Showing posts with label ప్రేమ--1989. Show all posts
Showing posts with label ప్రేమ--1989. Show all posts

Tuesday, June 16, 2015

ప్రేమ--1989



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::వెంకటేష్,రేవతి. 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ..ఆనంద రాగం మోగిందీ
అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ..నాలో జరగందీ

చరణం::1

నింగీ నేలా ఏకం కాగా..ఈ క్షణమిలాగె ఆగిందీ
నింగీ నేలా ఏకం కాగా..ఈ క్షణమిలాగె ఆగిందీ
ఒకటే మాటన్నదీ..ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ..అదినా సొమ్మన్నదీ
పరువాలు మీటి..న న న న న
సెలయేటీ తోటి..న న న న న
పాడాలీ నేడు..న న న న న
కావాలీ తోడు..న న న న న న న న 
ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ

చరణం::2

సూర్యుని మాపీ చంద్రుని ఆపీ..వెన్నెల రోజంత కాసిందీ
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ..వెన్నెల రోజంత కాసిందీ
పగలూ రేయన్నదీ..అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ..నిజమే కమ్మన్నదీ
ఎదలోనీ ఆశ..న న న న న
ఎదగాలి బాసై..న న న న న
కలవాలీ నీవు..న న న న న
కరగాలీ నేను..న న న న న న న న 

ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనందరాగం మోగిందీ..అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ

Tuesday, May 19, 2015

ప్రేమ--1989


సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
Cast::Venkatesh,Revati.

పల్లవి::

ప్రియతమా..నా హృదయమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే ప్రతి..రూపమా
ప్రేమకే ప్రతి..రూపమా
నా గుండెలో..నిండినా గానమా
నను మనిషిగా..చేసినా త్యాగమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే ప్రతి..రూపమా

చరణం::1

శిలలాంటి నాకు..జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు..కళ తోటి నింపి
వలపన్న తీపి..తొలిసారి చూపి
యదలోని సెగలు..అడుగంట మాపి
తులి వెచ్చనైనా..ఓదార్పు నీవై
శృతిలయ లాగా..జత చేరినావు
నువ్వు లేని నన్ను..ఊహించలేను
నా వేదనంతా..నివేదించలేను
అమరం..అఖిలం..మన ప్రేమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే..ప్రతి రూపమా

చరణం::2

నీ పెదవి పైనా..వెలుగారనీకు
నీ కనులలోనా..తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే..మున్నీరు నాకు
అది వెల్లువల్లె..నను ముంచనీకు
ఏ కారు మబ్బు..ఎటు కమ్ముకున్నా
మహాసాగరాలే..నిను మింగుతున్నా
ఈ జన్మలోనా..ఎడబాటు లేదు
పది జన్మలైనా..ముడే వీడిపోదు
అమరం..అఖిలం..మన ప్రేమా

ప్రియతమా..నా హృదయమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే..ప్రతి రూపమా
ప్రేమకే..ప్రతి రూపమా
నా గుండెలో..నిండినా గానమా
నను మనిషిగా..చేసినా త్యాగమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే.ప్రతి రూపమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే..ప్రతి రూపమా

Monday, June 16, 2014

ప్రేమ--1989



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::వెంకటేష్,రేవతి. 

పల్లవి:
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

వద్దు వద్దు అంటూ పోతే
చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా..ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే   

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

చరణం::1

ఆద్యంతమూ లేని..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని.తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము..ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము..ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ 

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట..ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా..ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే  
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు..ఆహాహాహా
ఒక్క ముద్దు..ఆహహాహా

చరణం::2

ఓ అల్లరి ప్రేమ..ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ..ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము..నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము..నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ..నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ..నీ నెలవంక నేను
జన్మలెన్ని..మారినా ప్రేమ పేరు ప్రేమే

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట..ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా..ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే  
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది..అడగవద్దు
ఆ..ఇవ్వు ఇవ్వు..ఆహాహాహా
ఒక్క ముద్దు..ఆహహాహా