సంగీతం::M.S.విశ్వనాథన్ రచన::ఆచార్య - ఆత్రేయ గానం::S.P.బాలు Film Directed By::K.Bala Chander తారాగణం::రాజివ్,సంజయ్,సరిత,స్వప్న పల్లవి:: పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాగా..ఆ..ఆ నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
చరణం::1
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి ఈ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి ఈ గీతిని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
చరణం::2
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదనా
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదనా ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
సంగీతం::T.చలపతిరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల,V.రామకృష్ణ తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు పల్లవి:: పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా చరణం::1 రోజూ ఒక లేఖ రాస్తున్నాను అందించాలని అనుకున్నాను రోజూ ఒక లేఖ రాస్తున్నాను అందించాలని అనుకున్నాను తీరా నిను చూసీ తీయని గుబులేసీ తీరా నిను చూసీ తీయని గుబులేసీ తెచ్చిన లేఖల మాటే మరిచాను ఆ మాటే..ఏఏఏ..మరిచాను పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా చరణం::2 ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు నీలో పలికే గీతాలన్నీ నీలో పలికే గీతాలన్నీ నను మరపించే నాగస్వరాలు అవే ఈ జన్మకు వరాలు పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా చరణం::3 వలచిన మనసే పాఠాలు చెబితే పిలచిన కనులే లేఖలు రాస్తే వలపే పులకించి - కలలే ఫలియి౦చి వలపే పులకించి - కలలే ఫలియి౦చి మన బ్రతుకే ఒక ఉయ్యాల కాదా బంగారు ఉయ్యాల కాదా పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా
సంగీతం::T.చలపతిరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు పల్లవి:: ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఆ రాగాల...ఉయ్యాల జంపాలలో ఎన్నెన్ని...కనరాని భావాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో చరణం::1 చిరుగాలి ఈల వేసే..ఏ..చిగురాకు తొంగి చూసే చిరుగాలి ఈల వేసే..ఏ..చిగురాకు తొంగి చూసే కిరాణాల జడివానలోన..ఆ..కిరాణాల జడివానలోన వరిచెలు స్నానాలు చేసే..ఏ.. ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో చరణం::2 పరువాల కొమ్మ ఫైనా..ఆ..పాడింది ఒక కోకిలమ్మ ఆ పాట నా...గొంతులోన ఆ పాట నా గొంతులోన..పలికించె నవరాగమాల..ఆ ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో చరణం::3 మేఘాల పరదాలలోనా..ఆఆ మేఘాల పరదాలలోన..మెరుపల్లె ఒకరోజు తోచె ఆ రాజు చిరునవ్వులోనా..ఆ..నా మేను నాట్యాలు చేసే ఈ వేళలో నాలో..ఓ..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఓ..ఎన్నెన్ని రాగాలో
సంగీత::చెళ్ళపిళ్ళ సత్యం రచన:: రాజశ్రీ గానం::S.P.బాలు తారాగణం::చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ పల్లవి:: నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ చరణం::1 నమ్మిన వారికి నమ్మకద్రోహము చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాసినందుకీ శిక్ష నమ్మిన వారికి నమ్మకద్రోహము చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాసినందుకీ శిక్ష నీ డొక్కచించి నే డోలుకట్టి వాయించుటే నా దీక్ష నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ చరణం::2 దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తల పొగరంతా తగ్గేదాకా దులుపుతాను నీ దుమ్ము దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తల పొగరంతా తగ్గేదాకా దులుపుతాను నీ దుమ్ము నీ కోసమే నే నీ దినం యెత్తేను ఈ అవతారం నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్