Thursday, June 16, 2011

ఊర్వశి--1974


సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి 
తారాగణం::శారద,సంజీవ్ కుమార్ (హింది నటుడు),సత్యనారాయణ,రాజబాబు,రాజశ్రీ,పుష్పలత,

పల్లవి::

వయసే ఊరుకోదురా..మనసే నిలువనీదురా
వయసే ఊరుకోదురా ఆ..మనసే నిలువనీదురా..ఆ
కన్నులనిండా కైపెక్కుతుంటే..వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే 
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే..ఒంటరి తనం కాల్చేస్తుంటే 
అబ్బా..వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా 

చరణం::1

ఏహే..లాలల..రోజు రోజుకొక కొత్త కోరిక రాజుకుంటుంది 
రేయి రేయికొక..వింత కోరిక రివ్వుమంటుంది
రోజు రోజుకొక కొత్త..కోరిక రాజుకుంటుంది 
రేయి రేయికొక వింత..కోరిక రివ్వుమంటుంది
రుచులెరిగిన పిచ్చి పరువం..రెచ్చిపోతుంది 
ఆ రుచులే కావాలని..పదే పదే కోరుకుంటుంది 
కన్నులనిండా కైపెక్కుతుంటే..వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే 
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే..ఒంటరి తనం కాల్చేస్తుంటే 
అబ్బబ్బ..వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా 

చరణం::2

ఏహే..లాలల..లేత నడుము నీ పిడికిట కూతవేసింది 
దోర సొగసు తనను తానే ఆరవేసుకుంది
లేత నడుము నీ పిడికిట కూతవేసింది 
దోర సొగసు తనను తానే ఆరవేసుకుంది
తడిగాలికి పురివిప్పిన తనువూగిందీ 
ఊగి ఊగి నీ కౌగిట ఒదిగి ఒదిగిపోతూ వుంది 
కన్నులనిండా కైపెక్కుతుంటే వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే  
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే ఒంటరి తనం కాల్చేస్తుంటే 
అబ్బా..వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా
వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా

No comments: