Tuesday, January 13, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత..ఆ
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత

ఏదో..ఏదో..ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..కంపించె తనువంత

చరణం::1

వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..ఏ..ఏ
అహ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే
నీవు తాకినా నిముషమందె నా యవ్వనమ్ము పూచే..ఏ..ఏ

ఏదో..ఏదో

కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే..ఏ..ఏ..ఏ
ఏదో..ఏదో

చరణం::2

గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
నన్ను వీణగా మలచుకొనెడు గంధర్వ రాజు వీవే

ఏదో..ఏదో

నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
యుగయుగాలు నీ నీలి కనుల సోయగము చూడనీవే..ఏ..ఏ

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత
ఏదో..ఏదో

Monday, January 12, 2015

స్వర్ణగౌరి--1962::ద్విజావంతి::రాగం



సంగీతం::M.V.రాజు
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::S.జానకి,M.చిత్తరంజన్ 
తారాగణం::కాంతారావు,సత్యనారాయణ,పద్మనాభం,రాజబాబు,కృష్ణకుమారి,సంధ్య,రాజశ్రీ,రమాదేవి
ద్విజావంతి::రాగం 

పల్లవి::

జయమీవే..జగదీశ్వరి
కావ్యగాన..కళాసాగరి
జయమీవే..జగదీశ్వరి

చరణం::1

పదముల వెలసే..లయతాళాలు
పదముల వెలసే..లయతాళాలు
నీ కథలే..మధురగీతాలు
దరహాసాలే..వరాలస్వరాలు
అరహాసాలే..వరాలస్వరాలు
రాగము వేదము..నీవేలే
జయమీవే..జగదీశ్వరి

చరణం::2

నీ చరణములే..నమ్మినదాన
నీదాన..దయార్ధినిగానా?
నీ చరణములే..ఏ..నమ్మినదాన
నీదాన..దయార్ధినిగానా?
చిలుకగ రాదే..నీ జడివాన
చిలుకగ రాదే..నీ జడివాన
మాతా..మంగళదేవివే
జయమీవే..జగదీశ్వరి
జయమీవే..జగదీశ్వరి..ఈ
జయమీవే..జగదీశ్వరి

గమగమ దనిదని రిగరిగ
మపమప దనిదని సమగప
గపమా గపమా గపమా గమ
జయమీవే..జగదీశ్వరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ    
జయమీవే..జగదీశ్వరి

దనిపమ గమదని పమగమ
రిగరిస నిసనిస దనిదని
గమగమ రిగరిస నిసనిరి
సరినిస రిరిరిగ గగమమ
మదపద మపగమ సాదప
మాగమ రీసా దపమా గమరీ
సాదప మాగమ రీ...
జయమీవే..జగదీశ్వరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ    
జయమీవే..జగదీశ్వరి

Swarnagouri--1962
Music::M.V.Raaju
Lyrics::Veeturisundararaamamoorti
Singer's::S.Jaanaki,M.Chittaranjan 
Cast::Kantaraavu,Satyanaaraayana,Padmanabham,Rajababu,Krishnakumari,Sandya,Rajasree,Ramaadevi.

Dwijaavanti::raaga
:::::

jayameevE..jagadeeSwari
kaavyagaana..kaLaasaagari
jayameevE..jagadeeSwari

::::1

padamula velasE..layataaLaalu
padamula velasE..layataaLaalu
nee kathalE..madhurageetaalu
darahaasaalE..varaalaswaraalu
arahaasaalE..varaalaswaraalu
raagamu vEdamu..neevElE
jayameevE..jagadeeSwari

::::2

nee charaNamulE..namminadaana
needaana..dayaardhinigaanaa?
nee charaNamulE..E..namminadaana
needaana..dayaardhinigaanaa?
chilukaga raadE..nee jaDivaana
chilukaga raadE..nee jaDivaana
maataa..mangaLadEvivE
jayameevE..jagadeeSwari
jayameevE..jagadeeSwari..ii
jayameevE..jagadeeSwari

gamagama danidani rigariga
mapamapa danidani samagapa
gapamaa gapamaa gapamaa gama
jayameevE..jagadeeSwari
aa aa aa aa aa aa aa aa aa    
jayameevE..jagadeeSwari

danipama gamadani pamagama
rigarisa nisanisa danidani
gamagama rigarisa nisaniri
sarinisa riririga gagamama
madapada mapagama saadapa
maagama reesaa dapamaa gamarii
saadapa maagama ree...
jayameevE..jagadeeSwari
aa aa aa aa aa aa aa aa aa    
jayameevE..jagadeeSwari

Thursday, January 08, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

నగుమోము చూపించవా..గోపాలా
నగుమోము చూపించవా..గోపాలా
మగువల మనసుల..ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

చరణం::1

ఎదుట..ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట 
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఇక సైపలేను నీవే నా..ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాలా 

చరణం::2

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల 
నగుమోము చూపించవా గోపాలా  

చరణం::3

కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య
నగుమోము చూపించవా గోపాలా 

నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

దేవదాసు--1974


సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య 

పల్లవి::

కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ

చరణం::1

ఒక కంట గంగ..ఒక కంట యమునా 
ఒక్కసారే కలసి..ఉప్పొంగెనూ 
ఒక్కసారే కలసి..ఉప్పొంగెనూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు..రాకూడదూ 
చెలి కన్నుల చెమరింపు..రాకూడదూ
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 

చరణం::2

ఓఓఓఓఓఓఓఓ..ఆఆఆఆఆఆఆఆఆ
మనసొక చోట..మనువొక చోట 
మమతలు పూచిన..పూదోట 
మమతలు పూచిన..పూదోట
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కోరిన చిన్నది..కుంకుమ రేఖల 
కుశలాన ఉండాలి..ఆ చోట 
కుశలాన ఉండాలి..ఆ చోట
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 

Tuesday, January 06, 2015

రెండు జెళ్ళ సీత--1983


















సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::నరేష్,ప్రదీప్,మహాలక్ష్మీ,రాజేష్,సూధాకర్.   

పల్లవి::

మందారంలో..ఘుమఘుమలై..
మకరందంలో..మధురిమలై..
మంత్రాక్షరమై..దీవించేది
మనమై మనదై..జీవించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ 

చరణం::1

గంగలాగ పొంగి..వచ్చి
యమునలాగ..సంగమించి
గంగలాగ పొంగి..వచ్చి
యమునలాగ..సంగమించి
కౌగిలిలో...కాశీ క్షేత్రం
శివశక్తుల..తాండవ నృత్యం
కౌగిలిలో...కాశీ క్షేత్రం
శివశక్తుల..తాండవ నృత్యం
నిలిచి..వలపు పండించేది
నిన్ను నన్ను..బ్రతికించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ

అనురాగానికి..పరిమళమై
ఆరాధనకి..సుమగళమై
వేదాశీస్సులు కురిపించేది
వేయి ఉషస్సులు..వెలిగించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ 

చరణం::2 

ఒక ప్రేమ..అమృత శిల్పం
ఒక ప్రేమ..బుద్దుడి రూపం
ఒక ప్రేమ..రామచరిత్రం
ఒక ప్రేమ..గాంధీ తత్వం
ఒక ప్రేమ..అమృత శిల్పం
ఒక ప్రేమ..బుద్ధుడి రూపం
ఒక ప్రేమ..రామచరిత్రం
ఒక ప్రేమ..గాంధీ తత్వం

చితినైనా..చిగురించేది
మృతినైనా..బ్రతికించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ
నేనున్నాని కోరేదీ.. 
నీవే నేనని నీడయ్యేదీ..ఈ
కమ్మగ చల్లగ..కనిపించేది
బ్రహ్మని సైతం..కని పెంచేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ

మందారంలో ఘుమఘుమలై..
మకరందంలో మధురిమలై..
మంత్రాక్షరమై దీవించేది
మనమై మనదై జీవించేది
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ

Monday, January 05, 2015

గాలి మేడలు--1962



సంగీతం::T.G.లింగప్ప
రచన::శ్రీరామచంద్  
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,
M.V.రాజమ్మ,రాజనాల

పల్లవి::

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

హృదయాలు రెండు దరిచేరాయి గాన
మన హృదయాలు రెండు దరిచేరాయి గాన
పలికాయి ఆలాపనా..ఆ ఆ ఆ ఆ ఆ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

చరణం::1

ప్రియ నీవేను నా తోడు నీడా
నే జీవింతు నీ అడుగుజాడా 
మ్మ్ హు ఉహు ఉహు ఉహు ఉహూ 
ప్రియ నీవేను నా తోడు నీడా
నే జీవింతు నీ అడుగుజాడా

మురిపాలు మీద మన సరదాలు తీర
జతగాను ఉందాము..ఈరీతిగా

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

చరణం::2

ఈ విరజాజి వికసించెనోయీ
నా తొలి పూజా ఫలియించె నోయీ

ఈ విరజాజి వికసించెనోయీ
నా తొలి పూజా ఫలియించె నోయీ
నీదాననోయి..నను విడనాడకోయీ
నీ చెంత బ్రతుకెంతొ..హాయి..హాయీ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

చరణం::3

ఇక ఆకాషమే విరిగి పడనీ
ఒక క్షణమైన విడిపోము రాణీ
మ్మ్ హు ఉహూ ఉహూ ఉహూ ఉహూ ఉహూ
ఇక ఆకాషమే విరిగి పడనీ
ఒక క్షణమైన విడిపోము రాణీ
కలనైన గాని..ఈ ఇలలోన గానీ
ఎడబాటే దరిరాదు..నా మోహినీ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

హృదయాలు రెండు దరిచేరాయి గాన
మన హృదయాలు రెండు దరిచేరాయి గాన
పలికాయి ఆలాపనా..ఆ ఆ ఆ ఆ ఆ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా


Gaali Medalu--1962
Music::T.G.Lingappa
Lyrics::Sreeraamachand
Singer's::P.B.Sreenivaas, P.Suseela
Cast::N.T.Ramaraavu,Devika,S.V.Rangaraavu,Jaggayya,Naagayya,Ramanaareddi,M.V.Raajamma,Raajanaala.

::::

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

hRdayaalu renDu darichEraayi gaana
mana hRdayaalu renDu darichEraayi gaana
palikaayi aalaapanaa..aa aa aa aa aa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

::::1

priya neevEnu naa tODu neeDaa
nE jeevintu nee aDugujaaDaa 
mm hu uhu uhu uhu uhuu 
priya neevEnu naa tODu neeDaa
nE jeevintu nee aDugujaaDaa

muripaalu meeda mana saradaalu teera
jatagaanu undaamu..iireetigaa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

::::2

ii virajaaji vikasinchenOyii
naa toli poojaa phaliyinche nOyii

ii virajaaji vikasinchenOyii
naa toli poojaa phaliyinche nOyii
needaananOyi..nanu viDanaaDakOyii
nee chenta bratukento..haayi..haayii

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

::::3

ika AkaashamE virigi paDanii
oka kshaNamaina viDipOmu raaNii
mm hu uhuu uhuu uhuu uhuu uhuu
ika AkaashamE virigi paDanii
oka kshaNamaina viDipOmu raaNii
kalanaina gaani..ii ilalOna gaanii
eDabaaTE dariraadu..naa mOhinii

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

hRdayaalu renDu darichEraayi gaana
mana hRdayaalu renDu darichEraayi gaana
palikaayi aalaapanaa..aa aa aa aa aa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

Saturday, January 03, 2015

అనుకొన్నది సాధిస్తా--1978



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8021
సంగీతం::రమేష్‌నాయుడు
రచన::మైలవరపు గోపి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.ChandraShekharReddi
తారాగణం::నరసింహరాజు,లత.

పల్లవి::

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు

చరణం::1

గఘనములో వెన్నెలలూ..అందరు చూస్తారు
గఘనములో వెన్నెలలూ..అందరు చూస్తారు
చెలి చూపుల చంద్రకళలూ..ఎంతమంది చూడగలరు

కళ్ళు కళ్ళు కలవగనే..ఏఏఏ..వలపని అనుకొంటారు
కళ్ళు కళ్ళు కలవగనే..ఏఏఏ..వలపని అనుకొంటారు
గుండెలోని మూగభాష..ఎంతమంది వినగలరు

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు

చరణం::2

ఏడడుగులు నడిపించేదీ..ఈ..ఒకే బాట కాదమరి
ఏడడుగులు నడిపించేదీ..ఈ..ఒకే బాట కాదమరి
చేయి చేయి కలిపేదీ..ఈ..చెరిసగమై బ్రతకమనీ

కొంగులు ముడి వేసేది..కోర్కెల ముడి విప్పమనీ..ఈ
కొంగులు ముడి వేసేది..కోర్కెల ముడి విప్పమనీ..ఈ
పానుపుపై చేరేది..పరవశించిపోవాలనీ

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు

Anukonnadi Saadista--1978
Music::Ramesh Naidu,
Lyricis::Mylavarapu Gopi
Singer's::S.P.Balu,P.Susheela,
Film Directed By::P.ChandraShekhar Reddi
Cast::Narasimharaaju,Lata.

:::::::::::

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu..uu
prEmanTE lOkamlO..OOO..evariki teliyadu

::::1

gaghanamulO vennelaluu..andaru choostaaru
gaghanamulO vennelaluu..andaru choostaaru
cheli choopula chandrakaLaluu..entamandi chooDagalaru

kaLLu kaLLu kalavaganE..EEE..valapani anukonTaaru
kaLLu kaLLu kalavaganE..EEE..valapani anukonTaaru
gunDelOni moogabhaasha..entamandi vinagalaru

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu..uu
prEmanTE lOkamlO..OOO..evariki teliyadu

::::2

EDaDugulu naDipinchEdii..ii..okE baaTa kaadamari
EDaDugulu naDipinchEdii..ii..okE baaTa kaadamari
chEyi chEyi kalipEdii..ii..cherisagamai bratakamanii

kongulu muDi vEsEdi..kOrkela muDi vippamanii..ii
kongulu muDi vEsEdi..kOrkela muDi vippamanii..ii
paanupupai chErEdi..paravaSinchipOvaalanii

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu..uu
prEmanTE lOkamlO..OOO..evariki teliyadu

గృహలక్ష్మి--1985



సంగీతం::చెళ్లపిళ్ల సత్యం 
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P..సుశీల
Film Directed By::B.Bhaskar Rao
Film Producer By::Ramachandra Reddi
తారాగణం::మోహన్‌బాబు,భానుప్రియ,రాధిక,అన్నపూర్ణ,ప్రభాకర్ రెడ్డి,వీరభద్రరావు,సుత్తివేలు,జగ్గయ్య,గిరిబాబు,మిక్కిలినేని,మమత,అనురాధ.

పల్లవి::

మేలుకోర తెల్లవారెను కృష్ణయ్యా   
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా

నీ ముద్దు మోమును చూడాలి 
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా

చరణం::1

నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి..ఈ
నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి
నెలవంక వెన్నెలగా..పెరగాలి
నిన్ను నమ్మి ఉన్నాము..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

చరణం::2

దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
సరసాలకు ఇది సమయం..కాదురా..ఆ 
సందె వేళదాకైనా ఆగార..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

చరణం::3

నీధర్మం నెరవేర్చు..అది జన్మలు కడతేర్చు 
అని నీవే అన్నావు..ఆ దారినే పోనివ్వు
మంచైనా చేడుకైన..భరియించే బలమివ్వు..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

నీ ముద్దు మోమును చూడాలి 
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

Gruha Lakshmi (1985)
Music::CheLlapilla Satyam 
Lyrics::Achaarya-Atreya
Singer::P.Suseela
Cast::Mohanbabu,Bhanupriya,Radhika,M.Prabhakar Reddi,Veerabhadra Rao,Suttivelu,Jaggayya.
Giribaabu,Mikkilineni,Mamata,Anuradha.

:::::::::::::

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

nee muddu mOmunu chooDaali 
maa poddu appuDE poDavaali
nee navvE velugai ninDaali..kRshNaa..aa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::1

neevichchina saubhaagyaM..deevinchina samsaaram
nee neeDana nilakaDagaa..nilavaali..ii
neevichchina saubhaagyam..deevinchina samsaaram
nee neeDana nilakaDagaa..nilavaali
nelavanka vennelagaa..peragaali
ninnu nammi unnaamu..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::2

dEvaki vasudEvulu..rEpalle paurulu
neekOsamE eduruchoostoo..unnaaru
dEvaki vasudEvulu..rEpalle paurulu
neekOsamE eduruchoostoo..unnaaru
sarasaalaku idi samayam..kaaduraa..aa 
sande vELadaakainaa aagaara..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::3

needharmam neravErchu..adi janmalu kaDatErchu 
ani neevE annaavu..aa daarinE pOnivvu
manchainaa cheDukaina..bhariyinchE balamivvu..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

nee muddu mOmunu chooDaali 
maa poddu appuDE poDavaali
nee navvE velugai ninDaali..kRshNaa..aa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

Thursday, January 01, 2015

ధనమా దైవమా--1973




















సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::L.R.ఈశ్వరీ  
తారాగణం::N.T.రామారావు,జమున,సత్యనారాయణ,పద్మనాభం,చంద్రమోహన్,వెన్నీరాడై నిర్మల,చంద్రకళ.
పల్లవి

హాపీ న్యూ యియర్..హాపీ న్యూ యియర్
హాపీ న్యూ యియర్..హాపీ న్యూ యియర్
హేయ్ గతం నేటితో ఖతం..హేయ్ గతం నేటితో ఖతం
పాతకట్టు పాతబొట్టు..తీసెయ్ తీసెయ్  
కొత్తరంగు కొత్తపొంగు..చూసేయ్ చూసేయ్ 
హాపీ న్యూ యియర్..హాపీ న్యూ యియర్
హాపీ న్యూ యియర్

చరణం::1

గతమో తెగిన గాలిపడగ..రానున్న కాలం నీటి బుడగ 
గతమో తెగిన గాలిపడగ..రానున్న కాలం నీటి బుడగ
అనుభవించు నేటి రోజు..అహ్హా..రకరకాల వింత మోజు 
అహ్హా హ్హ హ్హా..అనుభవించు నేటి రోజు..లాలలా
రకరకాల వింత మోజు..లారారా..
లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల  
హాపీ న్యూ యియర్..హాపీ న్యూ యియర్ 
హాపీ న్యూ యియర్

చరణం::2

గిరిగీసుకొని వుంటే..ఏమి వుందోయ్ 
తెరదాటి వస్తేనే...తీపి వుందోయ్  
గిరిగీసుకొని వుంటే ఏమి వుందోయ్
తెరదాటి వస్తేనే...తీపి వుందోయ్
హద్దుపద్దు చూడవద్దు..నీతి రీతి తలచవద్దు 
హద్దుపద్దు చూడవద్దు..నీతి రీతి తలచవద్దు
లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల  
హాపీ న్యూ యియర్..హాపీ న్యూ యియర్ 
హాపీ న్యూ యియర్
హేయ్ గతం నేటితో ఖతం..హాపీ న్యూ యియర్  
హాపీ న్యూ యియర్ హాపీ న్యూ యియర్

Wednesday, December 31, 2014

బాలమిత్రుల కథ--1973




సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::జగ్గయ్య,నాగభూషణం,గుమ్మడి,రాజబాబు,జ్యోతిలక్ష్మి,హేమలత,మాష్టర్ దేవానంద్.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
గున్న మామిడీ కొమ్మమీద..గూళ్ళు రెండుడేవి
ఒక గూటిలోన చిలకుండేది..ఒక గూటిలోన కోయిలుండేది
గున్న మామిడీ కొమ్మమీద..గూళ్ళు రెండుడేవి

చరణం::1

తీగలాగ అల్లిన చెలిమి..తెగుతుందని దిగులుపడీ
కొమ్మవిడినా ఆ జంటా..కొత్త గూడు చేరింది
తీగలాగ అల్లిన చెలిమి..తెగుతుందని దిగులుపడీ
కొమ్మవిడినా ఆ జంటా..కొత్త గూడు చేరింది
ఒక్కనాడు రామచిలక ఉక్కుడేగ నీడకు జడిసీ
కోయిలతో చెప్పలేక..గూడు విడిచి పోయింది
జోడు చెదరి పోయింది
గున్న మామిడీ కొమ్మమీద..గూళ్ళు రెండుడేవి

చరణం::2

చిన్ని చిలక ఏదనీ..కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది..కుమిలి కుమిలి ఏడుస్తుంది  
చిన్ని చిలక ఏదనీ..కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది..కుమిలి కుమిలి ఏడుస్తుంది  
కోన కోనలో తిరిగీ..కొమ్మ కొమ్మను అడిగీ
కొదమ చిలక కానరాకుంట..కోయిల గతి ఏమవుతుంది
గుండె పగిలి...చస్తుంది