Friday, November 07, 2014

ఆరాధన--1976



సంగీతం::సాలూరి హనుమంతరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::మహమ్మద్‌రఫీ,S.జానకి
Film Directed By::B.V.Prasad
Barla Venkata Varaprasad 
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,కొంగర జగ్గయ్య,గుమ్మడి వెంకటేశ్వరరావు,M.ప్రభాకర్ రెడ్డి,జయభాస్కర్,రాజనాల,బలరాం,K.V.చలం,సాక్షి,విజయలలిత,పుష్పకుమారి,సూర్యకళ,పార్వతి,అనుపమ 

పల్లవి::

లైలా..లైలా..లైలా..లైలా 
నిరుపేద మనసునే..మురిపించి నీవు 
రతనాల మహలులో..నిదురించినావా 
లైలా..లైలా..లైలా..లైలా 

బంగారు గూటిలో పడివున్న..చిలుకను 
పెదవి దాటగలేని..ఒక మూగ పిలుపును
ఇకనైన ననుచేర రావా..ఇకనైన ననుచేర రావా 
ఒకసారి నీ మోము..తిలకింపనీవా 
ఇకనైన ననుచేర రావా..నీతోడు నడయాడలేను
నీ ప్రేమ ఏనాడు విడనాడలేను..నే విడనాడలేను
లైలా..ఖైస్‌..లైలా..ఖైస్‌

అందని పండును కోరీ..అర్రుసాచే వెర్రివాడా
అంతటి లైలాను వలచే..అర్హత నీకెక్కడిదిరా
బ్రతుకుమీద ఆశవుంటే..పారిపోరా యిప్పుడే యిప్పుడే
ప్రేమించిన వాడెవ్వడు..పిరికివాడు కాడు 
అనురాగ ప్రవాహాన్ని..అడ్డగించలేడెవ్వడు
ఎవ్వరెంత కాదన్నా..మా అనుబంధం శాశ్వతం
లైలాకే నా జీవితం..అలనాడే అంకితం
ఏయ్‌ నోర్ముయ్‌...వదరుబోతా
పట్టండి...పట్టండి   
కత్తుల బోనులో..నిలబెట్టండి
నిలువెత్తు గోతిలో..పాతిపెట్టండి

కత్తులు ఛేదింపలేవు..నిప్పులు దహింపలేవు
స్వచ్చమైన ప్రేమను..ఏ శక్తులూ బందింపలేవు
అనురాగమన్నది..విడదీయలేనిది 
అదివున్న మదిలోనే ఆ దైవమున్నది..ఆ దైవమున్నది

కులముతో పనిలేనిది..ధనముతో కొనలేనిది 
కులముతో పనిలేనిది..ధనముతో కొనలేనిది
దేవుడిచ్చిన వరమది..మనిషి ఎన్నడు మాపలేనిది 
అనురాగమన్నది...విడదీయలేనిది 
అదివున్న మదిలోనే ఆ దైవమున్నది..ఆ దైవమున్నది

విరబూసే పూలలో..మా చిరునవ్వులే ఉంటాయి
కదిలే చిరుగాలిలో..మా కనుల బాసలుంటాయి
పొంగే కెరటాలలో మా వలపు..పొంగులుంటాయి
కలిసే మేఘాలలో..మా కన్నీటి ధారలే వుంటాయి
ఐనా నేల..ఉన్నంతకాలం 
గాలి ఉన్నంతకాలం..నింగి ఉన్నంతకాలం 
నీరు ఉన్నంతకాలం..వెలుతురున్నంత కాలం
కాలమున్నంతకాలం..ధర్మమున్నంత కాలం
దైవమున్నంతకాలం..ఇలలోన మిగిలేను ఈ విషాధ గాధా

ఓహో ప్రియతమా..ప్రియతమా   
నా పిలుపే వినలేవా..నీ చెలిమె కనరావా
ఎందున్నావో ఏమైనావో..ఎందున్నావో ఏమైనావో
ప్రహరీలు దాటి వహరాలు దాటి..పయనించి నే వచ్చినాను
ప్రళయమ్ము గాని మరణమ్ము గాని..నిను వీడినే నిలువలేను
ఎందున్నావో ఎమైనావో..ఇక్కడే వున్నాను ఎక్కడికీ పోలేను
కడవూపిరితో...నీకై కలవరించినాను 
కన్ను మూసినా..నీకై వేచి వేచి వుంటాను
వేచివేచి వుంటాను..వేచి వేచి వుంటాను

నీవులేని ఈ లోకం నరకం..నీవున్న చోటే నా స్వర్గం
నినే కలుసుకోనీ నీలో కలసిపోనీ..నీలో కలసిపోనీ
కాలమున్నంతకాలం ధర్మమున్నంతకాలం దైవమున్నంతకాలం
ఇలలోన మిగిలేను మా ప్రేమ గాధ..ఈ అమరగాధ

Araadhana--1976
Music::Saaloori Hanumantaraavu
Lyrics::D.C.Narayanareddi
Singer::Mohammed Rafi,S.Jaanaki
Film Directed By::B.V.Prasad
Barla Venkata Varaprasad 
Cast::N.T.RaamaaRao,Vaanisree,Kongara Jaggayya,Gummadi VenkateswaraRao,M.Prabhaakar Reddi,Jayabhaaskar,Raajanaala,Balaraam,K.V.Chalam,Saakshi,Vijayalalita,Pushpakumaari,SooryakaLa,Paarvati,Anupama 

::::::::

lailaa..lailaa..lailaa..lailaa 
nirupEda manasunE..muripinchi neevu 
ratanaala mahalulO..nidurinchinaavaa 
lailaa..lailaa..lailaa..lailaa 

bangaaru gooTilO paDivunna..chilukanu 
pedavi daaTagalEni..oka mooga pilupunu
ikanaina nanuchEra raavaa..ikanaina nanuchEra raavaa 
okasaari nee mOmu..tilakinpaneevaa 
ikanaina nanuchEra raavaa..neetODu naDayaaDalEnu
nee prEma EnaaDu viDanaaDalEnu..nE viDanaaDalEnu
lailaa..khais..lailaa..khais

andani pahDunu kOree..arrusaachE verrivaaDaa
antaTi lailaanu valachE..arhata neekekkaDidiraa
bratukumeeda aaSavunTE..paaripOraa yippuDE yippuDE
prEminchina vaaDevvaDu..pirikivaaDu kaaDu 
anuraaga pravaahaanni..aDDaginchalEDevvaDu
evvarenta kaadannaa..maa anubandham SaaSwatam
lailaakE naa jeevitam..alanaaDE ankitam
Ey nOrmuy...vadarubOtaa
paTTanDi...paTTanDi   
kattula bOnulO..nilabeTTanDi
niluvettu gOtilO..paatipeTTanDi

kattulu ChEdinpalEvu..nippulu dahimpalEvu
swachchamaina prEmanu..E Saktuloo bandimpalEvu
anuraagamannadi..viDadeeyalEnidi 
adivunna madilOnE aa daivamunnadi..aa daivamunnadi

kulamutO panilEnidi..dhanamutO konalEnidi 
kulamutO panilEnidi..dhanamutO konalEnidi
dEvuDichchina varamadi..manishi ennaDu maapalaenidi 
anuraagamannadi...viDadeeyalEnidi 
adivunna madilOnE aa daivamunnadi..aa daivamunnadi

viraboosE poolalO..maa chirunavvulE unTaayi
kadilE chirugaalilO..maa kanula baasalunTaayi
pongE keraTaalalO maa valapu..pongulunTaayi
kalisE mEghaalalO..maa kanneeTi dhaaralE vunTaayi
ainaa nEla..unnantakaalam
gaali unnantakaalam..ningi unnantakaalam 
neeru unnantakaalam..veluturunnanta kaalam
kaalamunnantakaalam..dharmamunnanta kaalam
daivamunnantakaalam..ilalOna migilEnu ee vishaadha gaadhaa

OhO priyatamaa..priyatamaa   
naa pilupE vinalEvaa..nee chelime kanaraavaa
endunnaavO EmainaavO..endunnaavO EmainaavO
prahareelu daaTi vaharaalu daaTi..payaninchi nE vachchinaanu
praLayammu gaani maraNammu gaani..ninu veeDinE niluvalEnu
endunnaavO emainaavO..ikkaDE vunnaanu ekkaDikee pOlEnu
kaDavoopiritO...neekai kalavarinchinaanu 
kannu moosinaa..neekai vEchi vEchi vunTaanu
vEchivEchi vunTaanu..vEchi vEchi vunTaanu

neevulEni ee lOkam narakam..neevunna chOTE naa swargam
ninE kalusukOnee neelO kalasipOnee..neelO kalasipOnee
kaalamunnantakaalam dharmamunnantakaalam daivamunnantakaalam
ilalOna migilEnu maa prEma gaadha..ee amaragaadha

No comments: