Sunday, November 04, 2007

శ్రీ వేంకటేశ్వర మహాత్యం--1954::రాగం:పిలు



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::పింగళి ఆత్రేయ
గానం::P.శాంతకుమారి



 రాగం:పీలు

ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
ఎంతపిలచినా ఎంత వేడినా
ఈనాటికి దయ రాదేలా
గోపాలా నంద గోపాలా గోపాలా నంద గోపాలా

వీనులవిందుగ వేణుగానమూ
వినితరించగా వేచితిరా ఆ....ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
వీనులవిందుగ వేణుగానమూ వినితరించగా వేచితిరా
వేచి వేచి వెన్నముద్దవలే
కరిగిపోయరా నా బ్రతుకు
కరిగి పోయరా నాబ్రతుకూ....

ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా

వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మనఇంటా
..ఆ....ఆ....ఆ..ఆ..ఆ.ఆ..ఆ....
వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మన ఇంటా..
పాలను ముచ్చిలి పరుల చేతిలో
దెబ్బలు తినకురా కన్నయ్యా
ఈ తల్లి హౄదయమూ ఓర్వలేదయా

ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా

Thursday, November 01, 2007

ముద్దుల కొడుకు--1979



సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,మురళీమోహన్,జయసుధ,శ్రీదేవి,గిరిజ,జయమాలిని

పల్లవి::

ఓలోలె నీ సోకు..లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా
నా సూపే సున్నమేసి..నీ వలపే వక్కచేసి
చిలక చుట్టి ఇస్తుంటే..నీ చిటికనేలు..కొరుకుతుంటా
ఆహుం..ఆహుం..ఆహుం..

ఓలేలే నా సోకు..లేలేత తమలపాకు..తాంబూల మిచ్చుకొంటా
అందాలే విందు చేసి..మురిపాలే ముద్దు చేసి చిలకచుట్టి ఇస్తుంటే
ఈ చిలిపి కొట్టూడెందుకంటా..ఆహుం..ఆహుం..ఆహుం

చరణం::1

ఆ..సున్నమెక్కువైనా..ఈ..వక్క తక్కువైనా
నీ నోరు పొక్కుతుంది..నా జోరు ఎక్కుతుంది
ఆ..సున్నమెక్కువైనా..ఈ..వక్క తక్కువైనా
నీ నోరు పొక్కుతుంది..నా జోరు ఎక్కుతుంది 
మక్కువెక్కువైనప్పుడు..పొక్కదూ..
పొక్కినా పెదవుల్లో..చక్కెర పులుపెక్కదు..ఆహా
మక్కువెక్కువైనప్పుడు..పొక్కదూ..
పొక్కినా పెదవుల్లో చక్కెర పులుపెక్కదు..ఆహుం..ఆహుం..ఆహుం 
అరెరెరె..ఓలోలె నీ సోకు..లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా

చరణం::2

ముట్టుకొంటే ముదురుతుంది..పట్టుకొంటే పండుతుంది
కట్టుకుంటే కుదురుతుంది..కట్టుకో..కట్టుకో..కట్టుకో 
ముడుపు..కట్టుకో..కట్టుకో..కట్టుకో

ముద్దు ముదిరిపోతుంటే..పొద్దు నిదరపోకుంటే
హద్దు చెదరిపోతుంటే..కట్టుకో..కట్టుకో..కట్టుకో 
ముడుపు..కట్టుకో..కట్టుకో..కట్టుకో..వాయబ్బో..ఓ   
ఓలేలే నా సోకు..లేలేత తమలపాకు..తాంబూల మిచ్చుకొంటా..ఆఆఆ 

చరణం::3

నీ కుర్రకారు జోరు..నా గుండెలోన హోరు
మితిమీరిపోతే తంటా..పొలిమెర దాటకంటా
నీ కుర్రకారు జోరు..నా గుండెలోన హోరు
మితిమీరిపోతే తంటా..పొలిమెర దాటకంటా 

పగ్గమేసి పట్టబోతె తగ్గదు..తగ్గినా 
పడుచు ఊపు పట్టుకుంటే..చిక్కదు..ఓహా 
పగ్గమేసి పట్టబోతె తగ్గదు..తగ్గినా 
పడుచు ఊపు పట్టుకుంటే..చిక్కదు  
ఆహుం..ఆహుం..ఆహుం..

ఓలోలె నీ సోకు..లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా
నా సూపే సున్నమేసి..నీ వలపే వక్కచేసి

అందాలే విందు చేసి..మురిపాలే ముద్దు చేసి చిలకచుట్టి ఇస్తుంటే
ఈ చిలిపి కొట్టూడెందుకంటా..ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం

Muddula Koduku--1979
Music::K.V.Mahadevan
Lyrics::Veturi Sundararamamoorti
Singer's::S.P.Balu,P.Suseela
Cast::Akkineni,Sridevi,Jayasudha,Muralimohan,Girija,Jayamaalini.

:::

OlOle nee sOku..lElEta tamalapaaku..taamboolamivvamanTaa
naa soopE sunnamEsi..nee valapE vakkachEsi
chilaka chuTTi istunTE..nee chiTikanElu..korukutunTaa
aahum..aahum..aahum..

OlElE naa sOku..lElEta tamalapaaku..taamboola michchukonTaa
andaalE vindu chEsi..muripaalE muddu chEsi chilakachuTTi istunTE
ii chilipi koTTUDendukanTaa..aahum..aahum..aahum

:::1

aa..sunnamekkuvainaa..ii..vakka takkuvainaa
nee nOru pokkutundi..naa jOru ekkutundi
aa..sunnamekkuvainaa..ii..vakka takkuvainaa
nee nOru pokkutundi..naa jOru ekkutundi 
makkuvekkuvainappuDu..pokkaduu..
pokkinaa pedavullO..chakkera pulupekkadu..aahaa
makkuvekkuvainappuDu..pokkaduu..
pokkinaa pedavullO chakkera pulupekkadu..aahum..aahum..aahum 
arerere..OlOle nee sOku..lElEta tamalapaaku..taamboolamivvamanTaa

:::2

muTTukonTE mudurutundi..paTTukonTE panDutundi
kaTTukunTE kudurutundi..kaTTukO..kaTTukO..kaTTukO 
muDupu..kaTTukO..kaTTukO..kaTTukO

muddu mudiripOtunTE..poddu nidarapOkunTE
haddu chedaripOtunTE..kaTTukO..kaTTukO..kaTTukO 
muDupu..kaTTukO..kaTTukO..kaTTukO..vaayabbO..O   
OlElE naa sOku..lElEta tamalapaaku..taamboola michchukonTaa..aaaaaaaa 

:::3

nee kurrakaaru jOru..naa gunDelOna hOru
mitimeeripOtE tanTaa..polimera daaTakanTaa
nee kurrakaaru jOru..naa gunDelOna hOru
mitimeeripOtE tanTaa..polimera daaTakanTaa 

paggamEsi paTTabOte taggadu..tagginaa 
paDuchu Upu paTTukunTE..chikkadu..Ohaa 
paggamEsi paTTabOte taggadu..tagginaa 
paDuchu Upu paTTukunTE..chikkadu  
aahum..aahum..aahum..

OlOle nee sOku..lElEta tamalapaaku..taamboolamivvamanTaa
naa soopE sunnamEsi..nee valapE vakkachEsi

andaalE vindu chEsi..muripaalE muddu chEsi chilakachuTTi istunTE

ii chilipi koTTUDendukanTaa..aahum..aahum..aahum..aahum..aahum..aahum

Wednesday, October 17, 2007

మనుషులు-మమతలు--1965




సంగీతం::T.చలపతిరావు 
రచన::దాశరథి 
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమాలత. 

పల్లవి::

రాధ::కన్ను మూసింది..లేదు
నిన్ను మరచింది లేదు..నీ తోడూ
కన్ను మూసింది..లేదు
నిన్ను మరచింది లేదు..నీతోడూ ఓ..ప్రియతమా

చరణం::1

హేమంత మేగే చేమంతి పూచె..యీ నాడూ
మేఘాలు తొలగె నెలరాజు వెలిగె..యీ రేయీ
హేమంత మేగే చేమంతి పూచె..యీ నాడూ
మేఘాలు తొలగె నెలరాజు వెలిగె..యీ రేయీ
అయినా జాలి లేదేల..యికనైనా రావేలా

కన్ను మూసింది..లేదు
నిన్ను మరచింది లేదు..నీతోడూ ఓ..ప్రియతమా..ఆ

చరణం::2

కన్నీటిలోనె కరిగింది హృదయం..ఇన్నాళ్ళూ
కన్నీటిలోనె కరిగింది హృదయం..ఇన్నాళ్ళూ
ఎడబాటులోనె గడిచింది కాలం..ఇన్నేళ్ళూ
అయినా జాలి లేదేల ఇకనైనా..రావేలా యీ వేళా..ఆ

కన్ను మూసింది..లేదు
నిన్ను మరచింది లేదు..నీతోడూ ఓ..ప్రియతమా..ఆ

చరణం::3

నీ రాక కోసం దేవుళ్ల నెంతో ..కొలిచేను
నీ దారి కాచి ద్వారానా వేచి..వున్నాను
నీ రాక కోసం దేవుళ్ల నెంతో ..కొలిచేను
నీ దారి కాచి ద్వారానా వేచి..వున్నాను
అయినా జాలి లేదేల ఇకనైనా రావేలా..రావేలా
జాలి లేదేల ఇకనైనా రావేలా..ఆ ఆ ఆ ఆ

Manushulu-Mamatalu--1965
Music::T.ChalapatiRao
Lyrics::Dasarathi
Singer's::P.Suseela
Cast::Akkinaeni,Gummadi,PrabhaakarReddi,Jayalalita,saavitri,Jaggayya,Rajasree,Ramanareddi,Hemalata

:::: 

Raadha::kannu moosindi..ledu
ninnu marachindi ledu..nee tODoo
kannu moosindi..ledu
ninnu marachindi ledu..neetODoo O..priyatamaa

::::1

hemanta mege chemanti pooche..yee naaDoo
meghaalu tolage nelaraaju velige..yee reyee
hemanta mege chemanti pooche..yee naaDoo
meghaalu tolage nelaraaju velige..yee reyee
ayinaa jaali ledela..yikanainaa raavelaa

kannu moosindi..ledu
ninnu marachindi ledu..neetODoo O..priyatamaa

::::2

kanneeTilOne karigindi hRdayam..innaaLLoo
kanneeTilOne karigindi hRdayam..innaaLLoo
eDabaaTulOne gaDichindi kaalam..inneLLoo
ayinaa jaali ledela ikanainaa..raavelaa yee veLaa..aa

kannu moosindi..ledu
ninnu marachindi ledu..neetODoo O..priyatamaa

::::3

nee raaka kOsam devuLla nentO ..kolichenu
nee daari kaachi dwaaraanaa vechi..vunnaanu
nee raaka kOsam devuLla nentO ..kolichenu
nee daari kaachi dwaaraanaa vechi..vunnaanu
ayinaa jaali ledela ikanainaa raavelaa..raavelaa
jaali ledela ikanainaa raavelaa..aa aa aa aa

భలే రంగడు--1969



చిమ్మటలోని ఈ పాటను ఇక్కడ వినండి

సంగీతం K .V .మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం: ఘంటసాల P.సుశీల

Film Directed By::Taatineni RaamaaRao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,గుమ్మడి,అద్మనాభం,నాగభూషణం,కె.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,ధుళిపాళ,రావికొండలరావు,సాక్షిరంగారావు,కె.వి.చలం,వాణిశ్రీ,విజయలలిత,సూర్యకాంతం,పుష్పకుమారి.

పల్లవి::

Hip Hip Hurray
ఓహో భలే
Hip Hip Hurray
ఒహో భలే
చేయి చేయి కలగలపు
నీది నాది తొలి గెలుపు
చేయి చేయి కలగలపు
నీది నాది తొలి గెలుపు
గెలుపే మెరుపై తెలిపెను తెలిసెను
బ్రతుకు బాటలో మలుపు
గెలుపే మెరుపై తెలిపెను తెలిసెను
బ్రతుకు బాటలో మలుపు

Hip Hip Hurray
ఒహో భలే

చరణం::1


స్నేహం ఎంతో తీయనా
అది తెలిసిన మనసె చల్లనా
ఓ...ఓ... మ్మ్....మ్మ్...
ఓ...ఓ.....ఓ.....
స్నేహం ఎంతో తీయనా
అది తెలిసిన మనసె చల్లనా
తీయని చల్లని లేతమనసు నీ
స్నేహం వలన కమ్మనా...
నా తీయని చల్లని లేతమనసు నీ
స్నేహం వలన కమ్మన

Hip Hip Hurray
ఒహో భలే

చరణం::2


నీ కన్నులు చెప్పే కథలూ
నా మదిలో చిలికెను సుధలు
నీ కన్నులు చెప్పే కథలూ
నా మదిలో చిలికెను సుధలు
నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు
ప్రతినవ్వు కురిసెను తేనెలు
నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు
ప్రతినవ్వు కురిసెను తేనెలు
ప్రతినవ్వు కురిసెను తేనెలు

Hip Hip Hurray
ఒహో భలే

చరణం::3


పక్కన నీవే వుంటే
నే కంటా ఎన్నో కలలూ
ఓ...ఓ...మ్మ్...మ్మ్...
ఓ....ఓ......
పక్కన నీవే వుంటే
నే కంటా ఎన్నో కలలూ
పండిన కలలో పొంగే అలపై
తేలిపోవాలి మనము
పండిన కలలో పొంగే అలపై
తేలిపోవాలి మనము

Hip Hip Hurray
ఒహో బలే
చేయి చేయి కలగలపు
నీది నాది తొలి గెలుపు
Hip Hip Hurray
ఒహో భలే
Hip Hip Hurray
ఒహో భలే
Hip Hip Hurray
ఒహో భలే


Bhale Rangadu--1969
Music::K.V.Mahaadevan
Lyrics::Arudra
Singer's::Ghantasaala,P.Suseela
Film Directed By::Taatineni RaamaaRao
Cast::Akkineni NageswaraRao,Gummadi,Padmanaabham,Naagabhooshanam,K.Satyanaaraayana,Alluraamalingayya,Dhulipaala,RaavikondalaRao,SaakshiRangaaRao,K.V.Chalam,Vaanisree,Vijayalalita.

::::::::::::::::::::::::::::::::::::::::::


Hip Hip..Hurray
OhO...bhalE
Hip Hip..Hurray
ohO...bhalE
chEyi chEyi..kalagalapu
needi naadi..toli gelupu
chEyi chEyi kalagalapu
needi naadi toli gelupu
gelupE merupai telipenu telisenu
bratuku baaTalO malupu
gelupE merupai telipenu telisenu
bratuku baaTalO malupu

Hip Hip Hurray
ohO bhalE  

::::1

snEham entO teeyanaa
adi telisina manase challanaa
O...O... mm....mm...
O...O.....O.....
snEham entO teeyanaa
adi telisina manase challanaa
teeyani challani lEtamanasu nii
snEham valana kammanaa...
naa teeyani challani lEtamanasu nii
snEham valana kammana

!! Hip Hip Hurray
ohO bhalE !!

::::2

nii kannulu cheppE kathaluu
naa madilO chilikenu sudhalu
nii kannulu cheppE kathaluu
naa madilO chilikenu sudhalu
nii pedavula navvulu vaaDani puvvulu
pratinavvu kurisenu tEnelu
nii pedavula navvulu vaaDani puvvulu
pratinavvu kurisenu tEnelu
pratinavvu kurisenu tEnelu

Hip Hip..Hurray
ohO...bhalE  

::::3

pakkana neevE vunTE
nE kanTaa ennO kalaluu
O...O...mm...mm..
O....O......
pakkana neevE..vunTE
nE kanTaa ennO..kalaluu
panDina kalalO..pongE alapai
tElipOvaali..manamu
panDina kalalO..pongE alapai
tElipOvaali..manamu

Hip Hip..Hurray
ohO...balE
chEyi chEyi..kalagalapu
needi naadi..toli gelupu
Hip Hip...Hurray
ohO...bhalE
Hip Hip..Hurray
ohO...bhalE
Hip Hip..Hurray

ohO...bhalE

మనుషులు-మమతలు--1965::దానీ:::రాగం
















Director : Kotayya Pratyagatma
సంగీతం::T.చలపతిరావు 
రచన::దాశరథి 
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమాలత. 

రాగం::దానీ
హిందుస్తానీ కర్నాట
క


పల్లవి::

రాధ::మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
నిన్ను చూడనీ..ఈ..నన్ను పాడనీ..ఈ
ఇలావుండిపోనీ..ఈ..నీ..చెంతనే..ఏ
నిన్ను..చూడనీ..ఈ

చరణం::1

ఈ కనులు నీకే..ఈ కురులు నీకే
నా తనువులోని..అణువు అణువు నీకే
ఈ కనులు నీకే..ఈ కురులు నీకే
నా తనువులోని..అణువు అణువు నీకే
ఇలావుండిపోనీ..నీ దాసినై

నిన్ను చూడనీ..ఈ..నన్ను పాడనీ..ఈ
నిన్ను..చూడనీ..ఈ

చరణం::2

నీవులేని నేను..ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని..నిన్ను విడువలేను
నీవులేని నేను..ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని..నిన్ను విడువలేను
ఇలారాలిపోనీ..నీ కోసమే..ఏఏఏ

నిన్ను చూడనీ..ఈ..నన్ను పాడనీ..ఈ
ఇలావుండిపోనీ..ఈ..నీ చెంతనే..ఏఏఏ
నిన్ను..చూడనీ..ఈ

Manushulu-Mamatalu--1965
Music::T.ChalapatiRao
Lyrics::daaSarathi
Singer's::P.Suseela
Cast::Akkinaeni,Gummadi,PrabhaakarReddi,Jayalalita,saavitri,Jaggayya,Rajasree,Ramanareddi,Hemalata

:::::::::

Raadha::mm mm mm mm mm mm mm mm mm 
ninnu chooDanee..ii..nannu paaDanee..ii
ilaavunDipOnee..ii..nee..chentane..E
ninnu..chooDanee..ii

::::1

ee kanulu neeke..ee kurulu neeke
naa tanuvulOni..aNuvu aNuvu neeke
ee kanulu neeke..ee kurulu neeke
naa tanuvulOni..aNuvu aNuvu neeke
ilaavunDipOnee..nee daasinai

ninnu chooDanee..ii..nannu paaDanee..ii
ninnu..chooDanee..ii

::::2

neevuleni nenu..inka bratakalenu
ennaDainagaani..ninnu viDuvalenu
neevuleni nenu..inka bratakalenu
ennaDainagaani..ninnu viDuvalenu
ilaaraalipOnee..nee kOsame..EEE

ninnu chooDanee..ii..nannu paaDanee..ii
ilaavunDipOnee..nee chentane..EEE

ninnu..chooDanee..ii

షావుకారు--1950




సంగీతం::ఘంటసాలవేంకటేశ్వర రావు  
రచన::సముద్రాలరాఘావాచార్య(సీనియర్)   
గానం::ఘంటసాలవేంకటేశ్వర రావు 
తారాగణం:N.T.రామారావు,జానకి, S.V. రంగారావు, రేలంగి,మోపర్రు దాసు,పద్మనాభం, గోవిందరాజుల సుబ్బారావు,వంగర, కనకం,వల్లభజోస్యుల శివరాం, P.శాంతకుమారి

పల్లవి::

పలుకరాదటే చిలుకా..ఆ
పలుకరాదటే..పలుకరాదటే చిలుకా..ఆ
పలుకరాదటే..ఏ 
సముఖములో..రాయబారమెందులకే
సముఖములో..రాయబారమెందులకే
పలుకరాదటే..చిలుకా..పలుకరాదటే

చరణం::1

ఎరుగని వారమటే..మొగమెరుగని వారమటే
ఎరుగని వారమటే..మొగమెరుగని వారమటే
పలికిన నేరమటే..పలుకాడగ నేరవటే
ఇరుగుపొరుగు..వారలకీ
అరమరికలు తగునటనే..పలుకరాదటే
చిలుకా..ఆ..పలుకరాదటే

చరణం::2

మనసుని తొణికే..మమకారాలు
కనులను మెరిసే..నయగారాలు
మనసుని తొణికే..మమకారాలు
కనులను మెరిసే..నయగారాలు
తెలుపరాదటే..సూటిగా..ఆ
తెరలు తీసి పరిపాటిగా..ఆ
తెలుపరాదటే..సూటిగా..ఆ
తెరలు తీసి పరిపాటిగా..ఆ
పలుకరాదటే చిలుకా..ఆ..పలుకరాదటే 
చిలుకా..ఆ ఆ ఆ ఆ

Tuesday, October 16, 2007

లేత మనసులు--1966










సంగీతం::MS.విశ్వనాథన్
రచన::?
గానం::PB.
శ్రీనివాస్,P.సుశీల

రాగం::శంకరాభరణం:::

అందాల ఓ చిలకా
అందుకో నా లేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా

అందాల చెలికాడా
అందుకో నా లేఖా
నా కనులతొ రాసానూ..
నీ మదిలోన దాచాను

మిసమిసలాడే..వేందుకనీ
తళ తళలాడే వేమిటని
మిసమిసలాడే..వేందుకనీ
తళ తళలాడే వేమిటని
కురులు మోవిపై వాలే నేలనో
విరులు కురులలో నవ్వే నెందుకో
అడుగు తడబడే చిలక కేలనో
పెదవి వణికెనూ..చెలియ కెందుకో

అందాల ఓ చిలకా
అందుకో నా లేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా

మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి
కురులు మోముపై మరులుగొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగు తడబడే సిగ్గుబరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో

అందాల చెలికాడా
అందుకో నా లేఖా
నా కనులతొ రాసానూ..
నీ మదిలోన దాచాను

అందాల ఓ చిలకా
అందుకో నా లేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా

నీవే పాఠం నేర్పితివి
నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధురమార్గమూ మనసు చూపులే
నీవు పాడగా నీను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా

అందాల ఓ చిలకా..
అందుకో నాలేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా

లేత మనసులు--1966







సంగీతం::MS.విశ్వనాథ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో

పాలకొరకు లేగదూడ పరుగు లెత్తి సాగెను
పాలకొరకు లేగదూడ పరుగు లెత్తి సాగెను
పక్షి కూడ కూడుతెచ్చి పంచిపెట్టి మురియును
పక్షి కూడ కూడుతెచ్చి పంచిపెట్టి మురియును
తాత పెలుసునా..జాలి కలుగునా..
తాత పెలుసునా..జాలి కలుగునా..
విడి విడి గా జీవించే వేదనలే తీరునా..
వేదనలే తీరునా....

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో

పొరుగువారి పాపలాగ పెట్టిపుట్టలేదులే..
పొరుగువారి పాపలాగ పెట్టిపుట్టలేదులే..
అమ్మతో..నాన్నతో..హాయినోచుకోములే..
అమ్మతో..నాన్నతో..హాయినోచుకోములే..
అమ్మ మరవదూ..నాన్న తలవడు..
అమ్మ మరవదూ..నాన్న తలవడు..
కన్నవాళ్ళ కలుపుటకు మాకు వయసు లేదులే..
మీకు మనసు రాదులే..

కోడి ఒక కోనలో..పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో..

లేత మనసులు--1966,








రచన::ఆరుద్ర
సంగీతం::MS.విశ్వనాథన్
గానం::P.సుశీల

పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
ఆ పురుటికందు మనసులో దైవముండును
ఆ పురుటికందు మనసులో దైవముండును
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే

పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును
వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును
మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును
మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే

పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
మాయమర్మమేమి లేని బాలలందరు
మాయమర్మమేమి లేని బాలలందరు
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే

పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

లేత మనసులు--1966






సంగీతం::MS.విశ్వనాథన్
రచన:: దాశరథి 
గానం::పిఠాపురం..PB.శ్రీనివాస్


హల్లో మేడం సత్యభామా
పైనకోపం లోన ప్రేమా
నీవు నేను ఏకమైతె స్వర్గలోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం


love love love love bow bow bow

sunday picture, monday beach
tuesday circus, wednesday drama
Do Do Do Do Do
భామా..
మనం ప్రేమయాత్రవెలుదమా...


హల్లో మేడం సత్యభామా..భామా
పైనకోపం లోన ప్రేమా...ప్రేమా
నీవు నేను ఏకమైతె స్వర్గలోకం...లోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం...


love love love love bow bow bow
ఇంకా బిడియమేలా...ఏలా
నన్నే నమ్మలేవా...లేవా
నాపై జాలి రాదా...రాదా
హౄదయం విప్పరాదా...


లా..లా..లా..లా..లా..లా..
లా..లా..లా..లా..లా..లా


దైవం ఏమిచేసే...చేసే..
స్త్రీనే సౄష్టి చేసే...చేసే..
స్త్రీనే సౄష్టి చేసి...చేసి
మాపై విసిరివేసే....

లా..లా..లా..లా..లా..లా..
లా..లా..లా..లా..లా..లా


sunday picture, monday beach
tuesday circus, wednesday drama


Do Do Do Do Do భామా..
మనం ప్రేమయాత్రవెలుదమా...


హల్లో మేడం సత్యభామా..భామా
పైనకోపం లోన ప్రేమా...ప్రేమా
నీవు నేను ఏకమైతె స్వర్గలోకం...లోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం...


love love love love bow bow bow
హంసా..వంటి వాకింగ్...వాకింగ్
హల్వా..వంటి టాకింగ్...టాకింగ్
చాలూ చాలు కాలేజ్..కాలేజ్
చేస్కో..ఇంక మారేజ్....

అమ్మాయ్ గారి మౌనం...మౌనం
తెలిసే..మాకు అర్థం...అర్థం
మదిలో వున్నమాట...మాట
కనులే..పలుకునంటా...

లా..లా..లా..లా..లా..లా..
లా..లా..లా..లా..లా..లా


sunday picture, monday beach,
tuesday circus, wednesday drama


Do Do Do Do Do భామా..
మనం ప్రేమయాత్రవెలుదమా...


హల్లో మేడం సత్యభామా..భామా
పైనకోపం లోన ప్రేమా...ప్రేమా
నువ్వు నేను ఏకమైతె స్వర్గలోకం...లోకం
నీవులేని జీవితమే పెద్ద శాపం...


love love love love bow bow bow