Tuesday, October 16, 2007

లేత మనసులు--1966







సంగీతం::MS.విశ్వనాథ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో

పాలకొరకు లేగదూడ పరుగు లెత్తి సాగెను
పాలకొరకు లేగదూడ పరుగు లెత్తి సాగెను
పక్షి కూడ కూడుతెచ్చి పంచిపెట్టి మురియును
పక్షి కూడ కూడుతెచ్చి పంచిపెట్టి మురియును
తాత పెలుసునా..జాలి కలుగునా..
తాత పెలుసునా..జాలి కలుగునా..
విడి విడి గా జీవించే వేదనలే తీరునా..
వేదనలే తీరునా....

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో

పొరుగువారి పాపలాగ పెట్టిపుట్టలేదులే..
పొరుగువారి పాపలాగ పెట్టిపుట్టలేదులే..
అమ్మతో..నాన్నతో..హాయినోచుకోములే..
అమ్మతో..నాన్నతో..హాయినోచుకోములే..
అమ్మ మరవదూ..నాన్న తలవడు..
అమ్మ మరవదూ..నాన్న తలవడు..
కన్నవాళ్ళ కలుపుటకు మాకు వయసు లేదులే..
మీకు మనసు రాదులే..

కోడి ఒక కోనలో..పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో..

No comments: