Friday, August 08, 2014

మగాడు--1976

సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు.P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,రామకృష్ణ,అంజలీదేవి,మంజుల,లత,కాంతారావు,జయమాలిని

పల్లవి::

సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది
సల సల సల సల కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే  ఊపిరి అవుతుంది
లలల లలల లలల..ఎందుకలా..ఏమిటలా   
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది

చరణం::1

విత్తనం..మొలకవుతుంది 
మొలకేమో..మొక్కవుతుంది 
మొక్కముదిరితే చెట్టవుతుంది చెట్టవుతుంది
విత్తనం..మొలకవుతుంది 
మొలకేమో..మొక్కవుతుంది 
మొక్కముదిరితే చెట్టవుతుంది చెట్టవుతుంది
ముద్దు పెరిగితే..పెరిగితే 
ముద్దు పెరిగితే..మోజవుతుంది మోజవుతుంది
లలల లలల లలల..ఎందుకలా..ఏమిటలా  
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే..ఊపిరి అవుతుంది

చరణం::2

కోరికేదో పులకిస్తుంది గుండెలోన కలకేస్తోంది 
కోరికేదో పులకిస్తుంది గుండెలోన కలకేస్తోంది
కొత్త కొత్తగా విసురోస్తుంది మెత్త మెత్తగా మెరుపొస్తుంది 
కొత్త కొత్తగా విసురోస్తుంది మెత్త మెత్తగా మెరుపొస్తుంది
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది

చరణం::3

మెరుపుంటే మబ్బుంటుంది మబ్బుంటేనే మెరుపుంటుంది 
మెరుపు మబ్బు ఒకటైతేనే..ఒకటైతేనే జల్లుకురుస్తుంది
మెరుపుంటే మబ్బుంటుంది మబ్బుంటేనే మెరుపుంటుంది 
మెరుపు మబ్బు ఒకటైతేనే జల్లుకురుస్తుంది
హరివిల్లు...పొడుస్తుంది
లలల లలల లలల..ఎందుకలా..ఏమిటలా 
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది

No comments: