Thursday, June 13, 2013

చైతన్య--1991



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, S.జానకి 
తారాగణం::నాగార్జున,గౌతమి

పల్లవి::

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ
ఒహొ పిల్లా..శుభానల్లా
సరాగంలో..వరాగాలా
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె..కలికి చిలకా
కసికసి పెదవి..కదలికల కవితల
పిలుపులు తెలిసె..కవిని గనకా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళా

చరణం::1

విశాఖలో నువ్వు నేనూ..వసంతమే ఆడాలా
హుషారుగా చిన్నాపెద్దా..షికారులే చెయ్యాలా
వివాహపు పొద్దుల్లోనే..వివాదమా ఓ బాలా
వరించినా వలపుల్లోనే..విరించిలా రాయాలా
అందచందాల అతివల్లోనా..కోపమే రూపమా
కోపతాపాల మగువల్లోనా..తప్పనీ తాళమా
చాల్లేబాల నీ ఛాఛఛీలా..సంద్యారాగాలాపనా

ఓహో లైల ఓ చారుశీలా..కోపమేలా
మనకేలా గోల.మందారమాలా మాపటేళ
ఒహొ పిల్లా..శుభానల్లా
సరాగంలో..విరాగాలా
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె..కలికి చిలకా
కసికసి పెదవి..కదలికల కవితల
పిలుపులు తెలిసె..కవిని గనకా

చరణం::2

జపించినా మంత్రం నీవే..తపించినా స్నేహంలో
ప్రపంచమూ స్వర్గం నీవే..స్మరించినా ప్రేమల్లో
చెలీ సఖీ అంటూ నీకై..జ్వలించినా ప్రాణంలో
ఇదీ కథా అన్నీ తెలిసీ..క్షమించవే ప్రాయంతో
కాళ్ళబేరాల కొచ్చాకైనా..కాకలే తీరవా
గేరు మార్చేసి పాహీ..అన్నా కేకలే ఆపవా
పోవే బాల చాలించు..గోల ప్రేమిస్తున్నా ఘాటుగా

ఓహో లైల ఓ చారుశీలా..కోపమేలా
మనకేలా గోల..మందారమాలా మాపటేళ
ఒహొ పిల్లా..శుభానల్లా
సరాగంలో..విరాగాలా
మిసమిస వయసు..రుసరుసల దరువుల
గుసగుసల తెలిసె..కలికి చిలకా
కసికసి పెదవి..కదలికల కవితల
పిలుపులు తెలిసె..కవిని గనకా
ఓహో లైల ఓ చారుశీలా..కోపమేలా
మనకేలా గోల..మందారమాలా మాపటేళా

No comments: