Sunday, August 15, 2010

భక్త రఘునాధ్--1960


















సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::ఘంటసాల,బృందం
తారాగణం::కాంతారావు, జమున,నాగయ్య,రేలంగి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

సాకీ: :మరచుటలేదు నీ స్మరణ మాకితరేఛ్చ మరేమి లేదు 
కాపురమును నమ్మలేదు, జలబుద్బుద సంపద కోరలేదు 
నీ చరణములాన దరిశన విచారమె మాత్రముగాని 
ఇంక ఏ అరమర లేదు..లేదూ
భవదంఘ్రుల జూపగదే మహప్రభో..మహప్రభో..ఓ..ఓ

పల్లవి::

భవ తాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
భవ తాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా
బృందం: :రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌

చరణం::1

శృతి శిఖరాల మెలిగే పాదము 
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
యతి హృదయాల వెలిగే పాదము 
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
శృతి శిఖరాల మెలిగే పాదము, యతి హృదయాల వెలిగే పాదము 
నీ పాదారవిందము, ఆనంద కందము, జగదేక సుందరమూ..
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌

చరణం::2

విష నాగేంద్రు తలపై ఆడినా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
వ్రజ కాంతాళి వలచీ వేడినా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
విష నాగేంద్రు తలపై ఆడినా 
వ్రజ కాంతాళి వలచీ వేడినా
ఘన దనుజాళి వేచి సురపాళి 
గాచిన చరణాల చూపవయా
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌
రాధే శ్యామ్‌ రాధే శ్యామ్‌

No comments: