Thursday, February 14, 2013

శాంతినివాసం--1960::రాగేశ్రీ::రాగం


సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల రామానుజాచార్య
గానం::ఘంటసాల,P.సుశీల

రాగేశ్రీ::రాగం


పల్లవి::

ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

చరణం::1

పతి పదసేవయే 
యోగముగా
నాతికి పతియే
దైవముగా 

పతి పదసేవయే 
యోగముగా
నాతికి పతియే
దైవముగా

సతి సౌభాగ్యాలే 
తన భాగ్యమనే
భావనయే పతి ధర్మముగ

సతి సౌభాగ్యాలే 
తన భాగ్యమనే
భావనయే పతి ధర్మముగ

రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

చరణం::2

మాయని ప్రేమల 
కాపురమే
మహిలో వెలసిన 
స్వర్గముగా

మాయని ప్రేమల 
కాపురమే
మహిలో వెలసిన 
స్వర్గముగా

జతబాయని కూరిమి 
జంటగ మెలిగే
దంపతులే 
ఇల ధన్యులుగా

జతబాయని కూరిమి 
జంటగ మెలిగే
దంపతులే 
ఇల ధన్యులుగా


రాగాలా సరాగాలా 
హాసాలా విలాసాలా
సాగే సంసారం ఆ  
సుఖజీవనసారం

No comments: