సంగీతం::T.V.చలపతిరావు
రచన::దాశరథి
గానం::సుశీల,ఘంటసాల
Film Director By::Tatineni Rama Rao
తారాగణం::నాగేశ్వరరావు,జయలలిత,నాగభూషణం,సూర్యకాంతం,చలం,రమణారెడ్డి,ప్రభాకర్‌రెడ్డి,రాజబాబు,రమాప్రభ.
పల్లవి::
మదనా..ఆఆఆఆఆ..రావోయి ఒక్కసారి
ఎవ్వరూలేని ఈ చోట..ఇటు రా రా రా..ఒక మాట
ఎవ్వరూలేని ఈ చోట..ఇటు రా రా రా..ఒక మాట
నను కవ్వించే రతి రాజా..నీ చెలిపైనే దయరాదా
ఎవ్వరూలేని ఈ చోట..ఇటు రా రా రా..ఒక మాట
చరణం::1
విరజాజులకే..పరిమళ మొసగే
నీ ముంగురులే..ముద్దిడుకోనా..ఆ
విరజాజులకే..పరిమళ మొసగే
నీ ముంగురులే..ముద్దిడుకోనా..ఆ
స్వర్గమునైనా..వలదనిపించే
నీ కౌగిలిలో..సోలిపోనా
ఎవ్వరూలేని ఈ చోట..ఇటు రా రా రా..ఒక మాట
చరణం::2
ఇరువుర మొకటై..మురిసేవేళ
పూవుల వానలే..కురియునులే
తీయని వలపుల..వూయలలోన
జగమంతా..మై మరచునులే
ఎవ్వరూలేని ఈ చోట..ఇటు రా రా రా..ఒక మాట
ఎవ్వరూలేని ఈ..ఈఈఈ..చోట..ఆ
No comments:
Post a Comment