Monday, June 16, 2014

ముగ్గురు అమ్మాయిలు--1974


సంగీతం::T.చలపతి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::చంద్రకళ,భారతి,ప్రమీల,జయసుధ, చంద్రమోహన్,రేలంగి,రమణారెడ్డి,రాజబాబు

పల్లవి::

కనులు మూసి..హాయిగా
కలత లేని..నిదురపో
కలలు రాని..నిదురపో
కలత లేని..నిదురపో
కలలు రాని..నిదురపో

చరణం::1

పేదవారి బ్రతుకుదారి తెలవారని 
చీకటీ పేదవారి బ్రతుకుదారి తెలవారని చీకటీ
వారికున్నదేమిటీ..ఆరిపోని ఆకలి..ఆకలి
కనులు మూసి..హాయిగా
కలత లేని..నిదురపో
కలలు రాని..నిదురపో

చరణం::2

తెరచుకున్న కనులలోన 
కురిసేవి కన్నీళ్ళే..కురిసేవి కన్నీళ్ళే
ఈ మూసిన కనులలోన 
ఏ బాధలు ఉండవులే..ఏ బాధలు ఉండవులే
కనులు మూసి..హాయిగా
కలత లేని..నిదురపో
కలలు రాని..నిదురపో

చరణం::3

కలిమిలేమి..లేని చోట
వెలుగునీడ..లేనిచోట 
కలిమిలేమి..లేని చోట
వెలుగునీడ..లేనిచోట
చావు బ్రతుకు..లేనిచోట
పరమ శాంతి..దొరుకుచోట
నేల తల్లి ఒడిలో..నిన్ను మరీచి
అన్ని మరీచి..నిన్ను మరీచి..అన్ని మరీచి
నిదురపో..నిదురపో..నిదురపో

No comments: