Thursday, November 20, 2008

రాజ కోట రహస్యం--1971




















సంగీత::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల

పల్లవి::

కరుణించవా వరుణదేవా..కరుణించవా వరుణదేవా 
నిరుపమ కరుణా సురగంగా కురిపించి
కరుణించవా వరుణదేవా 

చరణం::1

అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు
ఆరని జ్వాలల అలమటించగా
అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు
ఆరని జ్వాలల అలమటించగా
మాతృదేవియై మము నడిపించిన
విద్యానిలయము విలవిలలాడగా
మాతృదేవియై మము నడిపించిన
విద్యానిలయము విలవిలలాడగా
అంబరవీధుల దాగున్నావా
అంబరవీధుల దాగున్నావా
ఆర్తనాధమే వినకున్నావా
కరుణించవా వరుణదేవా 
నిరుపమ కరుణా సురగంగా కురిపించి
కరుణించవా వరుణదేవా 

చరణం::2

పెళ పెళ పెళ పెళ జలతరాలు ఘర్జించగా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తళ తళ తళ తళ తపిళ్ళతలు వీపించగా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దుంభుని ఆనందాభుదిలో విహరించగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కుంభవృస్ఠి...కురిపించవా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
గురుదేవుని...కరుణించవా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కరుణించవా...కరుణించవా 

No comments: