Saturday, May 24, 2014

పుట్టింటి గౌరవం--1975


సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు 
తారాగణం::కృష్ణంరాజు, భారతి,శుభ,ప్రభాకరరెడ్డి,సూర్యకాంతం,పద్మనాభం,అల్లు రామలింగయ్య

పల్లవి::

వాణీ నా రాణి పెళ్ళ౦టే కాదు మజాకా
అలివేణీ పూబోణీ చూపిస్తా నా తడాఖా                    
వాణీ నా రాణి పెళ్ళ౦టే కాదు మజాకా
అలివేణీ పూబోణీ చూపిస్తా నా తడాఖా 

చరణం::1

మిసమిసలాడే నీ బుగ్గలను..ముద్దులతో ముంచెస్తా
బుసబుస పొంగే నీ వయసంతా..కసికసిగా దోచేస్తా
బిగి కౌగిలిలో బిగించి నిన్నూ..ఉక్కిరి బిక్కిరి చేసేస్తా                

వాణీ నా రాణి పెళ్ళ౦టే కాదు మజాకా
అలివేణీ పూబోణీ చూపిస్తా నా తడాఖా 

చరణం::2

ముద్దులగుమ్మా ఈ తొలిరేయీ..నిద్దుర పోనిస్తావా
నిగనిగలాడే నీ పెదవులలో..మధువులు వదిలేస్తావా
తాళిగట్టిన మొగుణ్ణి నేనూ..తప్పించుక పోలేవూ                

వాణీ నా రాణి పెళ్ళ౦టే కాదు మజాకా
అలివేణీ పూబోణీ చూపిస్తా నా తడాఖా 

No comments: