Monday, July 08, 2013

సిరివెన్నెల--1986



సంగీతం::K.V.మహదేవన్
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు
తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ

పల్లవి::

ఆది బిక్షువు..వాడినేది కోరేది
బూడిదిచ్చే..వాడినేది అడిగేది
ఆది బిక్షువు..వాడినేది కోరేది
బూడిదిచ్చే..వాడినేది అడిగేది
ఏది కోరేది..వాడినేది అడిగేది
ఏది కోరేది..వాడినేది అడిగేది 

చరణం::1  

తీపి రాగాల కోయిలమ్మకు 
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపి రాగాల కోయిలమ్మకు 
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది 

చరణం::2 

తేనెలొలికే..పూల బాలలకు
మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే..పూల బాలలకు
మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాల్లను చిరాయువగ జీవించమని 
ఆనతిచ్చిన..వాడినేది అడిగేది
ఏది కోరేది..వాడినేది అడిగేది
ఏది కోరేది..వాడినేది అడిగేది

చరణం::3 

గిరిబాలతో తనకు కల్యాణ మొనరింప దరిజేరు
మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు
ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది

ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి..ముక్కోపి..ముక్కంటి..ముక్కోపి..తిక్క శంకరుడు

ఆది బిక్షువు..వాడినేది కోరేది..
బూడిదిచ్చే..వాడినేది అడిగేది
ఏది కోరేది..వాడినేది అడిగేది
ఏది కోరేది..వాడినేది అడిగేది 

No comments: