Thursday, August 07, 2014

మూగ మనసులు--1964


















సంగీతం::K.V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,గుమ్మడి,నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య. పల్లవి::

మానూ మాకును కాను..రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను..నీ మనిషిని నేను

మానూ మాకును కాను..రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను..నీ మనిషిని నేను

చరణం::1

నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా ఆసున్నాదీ
నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా ఆసున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి

మానూ మాకును కాను..రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషి నేను..నీ మనిషిని నేను

చరణం::2

పెమిదను తెచ్చి వొత్తిని యేసి
చమురును పోసి బెమ చూపేవా..ఆ
పెమిదను తెచ్చి వొత్తిని యేసి
చమురును పోసి బెమ చూపేవా
ఇంతా సేసి యెలిగించేందుకు యెనక ముందు లాడేవా

మానూ మాకును కాను..రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను..నీ మనిషిని నేను

చరణం::3 

మనిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా మనసుతోటి ఆడకు మావా
ఇరిగిపోతే అతకదు మల్లా

మానూ మాకును కాను..రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను..నీ మనిషిని నేను

No comments: