Thursday, June 13, 2013

చెట్టు కింద ప్లీడరు--1989



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.K.చిత్ర 
తారాగణం::రాజేంద్రప్రసాద్,కిన్నెర.

పల్లవి::

నీరుగారి పారిపోకు..నీరసాన జారిపోకు..లే మేలుకో
మారుమూల దాగిపోకు..పిరికి మందు తాగబోకు..లే మేలుకో
ఎందుకీ భయం..అందుకో జయం 
నీడలాగ నీకు తోడు నేనే లేనా 
నీరుగారి పారిపోకు..నీరసాన జారిపోకు..లే

చరణం::1

రూపురేఖలో చురుకైన చూపులో..నీవే జాకీ చాన్
కొండరాళ్ళనే నీ కండరాలతో లేపే..సూపర్ మాన్
కీచులాటలు కుంఫుల ఫైటులు రావే..ఏం చేస్తాం 
ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో..పడి చస్తాం
అహ ఎంతవారలైన..నీకు చీమ దోమ
హయ్యో..ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా
హి మాన్ లా..నువ్వు హుంకరించరా
ఆ పైన నా..ప్రాణం హరించరా
వీరస్వర్గమే..వరించరా

మాయదారి మాటలేల మాయలేడి వేటలేల..నే రాను పో
చేతగాని శౌర్యమేల..ఈదలేని లోతులేల హా 

చరణం::2

పాలపాలుడా పలనాటి బాలుడా..ఏదీ నీ ధైర్యం 
కదనవీరుడా అసహాయ శూరుడా..కానీ ఘనకార్యం 
నీకు మొక్కుతా..ఒక మూల నక్కుతా.పోరే వద్దంట 
బతుకు దక్కితే బలుసాకు మొక్కుతా..పోనీ నన్నిట్టా 
అహ కీడు నీడ చూసి..నీకు భయమా భీమా
చేయలేదు ఇంతవరకు..జీవిత భీమా
ఆంజనేయుడా..నీ శక్తి తెలుసుకో
అమ్మనాయనో..నన్నింక విడిచిపో
జంకు బొంకు..లేక నడిచిపో


మాయదారి మాటలేల..మాయలేడి వేటలేల..నే రాను పో
చేతగాని శౌర్యమేల ఈదలేని..లోతులేల నే రానుపో 
పాడు రొంపిలో..నన్ను దింపకే
ముందు నుయ్యి వెనుక గొయ్యి..చావే ఖాయం
నీరుగారి పారిపోకు..నీరసాన జారిపోకు..లే మేలుకో
మారుమూల దాగిపోకు..పిరికి మందు తాగబోకు..లే

No comments: