఆమె కలుషితని అడవికి పంపెను నిర్దయుడా శ్రీరాముడు
రాముని దాచిన సీత మనసులో రగిలెను ఆరని శోకము

పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత


పూర్ణగర్భిణికి పుణ్యరూపిణికి ఆశ్రయమొసగెను వాల్మికి
ముని ఆశ్రమమున లవకుశ జననం..
సీతకు శాంతిని కలిగించె..సీతకు శాంతిని కలిగించె
పతి ధూషణలే తలచి తలచి విలపించెను..
ఆ మాత..పిలిచెను భూమాత
తల్లి గర్భమున కలిసెను భూజాత
జనని జానకి జీవితమంతా తీరని వియోగమాయె

పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత
పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత

No comments: