Thursday, October 27, 2011

మాతృమూర్తి --1972




ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::పెండ్యాల
రచన::రాజశ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల


పల్లవి::-

నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ..ఈ..ఈ
నీ నీడగా నన్ను కదలాడనీ

నీ చూపులోనా ప్రణయాలవానా
శతకోటి రాగాలు కురిపించనీ
మై మరపించనీ..

నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ..ఈ..ఈ
నీ నీడగా నన్ను కదలాడనీ

చరణ::-1

జాజులు తెలుపు..జాబిల్లి తెలుపు
నను మురిపించే నీ మనసు తెలుపు

కుంకుమ ఎరుపు..కెంపులు ఎరుపు
సుధలూరే నీ అధరాలు ఎరుపు

అనురాగాలే అనుబంధాలై
అనురాగాలే అనుబంధాలై
నిన్ను నన్ను ముడివేయనీ..మదిపాడనీ

నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ..ఈ..ఈ
నీ నీడగా నన్ను కదలాడనీ

చరణం::-2

హరివిల్లు చూసా నీ మేను చూసా
హరివిల్లులో లేని హొయలుంది నీలో

సెలఏరు చూసా..నీ దుడుకు చూసా
సెలఏటిలో లేని చొరవుంది నీలో

తీయని చెలిమీ..తరగని కలిమీ
తీయని చెలిమీ..తరగని కలిమీ
మనలో మదిలో..కొనసాగనీ ఊయలలూగనీ


నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ

నీ చూపులోనా ప్రణయాలవానా
శతకోటి రాగాలు కురిపించనీ
మై మరపించనీ..

నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ

No comments: