చిమ్మటలోని ఈ పాట మీకోసమే వినండి
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం:: S.P.బాలు,P.సుశీల
ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా
సిగనుపూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా
కౌగిలింత...హుష్...
కౌగిలింత చేరుకో కల్యాణిలా
రేతిరంత మేలుకో రేరాణిలా
ఎన్నడు రానిది మల్లెల రాతిరి హాయిగా..
ముక్కుపుడక ఎందుకు మనసుండగా..
సిగనపూవు లెందుకూ సొగసుండగా..
కౌగిలింత లివ్వనా కట్నాలుగా
పరువమంత పరువనా తొలిపానుపుగా
ఎన్నడురానిది మల్లెల రాతిరి హాయిగా
మొదటి రాతిరి సిగ్గు మొగలిపువ్వట
గుచ్చుకొంటుంది మొగ్గ విచ్చుకుందట
మోజువుంది చెప్పలేని మొహమాటం
గాజులున్న చేతికేమో చెలగాటం
కన్నెపిల్ల కాపురాన కౌగిలింత తోనేకాలు పెడుతుంటే
సిగ్గుజల్లి ఎర్రమొగ్గ చీకతింటిలోన చెరిగిపోతుంటే
కోపాలు తాపాలు మురిపాలు సగపాలు
ముక్కుపుడక ఎందుకూ మనసుండగా..
సిగనపూలు ఎందుకూ సొగసుండగా
చంప గిల్లితే లేత చందమామలు
చమ్మగిల్లితే పుట్ట వలపు ప్రేమలు
పువ్వులన్ని అత్తరైన పులకింత
కంటి చూపు కబురులేని కవ్వింత
తెల్లవారి అమ్మగారు ఏమి ఎరగనట్టు నన్ను చూస్తుంటే
తెల్లవార్లు జరుగుతున్న తేనె విందు తలచి నవ్వులొస్తుంటే
ప్రతిరేయి మనకింక తొలిరేయి కావాలి
ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా
సిగనుపూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా
కౌగిలింత లివ్వనా కట్నాలుగా
పరువమంత పరువనా తొలిపానుపుగా
ఎన్నడురానిది మల్లెల రాతిరి హాయిగా
No comments:
Post a Comment