సంగీతం::ఘంటసాలవేంకటేశ్వర రావు
రచన::సముద్రాలరాఘావాచార్య(సీనియర్)
గానం::ఘంటసాలవేంకటేశ్వర రావు
తారాగణం:N.T.రామారావు,జానకి, S.V. రంగారావు, రేలంగి,మోపర్రు దాసు,పద్మనాభం, గోవిందరాజుల సుబ్బారావు,వంగర, కనకం,వల్లభజోస్యుల శివరాం, P.శాంతకుమారి
పల్లవి::
పలుకరాదటే చిలుకా..ఆ
పలుకరాదటే..పలుకరాదటే చిలుకా..ఆ
పలుకరాదటే..ఏ
సముఖములో..రాయబారమెందులకే
సముఖములో..రాయబారమెందులకే
పలుకరాదటే..చిలుకా..పలుకరాదటే
చరణం::1
ఎరుగని వారమటే..మొగమెరుగని వారమటే
ఎరుగని వారమటే..మొగమెరుగని వారమటే
పలికిన నేరమటే..పలుకాడగ నేరవటే
ఇరుగుపొరుగు..వారలకీ
అరమరికలు తగునటనే..పలుకరాదటే
చిలుకా..ఆ..పలుకరాదటే
చరణం::2
మనసుని తొణికే..మమకారాలు
కనులను మెరిసే..నయగారాలు
మనసుని తొణికే..మమకారాలు
కనులను మెరిసే..నయగారాలు
తెలుపరాదటే..సూటిగా..ఆ
తెరలు తీసి పరిపాటిగా..ఆ
తెలుపరాదటే..సూటిగా..ఆ
తెరలు తీసి పరిపాటిగా..ఆ
పలుకరాదటే చిలుకా..ఆ..పలుకరాదటే
చిలుకా..ఆ ఆ ఆ ఆ
No comments:
Post a Comment