Monday, June 16, 2014

ప్రేమ--1989



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::వెంకటేష్,రేవతి. 

పల్లవి:
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

వద్దు వద్దు అంటూ పోతే
చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా..ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే   

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

చరణం::1

ఆద్యంతమూ లేని..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని.తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము..ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము..ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ 

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట..ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా..ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే  
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు..ఆహాహాహా
ఒక్క ముద్దు..ఆహహాహా

చరణం::2

ఓ అల్లరి ప్రేమ..ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ..ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము..నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము..నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ..నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ..నీ నెలవంక నేను
జన్మలెన్ని..మారినా ప్రేమ పేరు ప్రేమే

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట..ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా..ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే  
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది..అడగవద్దు
ఆ..ఇవ్వు ఇవ్వు..ఆహాహాహా
ఒక్క ముద్దు..ఆహహాహా

No comments: