సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్
పల్లవి::
ఆట తందాన తాన తాన పాట
అందాల వింత వేటలో ఆడా మగ చిందులాట
చరణం::1
ఆమె::జీవితం వెలుగు నీడల నాటకం
చిత్రమైనదిలే ప్రాణమున్న బొమ్మలాట
అతడు::నాటకం తెరలచాటున బూటకం
నమ్మకూడదులే నంగనాచి నవ్వులాట
చరణం::2
ఆమె::జీవితం తియ్య తియ్యని స్వప్నము
కన్న కలలన్ని చేసుకోపూలబాట
అతడు::బాటలో మలుపు తిరిగే చోటులో
తోవ తప్పినచో తిరుగుబాటు దేవులాట
చరణం::3
ఆమె::మైకము తీపి చేదుల ఏకము
మధువు లాహిరిలో ఆడుకో చిందులాట
అతడు::మత్తులో మోజు కలిగే కొత్తలో
మనసు కలిపినచో చెయ్యివూపి చెప్పు..టా టా
No comments:
Post a Comment