Showing posts with label రాజా--1976. Show all posts
Showing posts with label రాజా--1976. Show all posts

Thursday, December 12, 2013

రాజా--1976

















సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,
అల్లు రామలింగయ్య

పల్లవి::

గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
ఉండలేకా వెలికి రాకా..ఉబ్బితబ్బిబ్బవుతోంది

గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
ఉండలేకా వెలికి రాకా..ఉబ్బితబ్బిబ్బవుతోంది

చరణం::1

నిదురలో ఒక కల వచ్చింది..తెల్లవారే నిజమయ్యింది
నిదురలో ఒక కల ఒచ్చింది..అది తెల్లవారే నిజమయ్యింది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిజం నీతో చెప్పవస్తే..నిండు మనసు మూగబోయింది
మూగబోయిన మనసులోనా..రాగమేదో ఉంటుంది
ఆ నిజం మనకు తెలిసేలోగా..నిదుర మళ్ళీ వస్తుంది
గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
ఉండలేకా వెలికి రాకా..ఉబ్బితబ్బిబ్బవుతోంది

చరణం::2

ఆడ పిల్లకు పూలు బొట్టూ..ఆది నుంచీ అందాలు
ఆడ పిల్లకు పూలు బొట్టూ..ఆది నుంచీ అందాలు
మనసు ఇచ్చే మనిషి వస్తే..మారుతాయి అర్ధాలు
మనసు ఇచ్చిన మనిషితోటి..మనుగడే ఆనందం
మనసు ఇచ్చిన మనిషితోటి..మనుగడే ఆనందం
నొసట రాత రాసేవాడికే..తెలుసు దాని అర్ధమూ
గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
ఉండలేకా వెలికి రాకా..ఉబ్బితబ్బిబ్బవుతోంది
గుండెలోన ఒక మాటుంది..గొంతు దాటి రానంటుంది
ఉండలేకా వెలికి రాకా..ఉబ్బితబ్బిబ్బవుతోంది

Wednesday, December 11, 2013

రాజా--1976




సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,
అల్లు రామలింగయ్య

పల్లవి::

కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై వెలిశాము..నేడు మళ్ళీ కలిశాము 
రాజా..ఓ నా రాజా..రాజా..ఓ నా రాజా

కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై మిగిలాము..నేడు మళ్ళీ కలిశాము
రాణీ..ఓ నా రాణీ..రాణీ..ఓ నా రాణీ

చరణం::1

నీ సుతిమెత్తని..ఒడిలో పవలిస్తాను
నీ నులివెచ్చని..ఊపిరిలో పులకిస్తాను
నీ సుతిమెత్తని..ఒడిలో పవలిస్తాను
నీ నులివెచ్చని..ఊపిరిలో పులకిస్తాను
నీ నునుపారని నొసట..నేను ముద్దవుతాను
నీ కనుపాపల..క్రీనీడా జీవిస్తాను
జీవితాన చీకటంతా..చెదిరిపోవాలి
చెదిరి పోనీ మమతలు..మనకు చెరలు కావాలి చెరలు కావాలి
రాజా..ఓ నా రాజా..రాజా..ఓ నా రాజా..ఆఆ 

చరణం::2

ఆనీ ఎద లోపలి.. దీపాన్నై నే ఉంటాను
నా కథ నడిపే..నాయకుడై నీవుంటావు
నీ ఎద లోపలి..దీపాన్నై నే ఉంటాను
నా కథ నడిపే..నాయకుడై నీవుంటావు
నా చిరకాలపు..కోరికవై నీ వుంటావు
నీ పరువానికి..పండుగనై నే ఉంటాను
మల్లెపూల మనసులనే..అల్లుకుందాము
ఎల్లలన్ని తుడిపివేసి ఏలుకుందాము..ఏలుకుందాము
రాణీ..ఓ నా రాణీ.రాణీ..ఓ నా రాణీ..ఈఈ 
కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై వెలిశాము..నేడు మళ్ళీ కలిశాము
రాణీ..ఓ నా రాణీ.రాణీ..ఓ నా రాణీ..ఈఈ 
రాజా..ఓ నా రాజా..రాజా..ఓ నా రాజా..ఆఆ

Monday, April 08, 2013

రాజా--1976


సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::Pసుశీల,S.P.బాలు

పల్లవి::

ఓయబ్బో..పిల్లంటే పిల్ల కాదూ 
అహా..ఒళ్ళంటె ఒళ్ళుకాదూ..ఉ
గజనిమ్మ పండూ ముత్యాల చెండూ
గజనిమ్మ పండూ ముత్యాల చెండూ
ఓయబ్బో పిల్లంటే పిల్ల కాదూ 
అహా..ఒళ్ళంటె ఒళ్ళుకాదూ..ఉ 
గజనిమ్మ పండూ ముత్యాల చెండూ
గజనిమ్మ పండూ ముత్యాల చెండూ
ఓయబ్బో పిల్లంటే పిల్ల కాదూ
అహా..ఒళ్ళంటె ఒళ్ళుకాదూ..ఉ
లలలలా లలలలా లలలలా లలలలా

చరణం::1

జూలీ ఐ టెల్ యు వన్ తింగ్..టెల్ మి బెబీ
కొట్టాను జేబులు..ఇన్నాళ్ళూ 
నన్నే కొట్టేసె ఈనాడు..నీ కళ్ళు 
కొట్టాను జేబులు..ఇన్నాళ్ళూ 
నన్నే కొట్టేసె ఈనాడు..నీ కళ్ళు 
పడక పడక...పొరబడ్డానూ 
విడని చిక్కులో...పడ్డానూ 
ఆహాహాహా..పడవలసిన చోటే పడ్డావులే కేడీ
అహా.పడవలసిన చోటే అహా పడ్డావులే కేడీ 
బుజి బుజి చేతులతో నిన్ను జో కొడుతుందీ జూలీ
లాలి జో లాలి జో లాలి జో లాలి జో 
ఆ ఆ ఆ..మైకెల్ యు ర్ స్వీట్ కిస్ మీ
ఓయబ్బో..పిల్లంటే పిల్ల కాదూ
అహా..ఒళ్ళంటె ఒళ్ళుకాదూ
లలలలాలలలలాలలలలాలలలలా

చరణం::2

మైకెల్ ఐ టెల్ యు సమ్‌తింగ్హా
మై స్వీట్...హార్ట్ 
వచ్చారు ఎందరో...మొనగాళ్ళు 
తెగ మెచ్చారులే...నా అరికాళ్ళు
వచ్చారు ఎందరో...మొనగాళ్ళు 
తెగ మెచ్చారులే...నా అరికాళ్ళు 
అందరినీ వద్దన్నానూ అందరినీ వద్దన్నానూ
ఒక నీకే నీకే...నా ముద్దన్నాను
హాహాహా..ఎవరికి అందదూ నాటి 
నా ముద్దూ మన ప్రేమకు తుది హద్దూ
లాలి జో లాలి జో లాలి జో లాలి జో
హే జూలీ యు అర్ సేఫ్ విత్ మీ

ఓయబ్బో..పిల్లంటే పిల్ల కాదూ 
అరెరెరెరె..ఒళ్ళంటె ఒళ్ళుకాదూ
గజనిమ్మ పండూ ముత్యాల చెండూ
గజనిమ్మ పండూ ముత్యాల చెండూ
ఓయబ్బో..పిల్లంటే పిల్ల కాదూ 
అహా...ఒళ్ళంటె ఒళ్ళుకాదూ
లలలలాలలలలాలలలలాలలలలా

Monday, May 16, 2011

రాజా--1976



సంగీతం::చక్రవర్తి 
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,అల్లు రామలింగయ్య.

పల్లవి::

మా యింట వెలసిన..మహలక్ష్మివీ
నా కంటి..వెలుగైన..దీపానివీ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

చరణం::1

కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా..ఆ
కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా
కలతలేని నిదురలో..ఓ..గడిచిపోవు రాత్రిలా..ఆ
కలతలేని నిదురలో..గడిచిపోవు రాత్రిలా 
కమ్ముకున్న కడగళ్ళు కరిగిపోవునమ్మ కరిగిపోవునమ్మా

నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

చరణం::2::

అన్నయ్య వస్తాడు..ఆనందం తెస్తాడూ
తోడబుట్టిన మాకూ..తోడుగా ఉంటాడూ
కన్నతల్లి కలలన్నీ కనుల విందు చేస్తాడూ..ఊ
కన్నతల్లి కలలన్నీ..కనుల విందు చేస్తాడూ
ఈ బాబు మాటలు..నమ్మవా..అమ్మా 
నమ్మవా...అమ్మా..అమ్మా
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

Thursday, May 12, 2011

రాజా--1976



సంగీతం::చక్రవర్తి 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::శోభన్ బాబు, జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,
అల్లు రామలింగయ్య

పల్లవి::

మా యింట వెలసిన..మహలక్ష్మివీ
నా కంటి..వెలుగైన దీపానివీ..ఈ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

మా యింట వెలసి..మహలక్ష్మివీ
నా కంటి వెలుగైన..దీపానివీ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

చరణం::1

నడక నేర్పిన అమ్మ..నడిపించుతుందీ  
తోడబుట్టిన నేను..తోడుగా ఉంటామూ
పసి మనసు ఆశలకు..పందిళ్ళు వేస్తామూ 
నవ్వవే నవ్వవే నా తల్లి..నాకోసమూ నా కోసమూ
నీ నవ్వు లేకుంటే...చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు...చూడలేనమ్మా

చరణం::2


కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా..ఆ
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా..ఆ
కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా
కలతలేని నిదురలో..గడిచిపోవు రాత్రిలా..ఆ
కలతలేని నిదురలో..గడిచిపోవు రాత్రిలా 
కమ్ముకున్న కడగళ్ళు కరిగిపోవునమ్మ కరిగిపోవునమ్మా

నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

మా యింట వెలసిన..మహలక్ష్మివీ
నా కంటి వెలుగైన..దీపానివీ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

Thursday, December 11, 2008

రాజా--1976






సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్ బాబు, జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,

అల్లు రామలింగయ్య

పల్లవి::
మాట చూస్తే...మామిడల్లం
మనసు చూస్తే..పటికబెల్లం
ఆ..మాట చూస్తే..మామిడల్లం
మనసు చూస్తే...పటికబెల్లం
ఓ..సొగసులాడి..వెయ్యబోకే వలపు గొళ్ళేం

ఆదిలోనే అట్టహాసం..చిట్టచివరకు కాళ్ళబేరం
ఆదిలోనే అట్టహాసం..చిట్టచివరకు కాళ్ళబేరం
ఓ..గడుసువాడా..ఆపవయ్యా ఆర్భాటం 

చరణం::1 

కస్సుమన్న పడుచుపిల్ల..కన్నులవిందు
ఆ..కస్సుమన్న పడుచుపిల్ల..కన్నులవిందు
హేయ్..అలిగినప్పుడే ఆడపిల్ల..భలే పసందు

కయయ్మాడితేనే తమరు..వియ్యమంటారు
కయయ్మాడితేనే తమరు..వియ్యమంటారు 
లేదా ముందుగానే ఏదేదో..ఇవ్వమంటారు
ముందుగానే ఏదేదో...ఇవ్వమంటారు  

మాట చూస్తే...మామిడల్లం
ఆ..మనసు చూస్తే..పటికబెల్లం
ఓ..గడుసువాడా..ఆపవయ్యా ఆర్భాటం
తానే తందాన...తానే తందాన
తానే తందాన...తానే తందాన  

చరణం::2

ఆకువక్క లేకపోతే...నోరు పండదు
హా..ఆకువక్క లేకపోతే..నోరు పండదు
గోరువంక లేకపోతే...చిలక ఉండదు
ఎండపడిన దేనికైన..నీడ ఉండదా
ఎండపడిన దేనికైన..నీడ ఉండదా
అహా..ఈ గుండెలోన..నీకింత చోటు ఉండదా
ఈ..గుండెలోన నీకింత..చోటు ఉండదా

మాట చూస్తే...మామిడల్లం
ఆ..మనసు చూస్తే...పటికబెల్లం
ఓ..గడుసువాడా..ఆపవయ్యా ఆర్భాటం
తానే తందాన...తానే తందాన
తానే తందాన...తానే తందాన