సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,P.లీల
(PG.కృష్ణవేణి,జిక్కి)
శంకరాభరణం::రాగం
కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే
నావంక రావేలనే చెలి నీకింక సిగ్గేలనే
నో నో నో నీ జోరు తగ్గాలిక ఆ రోజు రావాలిగా
ఇక ఆ పైన నీ దానగా...నో నో నో...
కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా
చేరువైనాము ఆనాడే జోడైతిని
ఇంత స్నేహానికి అంత ఆరాటమా
చాలులే తమరికి ఏలా ఈ తొందర
నో నో నో నీ జోరు తగ్గాలిక ఆ రోజు రావాలిగా
ఇక ఆ పైన నీ దానగా...నో నో నో...
ఏల ఈ లీల పదిమందిలో పాటలా
పరువు మర్యాదలే లేని సయ్యాటలా
నీవు నా దానవై నేను నీ వాడనై
నీడగా నిలిచినా చాలులే నా చెలి
కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే
నావంక రావేలనే చెలి నీకింక సిగ్గేలనే
నో నో నో నీ జోరు తగ్గాలిక ఆ రోజు రావాలిగా
ఇక ఆ పైన నీ దానగా...నో నో నో...
No comments:
Post a Comment