సంగీతం::K.V.మహదేవన్
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు
తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ
పల్లవి::
మెరిసే తారలదే..రూపం
విరిసే పూవులదే..రూపం
అది నా కంటికి..శూన్యం
మనసున కొలువై మమతల నెలవై
వెలసిన దేవిది..ఏ రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత..ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం
మనసున కొలువై మమతల నెలవై
వెలసిన దేవిది..ఏ రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత..ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం
చరణం::1
ఎవరి రాకతో..గళమున
పాటల ఏరువాక..సాగేనో
ఆ వసంత మాసపు..కులగోత్రాలను
ఎల కోయిల..అడిగేనా
ఎవరి పిలుపుతో..పులకరించి
పురి విప్పి తనువు..ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై
నెమలి..వెదుకులాడేనా
నా కన్నులు..చూడని రూపం
గుడిలో దేవత..ప్రతిరూపం
నీ రూపం..అపురూపం
చరణం::2
ప్రాణం పుట్టుక..ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక..గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక..ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక..గాత్రం చూడాలా
వెదురును..మురళిగ మలచి
ఈ వెదురును..మురళిగ మలచి
నాలొ జీవన నాదం పలికిన
నీవే నా..ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన
మనసున కొలువై మమతల నెలవై
వెలసిన దేవిది..ఏ రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత..ప్రతిరూపం
నీ రూపం..అపురూపం
No comments:
Post a Comment