Friday, November 21, 2008

మాయదారి మల్లిగాడు--1973





















  సంగీత::K.V.మహదేవన్
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::మాధవపెద్ది సత్యం
తారాగణం::కృష్ణ,మంజుల,నాగభూషణం,పద్మనాభం,అంజలి, జయంతి,ప్రసన్నరాణి    

పల్లవి::

శ్రీమద్రమారమణ గోవిందో హరి
శ్రీ అకౄరవరద గోవిందో హరి 
హరి హరిలొ రంగ హరి..హరిలొ రంగ హరి
హరి లొరంగ హరి..వ్రేపల్లె వాడలో గోపాలుడే
నంద గోపాలుడె మాపాలి దేవుడై వచ్చాడులే
మామీద దయచూప వచ్చాడులే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె 
మాపాలి దేవుడై వచ్చాడులే
మామీద దయచూప వచ్చాడులే 

చరణం::1

నల్లా నల్లానివాడు నాజూకు వన్నెకాడు 
నల్లా నల్లానివాడు నాజూకు వన్నెకాడు
దొంగలాగ నక్కి నక్కి వచ్చాడే 
ఓహో దొంగలాగ నక్కి నక్కి వచ్చాడే
కోకలెత్తుకొని పోయి దాచాడే అహా 
కోకలెత్తుకొని పోయి దాచాడే 
పుట్టినపుడు లేనికోక..గిట్టినపుడు రానికోక 
పుట్టినపుడు లేనికోక..గిట్టినపుడు రానికో
ఇప్పుడింక ఎందుకని..చెప్పినాడే  
అబ్బో మెట్టవేదాంతాలు గుప్పినాడే 
అబ్బో మెట్టవేదాంతాలు గుప్పినాడే 
మెట్టవేదాంతాలు...గుప్పినాడే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె 
మాపాలి దేవుడై వచ్చాడులే
మామీద దయచూప వచ్చాడులే

చరణం::2

పదారువేల గోపెమ్మలపై మత్తుమందుని చల్లినవాడు 
ఓహో...మత్తుమందుని...చల్లినవాడు
చక్కనైన ఒక చుక్కను చూసి చక్కనైన ఒక చుక్కను చూసి  
సైయని సైగలు చేశాడు..సైయని సైగలు చేశాడు
పిల్లనగ్రోవిని వూది కులుకుచూ చూపులగాలం వేశాడే
చూపులగాలం...వేశాడే
ముసిముసినవ్వుల ముద్దులాడుచూ 
రాసక్రీడలు చేశాడే రాసక్రీడలు చేశాడే
ముసిముసినవ్వుల ముద్దులాడుచూ 
రాసక్రీడలు చేశాడేఎన్నెన్నో లీలలు చేశాడే 
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె 
మాపాలి దేవుడై...చ్చాడులే
మామీద దయచూప..వచ్చాడులే

చరణం::3

ఒంటిపాటుగా వున్నాడయ్యా..ఒంటిపాటుగా వున్నాడయ్యా  
భయమేలేదనుకున్నాడయ్య..ఓహో భయమేలేదనుకున్నాడయ్య
పొంచివేసిన అదురుదెబ్బతో..అవతారం చాలించాడయ్యా 
మోహనరూప గోవిందా..మానసచోర గోవిందా 
విలాసపురుష గోవిందా..విచిత్రవేష గోవిందా
కపటనాటక గోవిందా..కన్యాపహార గోవిందా
గోవిందాహరి..గోవిందాహరి..గోవిందా 
గోవిందాహరి..గోవిందాహరి..గోవిందా
శ్రీమద్రమారమణ...గోవిందో..హరి

మాయదారి మల్లిగాడు--1973

























 

సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,మంజుల,నాగభూషణం,పద్మనాభం,అంజలి, జయంతి,ప్రసన్నరాణి    

పల్లవి::

నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా 
ఏయ్..నవ్వుతూ బతకాలిరా
తమ్ముడూ..నవ్వుతూ చావాలిరా
చచ్చినాక నవ్వలేవురా..ఎందరేడ్చినా 
బతికిరావురా..తిరిగిరావురా..అందుకే 
నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా

చరణం::1

చంపేది ఎవడురా..చచ్చేది ఎవడురా
చంపేది ఎవడురా..చచ్చేది ఎవడురా 
శివుడాగ్న లేకుండా..చీమైనా కుట్టదురా 
శివుడాగ్న లేకుండా..చీమైనా కుట్టదురా
కుడితే సావాలని..వరమడిగిన చీమ 
కుట్టి కుట్టకముందె సస్తోంది చూడరా..ఆఆ 
అందుకే..నవ్వుతూ బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా

చరణం::2

బతికుండగా...నిన్ను ఏడిపించినోళ్ళు 
నువు సస్తే ఏడుత్తారు..దొంగనాయాళ్ళు 
దొంగనాయాళ్ళు
అది నువు సూసేదికాదు..నిను కాసేదికాదు 
అది నువు సూసేదికాదు..నిను కాసేదికాదు 
నువ్వుపోయినా..నువ్వుపోయినా 
నీ మంచి సచ్చిపొదురా..ఏయ్ సన్నాసీ నవ్వరా
అందుకే నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ...చావాలిరా 

చరణం::3

వున్నాడురా దేవుడు..వాడు 
ఒస్తాడురా తమ్ముడు..ఎప్పుడు
అన్నాయం...జరిగినపుడు
అక్కరము...పెరిగినపుడు 
అన్నాయం...జరిగినపుడు
అక్కరము...పెరిగినపుడు 
వస్తాడురా...సచ్చినట్టు 
వస్తాడురా..అ..అందుకే 
నవ్వుతూ...హేయ్ హేయ్ 
నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ..నవ్వుతూ చావాలిరా
చచ్చినాక...నవ్వలేవురా
ఎందరేడ్చినా...బతికిరావురా
తిరిగిరావురా...అందుకే 
నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా

Thursday, November 20, 2008

రామాలయం--1971


















సంగీత::ఘంటసాల
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::జగ్గయ్య,శోభన్‌బాబు,జమున,విజయనిర్మల,చంద్రమోహన్,సూర్యకాంతం

పల్లవి::

జగదభి రామా..రఘుకుల సోమా
శరణము నీయవయా...రామా 
కరుణను....చూపవయా..ఆ

జగదభి రామా...రఘుకుల సోమా
శరణము నీయవయా...రామా 
కరుణను...చూపవయా..ఆ

చరణం::1

కౌశికు యాగము...కాచితివయ్యా
రాతిని..నాతిగ...చేసితివయ్యా
రాతిని..నాతిగ...చేసితివయ్యా
హరివిల్లు విరిచీ..మురిపించి సీతను
పరిణయమాడిన...కళ్యాణ రామా  
శరణము నీయవయా..రామా 
కరుణను....చూపవయా..ఆ 

చరణం::2

ఒకటే బాణం...ఒకటే మాట
ఒకటే సతి అని..చాటితివయ్యా
ఒకటే సతి అని..చాటితివయ్యా 
కృజనులనణచీ..శుజనుల..బ్రోచిన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఆదర్శమూర్తివి...నీవయ్యా 
శరణము నీయవయా..రామా 
కరుణను...చూపవయా..ఆ
జగదభి రామా..రఘుకుల సోమా
శరణము నీయవయా..రామా 
కరుణను...చూపవయా..ఆ 
జయ జయ రాం..జానకి రాం
జయ జయ రాం..జానకి రాం
పావన నాం....మేఘశ్యాం
జయ జయ రాం...జానకి రాం
జయ జయ రాం...జానకి రాం
జయ జయ రాం...జానకి రాం
జయ జయ రాం...జానకి రాం

రాజ కోట రహస్యం--1971























సంగీత::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,దేవిక,మిక్కిలినేని,సత్యనారాయణ,మిక్కిలినేని,
జ్యోతిలక్ష్మి,రమణారెడ్డి

పల్లవి::

తొలిసిగ్గుల తొలకరిలో..తలవాల్చిన చంద్రముఖీ
తెరలెందుకు నీకు నాకు..దరి జేరవే ప్రియసఖీ

నను మరువని...దొరవని తెలుసూ
నను మరువని...దొరవని తెలుసూ
నా మదిలోన ఏముందో..అది నీకు తెలుసూ

నను వలచిన...చెలివని తెలుసూ
నను వలచిన...చెలివని తెలుసూ
నా యదలోన ఏముందో..అదినీకు తెలుసూ

చరణం::1

చెంపల కెంపులు...దోచాలనీ
సంపంగి నవ్వులు...దుయ్యాలనీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
చెంపల కెంపులు...దోచాలనీ
సంపంగి నవ్వులు...దుయ్యాలనీ
నడుమున చెయ్ వేసి...నడవాలనీ
నా నడుమున చయ్ వేసి...నడవాలనీ
అంటుంది అంటుంది..నీ కొంటె వయసూ
నను వలచిన...చెలివని తెలుసూ 
నా యదలోన ఏముందో..అదినీకు తెలుసూ
నను వలచిన...చెలివని తెలుసూ

చరణం::2

నీ రాజు తోడుగ...నిలవాలనీ
ఈ రేడు లోకాల...గెలవాలనీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీ రాజు తోడుగ...నిలవాలనీ
ఈ రేడు లోకాల...గెలవాలనీ
బ్రతుకే పున్నమి...కావాలనీ
నీ బ్రతుకే పున్నమి...కావాలనీ 
కోరింది కోరింది..నీ లేత మనసూ
నను మరువని..దొరవని తెలుసూ 
నా మదిలోన ఏముందో..అది నీకు తెలుసూ
నను వలచిన..చెలివని తెలుసూ

రాజ కోట రహస్యం--1971




















సంగీత::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల

పల్లవి::

కరుణించవా వరుణదేవా..కరుణించవా వరుణదేవా 
నిరుపమ కరుణా సురగంగా కురిపించి
కరుణించవా వరుణదేవా 

చరణం::1

అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు
ఆరని జ్వాలల అలమటించగా
అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు
ఆరని జ్వాలల అలమటించగా
మాతృదేవియై మము నడిపించిన
విద్యానిలయము విలవిలలాడగా
మాతృదేవియై మము నడిపించిన
విద్యానిలయము విలవిలలాడగా
అంబరవీధుల దాగున్నావా
అంబరవీధుల దాగున్నావా
ఆర్తనాధమే వినకున్నావా
కరుణించవా వరుణదేవా 
నిరుపమ కరుణా సురగంగా కురిపించి
కరుణించవా వరుణదేవా 

చరణం::2

పెళ పెళ పెళ పెళ జలతరాలు ఘర్జించగా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తళ తళ తళ తళ తపిళ్ళతలు వీపించగా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దుంభుని ఆనందాభుదిలో విహరించగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కుంభవృస్ఠి...కురిపించవా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
గురుదేవుని...కరుణించవా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కరుణించవా...కరుణించవా 

Sunday, November 16, 2008

రాజ కోట రహస్యం--1971























సంగీత::విజయా కృష్ణమూర్తి
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::L.R.ఈశ్వరి 
తారాగణం::N.T.రామారావు,దేవిక,మిక్కిలినేని,సత్యనారాయణ,మిక్కిలినేని,
జ్యోతిలక్ష్మి,రమణారెడ్డి 

పల్లవి::

నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా
నీ చెంత చేరి నా వింత చూపి..నీ తంతు చూతులేరా

చరణం::1

మగువో మధువో తేలాలిరా..తేలక నేనూ పోనురా
అహా హా హా అలాగా
మగువో మధువో తేలాలిరా..తేలక నేనూ పోనురా..ఆ
పొగరో వగరో..నీవో నేనో చూతురా..హా
నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా..ఆ
నీ చెంత చేరి నా వింత చూపి..నీ తంతు చూతులేరా

చరణాం::2

ఊయ్..లలలలల ఊయ్..హోయ్హోయ్ ఊయ్
లలలలలల ఊయ్ ఈఈఇ ఊయ్య 
     
నీతో నాకు చెలగాట రా..నీ కౌగిలి నా కోటరా
నీతో నాకు చెలగాట రా..ఆ..నీ కౌగిలి నా కోటరా..హా
చాటూ..ఆ..మాటూ..అరసి మురిసి పోదురా..అ హా హా హా 
నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా
నీ చెంత చేరి నా వింత చూపి..నీ తంతు చూతులేరా
నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా..అ హా హా హా ఆ హా 

రాజ కోట రహస్యం--1971

























సంగీత::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,దేవిక,మిక్కిలినేని,సత్యనారాయణ,మిక్కిలినేని,
జ్యోతిలక్ష్మి,,రమణారెడ్డి

పల్లవి::

ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా
ఈ నేల..బంగరు నేల 
ఈ వేల..చల్లని వేళ 
కనరాని..తీయని ఊహలతో  
మనసూగెను..ఊగెను ఉయ్యాలా
మనసూగెను..ఊగెను ఉయ్యాలా
ఈ నేల..బంగరు నేల..ఆ

చరణం::1

పూచే పూవులన్నీ..ఏ పుణ్యమూర్తుల హృదయాలో
ఊగే తరువులన్నీ..ఏ యోధులు గాచిన జంగాలో
వీచే గాలీ వినిపించేది..వీచే గాలీ వినిపించేది
ఏ వేణులోలుని..గీతాలో
ఈ నేల బంగరు..నేల 
ఈ వేల చల్లని..వేళ
కనరాని తీయని..ఊహలతో   
మనసూగెను..ఊగెను ఉయ్యాలా
ఈ నేల..బంగరు నేల..ఆ

చరణం::2

ఎగిసే పావురాలూ..ఏ శాంతిదేవి సందేశాలో
కదిలే నీరుగలూ..ఏ కరుణామయుని దీవెనలో
పొంగే అలల పులకించేవి..పొంగే అలల పులకించేవి
ఏ కవిరాజు..భావనలో
ఈ నేల బంగరు..నేల 
ఈ వేల చల్లని..వేళ
కనరాని తీయని..ఊహలతో  
మనసూగెను..ఊగెను ఉయ్యాలా
మనసూగెను..ఊగెను ఉయ్యాలా 
ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా 
హా హా హా హా హా ఓ హో హో హో హో..ఆ

రైతు బిడ్డ--1971
























సంగీత::S.హనుమంతరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల 
తారాగణం::N.T. రామారావు, వాణిశ్రీ,అనూరాధ,శాంతకుమారి,సత్యనారాయణ

పల్లవి::

అ..అమ్మ
ఆ..ఆవు 
అ..అమ్మ  
ఆ..ఆవు 
అమ్మవంటిదే ఆవు..అది తెలుసుకో నీవు

ఇ..ఇల్లు 
ఈ..ఈ..ఈశ్వరుడు 
ఆ..ఇంటిని ఇలనూ కాచేదెవడు 
ఈశ్వరుడు..పరమేశ్వరుడు 

చరణం::1

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ..అను అను  
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః అం అః
క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ 
త థ ద ధ న ప ఫ బ భ మ..య ర ల వ శ ష స హ ళ క్ష 

అ మొదలుకొని..క్ష వరకు 
అ మొదలుకొని..క్ష వరకు 
మన అక్షరాలు..యాభైయారూ
అక్షరమాల..నేర్చుకొని 
ఆపై బ్రతుకులు..దిద్దుకొని 
చక్కని పౌరులు.. కావాలీ
మన జాతికి పేరు..తేవాలి    
అ..అమ్మ  
ఆ..ఆవు 
అమ్మవంటిదే..ఆవు 
అది తెలుసుకో..నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు
ఈశ్వరుడు..పరమేశ్వరుడు 

చరణం::2
   
అందరిదీ ఒకే..కులం 
అందరమూ..మానవులం 
కండలు పెంచితె..సరిపోదు
కావాలయ్యా..బుద్ధిబలం 
కావాలయ్యా..బుద్ధిబలం            
మనభాషలు..వేరేఐనా
మన మతాలు..వేరే ఐనా 
జీసస్..ఈశ్వర్..అల్లా  
ఈశ్వర అల్లా తేరేనామ్ 
సబకో సన్మతి దే భగవాన్ర
రఘుపతి రాఘవ రాజారామ్ 
పతీత పావన సీతారామ్
ఈశ్వర్ అల్లా తేరేనామ్ 
సబ్ కో సన్మతీ దే భగవాన్ర
రఘుపతి రాఘవ రాజారామ్ 
పతీత పావన సీతారామ్

చరణం::3

మన భాషలు..వేరే ఐనా 
మన మతాలు..వేరే ఐనా 
పాలూ పైరూ..ఒకటే 
భూమాత అందరికొకటె 
భూమాత..అందరికొకటె 
పేదా గొప్పా..భేదాలు 
పెళ్ళగించుకొని..పోవాలి
గిరిజనుడే..పురజనుడై 
గిరిజనుడే..పురజనుడై  
ధరా చక్రమును..తిప్పాలి
ఈ ధరా చక్రమును..తిప్పాలి    
అ..అమ్మ  
ఆ..ఆవు 
అమ్మవంటిదే..ఆవు 
అది తెలుసుకో..నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు
ఈశ్వరుడు..పరమేశ్వరుడు
ఈశ్వరుడు..పరమేశ్వరుడు 

Thursday, November 13, 2008

అందరూ దొంగలే--1974






















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,V.రామకృష్ణ

పల్లవి::

ఓర్నాయాల చూశానురా ఈ వేళా
ఓర్నాయాల చూశానురా ఈ వేళా
పిల్లంటె పిల్లకాదు వర్ణించ వల్లకాదు
పిల్లంటె పిల్లకాదు వర్ణించ వల్లకాదు
అడగొద్దురో దానందచందాలూ

ఓర్నాయాల చూశావా ఈ వేళా
ఓర్నాయాల చూశావా ఈ వేళా
ఏమేమిచూశావు చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు చూసి ఏమిచేశావు  
చెప్పొద్దురో దానందచందాలు
ఓర్నాయాల చూశానురా ఈ వేళా

చరణం::1

చూశానొక పొగరబోతు గొడ్డునూ
అది చూపులతో కుమ్మిందీ కోడెనూ
చూశానొక పొగరబోతు గొడ్డునూ
అది చూపులతో కుమ్మిందీ కోడెనూ
అయ్యయ్యో గుండెల్లో దూసుకొనిపోయిందా
అది ఉండుండి మటెడుతూ వుందా గోవిందా
గుండెల్లో దూసుకొనిపోయిందా
అది ఉండుండి మటెడుతూ వుందా 
ఛ..ఛ..దూసుకొనీ పోనీక వాటేసుకున్నాను 
ముద్దొకటీ యిచ్చానూ ముక్కు తాడు వేశానూ
ముద్దొకటీ యిచ్చానూ ముక్కు తాడు వేశానూ 
కొయ్..కొయ్..కోతలు కొయ్  
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు 
అడగొద్దురో దానందచందాలు
ఓర్నాయాల చూశానురా ఈ వేళా

చరణం::2

నడిరేయిలోన నడిరేయిలోన 
సుడిగాలిలా గదిలోకి గబగబ వచ్చింది    
నన్ను సుట్టేసి సుడి తిరిగిపోయింది
నడిరేయిలోన సుడిగాలిలా గదిలోకి గబగబ వచ్చింది    
నన్ను సుట్టేసి సుడి తిరిగిపోయింది
ఆయ్యయ్యో ఓపలేని ఆతాపం ఒళ్ళంతా రగిలిందా 
దాని కోపంతో నీ గూబ పగిలిందా 
ఓపలేని ఆతాపం ఒళ్ళంతా రగిలిందా
దాని కోపంతో నీ గూబ పగిలిందా 
ఛ..ఛ..తెల్లవార్లు నాతోటె గడిపిందీ
తెల్లవార్లు నాతోటె గడిపిందీ
ఇక వెళ్ళలేనంటూ న వెంటపడిందీ
పడుతుంది..పడుతుంది     
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు  
అడగొద్దురో..దానందచందాలు  
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఓర్నాయాల..చూశావా ఈ వేళా
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా

అందరూ దొంగలే--1974



సంగీత::K. V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,V.రామకృష్ణ

పల్లవి::

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో మా అందరిలో 
నన్నే చేసుకో నన్నే చేసుకో నన్నే చేసుకో 
నన్నే చేసుకో నన్నే పెళ్ళి చేసుకో

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నేనే పెళ్ళి చేస్తా మీ అందరికీ
నేనే చేస్తా నేనే చేస్తా నేనే చేస్తా 
నేనే పెళ్ళి చేస్తా

చరణం::1

నీకు తగ్గదాన్నోయ్..నీటైనదాన్నోయ్..ఆహా
వాటమున్న దాన్నొయ్..వగలున్న దాన్నోయ్..అవ్వా 
నీకు తగ్గదాన్నోయ్..నీటైనదాన్నోయ్
వాటమున్న దాన్నొయ్..వగలున్న దాన్నోయ్
వగలు సైగచేస్తే..పరుగు పరుగునా వచ్చి
రేయంతా నీ కలలో కరిగిపోతానోయ్
కరిగిపోతానోయ్
  
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో..మా అందరిలో 
నన్నే చేసుకో నన్నే చేసుకో నన్నే చేసుకో 
నన్నే చేసుకో నన్నే పెళ్ళి చేసుకో

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం 
నేనే పెళ్ళి చేస్తా..మీ అందరికీ
నేనే చేస్తా..నేనే చేస్తా నేనే చేస్తా
నేనే చేస్తా నేనే పెళ్ళి చేస్తా

చరణం::2

గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
కోరమీసం నీది..కొంటె చూపు నాది
కోరమీసం నీది..కొంటె చూపు నాది
కోరి కోరి ఆ రెండు కోలాటం ఆడాలి ఆడాలి 

గుడుగుడు గుంచం  గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో..మా అందరిలో 
నన్నే చేసుకో నన్నేచేసుకో నన్నే చేసుకో 
నన్నే చేసుకో..నన్నే పెళ్ళి చేసుకో

చరణం::3

పొంగుతున్న ఒంపుల్లో పొగరునాకు తెలుసు
రంగేళి వయసులో సింగారం తెలుసు
పొంగుతున్న ఒంపుల్లో పొగరునాకు తెలుసు
రంగేళి వయసులో సింగారం తెలుసు
లొంగని మీ పరువాలు..లొంగ దీసుకుంటా
లొంగని మీ పరువాలు..లొంగ దీసుకుంటా 
అందాలకు బందమేసి..అదుపులోన పెడతా..ఆ
అదుపులోన పెడతా  
     
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నేనే పెళ్ళి చేస్తా మీ అందరికీ
నేనే చేస్తా  నేనే చేస్తా నేనే చేస్తా
నేనే చేస్తా నేనే పెళ్ళి చేస్తా